నేడు యూత్‌ మారథాన్‌ ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

నేడు యూత్‌ మారథాన్‌ ర్యాలీ

Aug 8 2024 11:48 PM | Updated on Aug 8 2024 11:48 PM

అమలాపురం రూరల్‌: అమలాపురంలో యూత్‌ మారథాన్‌ ర్యాలీ నిర్వహణకు ఏర్పాట్లు చేశామని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్‌, టీబీ నియంత్రణ అధికారి సీహెచ్‌వీ భరతలక్ష్మి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఈ ర్యాలీని భట్నవిల్లి వద్ద జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ప్రారంభిస్తారన్నారు. హెచ్‌ఐవీ ఎయిడ్స్‌పై యువతకు అవగాహన పెంచడానికి జాతీయ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సంస్థ కార్యాచరణ చేసిందన్నారు. ఇందులో భాగంగా మారథాన్‌ రెడ్‌ రన్‌–5 కిలోమీటర్లు జరుగుతుందన్నారు. ఉదయం 6 గంటలకు భట్నవల్లి బైపాస్‌ వద్ద నుంచి పేరూరు వై.జంక్షన్‌ వరకూ ఈ రన్‌ నిర్వహిస్తామన్నారు. ఈ నెల 13న ఉదయం 10.30 గంటలకు క్విజ్‌ పోటీలను అమలాపురంలోని ఏరియా హాస్పిటల్‌ జిల్లా సత్వర వైద్య సేవల కేంద్రం మీటింగ్‌ హాల్లో జరుపుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement