breaking news
youtuber vaishnavi
-
వైష్ణవి కేసులో సంతోష్ అరెస్ట్
-
చెల్లి సమాధి సాక్షిగా.. యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య
-
ఒక్క వేటుతో నా కొడుకు తల మొత్తం.. అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు అన్నాడు
-
నా కొడుకుని ఎలా చంపారంటే...! వైష్ణవి భర్త హరిబాబు తల్లి సంచలన నిజాలు
-
న్యాయం చేయండి అంటే చేయలేదు.. వాడిని చంపి నా భర్త న్యాయం చేశాడు..! వైష్ణవి కుటుంబ సభ్యుల రియాక్షన్
-
చెల్లి హత్యకు ప్రతీకారం.. యూట్యూబర్ వైష్ణవి అన్న సంచలన వీడియో
-
‘నా చెల్లికి పట్టిన గతి ఎవరికీ రావొద్దు’..
తెలంగాణ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం దారుణ హత్య జరిగింది. ఈ ఏడాది మార్చి 17న భార్య (ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి)ను చంపిన కేసులో నిందితుడు, కోరుట్లకు చెందిన చిత్తారి హరిబాబు (27)ను మృతురాలి చిన్నాన్న కుమారుడు గంధం సంతోశ్ నడిరోడ్డుపై నరికి చంపాడు. పట్టణంలోని రాజరాజేంద్ర చౌరస్తా ప్రధాన రోడ్డుపై గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ ఘటన జరిగింది.ఆ సమయంలో హరిబాబు మంచినీళ్ల కోసం మరో దుకాణం వద్దకు వెళ్లగా.. కారులో వచి్చన ఓ వ్యక్తి... హరిబాబు మెడ, తలపై పలుమార్లు కత్తితో నరకడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం నిందితుడు అదే కారులో పారిపోయాడు. అయితే అనూహ్యంగా గురువారం రాత్రి సెల్ఫీ వీడియో విడుదల చేసిన నిందితుడు సంతోశ్.. తన చెల్లిని చంపినందుకే హరిబాబును హతమార్చినట్లు పేర్కొన్నాడు. పోలీసుల ఎదుట లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. అతను కోరుట్ల పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. హరిబాబును చంపుతామని 15 రోజుల క్రితమే వీడియోల్లో కొందరు హెచ్చరించారు. అన్నట్లుగానే హతమార్చడం గమనార్హం.ప్రేమ పెళ్లి.. ఆపై హత్యతో.. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన గంధం రాణి, దుర్గాప్రసాద్ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు వైష్ణవి ఉన్నారు. వైష్ణవి (18) యూట్యూబర్‌గా గుర్తింపు పొందింది. ఆమెను కోరుట్లకు చెందిన చిత్తారి హరిబాబు యూ ట్యూబ్ వీడియోల్లో చూసి ప్రేమించానని వెంటబడ్డాడు. ఇద్దరి దీ ఒకే సామాజికవర్గం కావడంతో 2025 ఆగస్టులో పెద్దల అంగీకరాంతో పెళ్లి చేసుకున్నారు. అనంతరం వైష్ణవి, హరిబాబు మాదాపూర్‌లోని అత్తారింట్లో ఉండగా.. కొన్ని రోజులకు ఎక్కడ ఉండాలన్న విషయంలో ఇరు కుటుంబాల మధ్య కలహాలు తలెత్తాయి.అలాగే వైష్ణవి గర్భం దాల్చాక దంపతుల మధ్య విభేదాలు ముదిరాయి. ఈ క్రమంలో ఐదు నెలల గర్భిణి అయిన భార్యను మార్చి 17న రాత్రి ఆమె పుట్టింట్లోనే హరిబాబు హింసించి చంపాడు. ఈ కేసులో సుమారు మూడు నెలలపాటు జైల్లో ఉన్న అతను జూలైలో బెయిల్‌పై విడుదలై కొంతకాలం ఏపీలోని బంధువుల వద్ద తలదాచుకున్నాడు. మూడు రోజుల క్రితం నిజామాబాద్‌లో ఉంటూ కూరగాయలు, మక్కకంకులు అమ్ముతూ జీవిస్తున్న తల్లి లక్ష్మి వద్దకు వచ్చాడు.ఎవరికీ నా చెల్లి గతి పట్టొద్దనే.. ‘నా చెల్లికి పట్టిన గతి ఎవరికీ రావొద్దనే హరిబాబును చంపేశా. వైష్ణవి విషయంలో గవర్నమెంట్ నాకు న్యాయం చేయలేదు. నేను కావాలని హత్య చేయలేదు. వేరే పనిపై నిజామాబాద్ వెళ్తే అనుకోకుండా నాకు హరిబాబు కనిపించడంతో చంపేసా. నాకు శిక్ష పడకుండా మీరంతా (ప్రజలు) బయటకు వచ్చి నాకు శిక్ష పడకుండా పోరాటం చేయండి. మీ కాళ్లు మొక్కుతా’ అంటూ గంధం సంతోశ్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. మరోవైపు అతని భార్య సానియా సైతం ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. వైష్ణవిని చంపిన వ్యక్తి చనిపోయినందుకు ఆనందంగానే ఉందని.. అయితే తన భర్త ఇలా చేస్తాడని అనుకోలేదని.. జైలు నుంచి అతను వచ్చేదాకా ప్రజలే తనకు, తన ఇద్దరు పిల్లలకు తోడుండాలని కోరింది.ఇదీ చదవండి: చంపేశారని ఎఫ్ఐఆర్.. ఇన్‌స్టా వీడియోతో బయటపడిన నిజం -
నా చెల్లిని చంపినవాడిని చంపేశా
సాక్షి, నిజామాబాద్: యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్యలో ఊహించన ట్విస్ట్.. హరిబాబును తానే చంపానని వైష్ణవి సోదరుడు సంతోష్ ఒప్పుకున్నాడు. నా చెల్లిని చంపినవాడిని నేనే చంపేశా. నా చెల్లికి జరిగినట్టు ఏ ఆడబిడ్డకు జరగకూడదని ఈ పని చేశానని ఒప్పుకున్నాడు. ఈ మేరకు ఓ విడియోని రిలీజ్ చేశాడు.వీడియోలో సంతోష్ మాట్లాడుతూ.. నాకు భార్య, పిల్లలు ఉన్నారు. నా చెల్లిని చంపినందుకే వాడ్ని నేను చంపాను. వాడ్ని చంపాక ఇప్పుడు నాకు భయం వేస్తోంది. నేను బయటికి రావడానికి నన్ను సపోర్ట్ చేయండి. నాకు శిక్ష పడకుండా త్వరగా బయటకి రావడానికి సహాయం చేయండి. నేనే పోలీస్ స్టేషన్లో లొంగిపోతున్నాని తెలిపాడు. అనంతరం కోరుట్ల పోలీసుల ఎదుట నిందితుడు సంతోష్ లొంగిపోయాడు. విచారణ నిమిత్తం నిందితున్ని కోరుట్ల పోలీసులు నిజామాబాద్ పోలీసులకు అప్పగించనున్నారు.జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌కు చెందిన వైష్ణవి (24), చిథారి హరిబాబు ప్రేమ వివాహం చేసుకున్నారు. వైష్ణవి 'వైషు అమ్మ' పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతూ సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్నారు. వైష్ణవి నాలుగు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఈ ఏడాది మార్చి 17న తన నివాసంలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నారు. ఆమెను భర్త హరిబాబు కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసి పరారయ్యాడు.అదనపు కట్నం కోసం హరిబాబు, అతని కుటుంబ సభ్యులు (తల్లి లక్ష్మి, అన్నలు ఆనంద్, అశోక్) వైష్ణవిని శారీరకంగా, మానసికంగా వేధించారని పోలీసుల విచారణలో తేలింది. ఇదే విషయమై మార్చి 16 రాత్రి వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు హరిబాబును అదే రోజు కోరుట్ల శివారులో అదపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అలాగే వేధింపులకు సంబంధించి అతని కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేగింది. -
యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య
సాక్షి,నిజామాబాద్: యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. నిజామాబాద్ ఆర్ ఆర్ సెంటర్లో హరిబాబును గుర్తు తెలియని యువకుడు కొబ్బరి కాయలు కోసే కత్తితో నరికి ప్రాణాలు తీశాడు. యూట్యూబర్ వైష్ణవి కేసుకు.. హరిబాబు హత్యకు సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల మేరకు.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌కు చెందిన వైష్ణవి (24), చిథారి హరిబాబు ప్రేమ వివాహం చేసుకున్నారు. వైష్ణవి 'వైషు అమ్మ' పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతూ సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్నారు. వైష్ణవి నాలుగు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఈ ఏడాది మార్చి 17న తన నివాసంలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నారు. ఆమెను భర్త హరిబాబు కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసి పరారయ్యాడు.అదనపు కట్నం కోసం హరిబాబు, అతని కుటుంబ సభ్యులు (తల్లి లక్ష్మి, అన్నలు ఆనంద్, అశోక్) వైష్ణవిని శారీరకంగా, మానసికంగా వేధించారని పోలీసుల విచారణలో తేలింది. ఇదే విషయమై మార్చి 16 రాత్రి వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు హరిబాబును అదే రోజు కోరుట్ల శివారులో అదపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అలాగే వేధింపులకు సంబంధించి అతని కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేగింది. హరిబాబు హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి : నాలుగు నెలల గర్భిణిని చంపిన భర్త


