breaking news
Yerramukkapalli
-
Kadapa: మెడలో తాళి తెంపి ఇంటిని కూల్చేసిన టీడీపీ నేతలు
-
వైఎస్సార్ జిల్లా: ఎర్రముక్కపల్లిలో టీడీపీ నేతల దాష్టీకం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప నగరంలోని ఎర్రముక్కపల్లిలో అర్ధరాత్రి టీడీపీ నేతల దాష్టీకానికి దిగారు. ఓ ఇంటిని రెండు జేసీబీలతో నేలమట్టం చేసేశారు. ఇంట్లో ఉన్న మహిళలు, పిల్లలు, వృద్ధులను టీడీపీ నేతలు బయటకు లాగి పడేశారు. ఇల్లు కూల్చడం వెనుక టీడీపీకి చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ద్వారకనాథరెడ్డి ఉన్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారులను సైతం బలవంతంగా టీడీపీనేతలు బయటకు లాగేశారు. కూల్చిన ఇంటి వద్దే బాధితులు ఆందోళనకు దిగారు.టీడీపీ నేతలు కూల్చివేసిన ఇంటిని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాజంపేట పరిశీలకులు సురేష్ బాబు పరిశీలించారు. బాధితులను వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. దళితులమైన తమపై దౌర్జన్యంగా రాత్రికి రాత్రి దాడి చేశారని బాధితులు వివరించారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి దగ్గర బంధువులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో జేసీబీలతో ఇంటిని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వందమంది టీడీపీ మూకలు ఒక్కసారిగా ఇంటిపై దాడి చేశారని బాధితులు తెలిపారు. బాధితులకు పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్సీపీ నేతలు హామీ ఇచ్చారు.వైఎస్సార్సీపీ నేతలు, అంజాద్ బాషా, సురేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తోందని.. బలహీన వర్గాలు, దళితులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ‘‘అర్ధరాత్రి ఎర్రముక్కపల్లిలో ఎమ్మెల్యే అనుచరులు 100 మంది గుండాలతో దళితుల ఇళ్లను కూల్చివేశారు. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు అని చూడకుండా ఇల్లు కూలదోశారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? ఆఫ్గనిస్తాన్ లో ఉన్నామా..?. ఎమ్మెల్యే అనుచరుల కన్ను పడితే దాడులు చేసి దోచుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో దళితులని కూడా చూడకుండా రోడ్డున పడేశారు. ఈ ఇళ్ల కూల్చివేతను వైఎస్సార్సీపీ పూర్తిగా ఖండిస్తున్నాం..రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు దీన్ని ఖండిచాల్సి ఉంది. చట్టం మాకు చట్టం అంటూ ఒక కుటుంబాన్ని రోడ్డున పడేశారు. 100 మంది తాగి ఆ ఇంటిపై, మహిళలపై దాడికి దిగటం రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనం. ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. కడప ఎమ్మెల్యే లాంటి ప్రజా ప్రతినిధులు మనకు అవసరమా...?’’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. -
సెక్యూరిటీ గార్డ్‌పై కానిస్టేబుల్ దాడి?
కడప ఎడ్యుకేషన్: కడప నగరం ఎర్రముక్కపల్లి ఎస్బీఐ బ్రాంచ్ సెక్యూరిటీ గార్డుపై ఏఆర్ కానిస్టేబుల్ శనివారం దాడి చేసినట్లు తెలిసింది. ఉద్యోగులు బ్యాంకులో అన్ని కౌంటర్ల వద్ద వేచి ఉండటంతోపాటు బయట ప్రాంతంలో క్యూలో నిలిచొని ఉన్నారు. ఈ క్రమంలో ఏఆర్ కానిస్టేబుల్ జగన్మోహన్రెడ్డి మహిళలు ఉన్న క్యూలో వెళ్లాడని, బ్యాంకు సెక్యూరిటీ గార్డు జగన్నాథరెడ్డి వెనక్కు లాగారు. దీంతో కానిస్టేబుల్ తనపై ఆగ్రహం వ్యక్తం చేసి దాడి చేశారని సెక్యూరిటీ గార్డు చెబుతున్నారు. బ్యాంకు సిబ్బంది తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఇలా బ్యాంకుకు డబ్బు కోసం వచ్చే వాళ్లు దాడులు చేస్తే తాము విధులు నిర్వహించలేమని ఇన్చార్జి మేనేజర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కడప డీఎస్పీ అశోక్‌కుమార్, వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ ప్రతాప్‌రెడ్డి, తాలుకా, చిన్నచౌక్ ఎస్ఐలు రాజరాజేశ్వరెడ్డి, యోగీంద్ర అక్కడికి చేరుకుని, ఇద్దరిని విచారణ చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. సెక్యూరిటీ గార్డు మాట్లాడుతూ మహిళల క్యూలో వెళ్లకూడదని, వెనక్కు రావాలని చెప్పడంతో, అందరి ముందు తనపై దాడి చేశాడని తెలిపారు. కానిస్టేబుల్ మాట్లాడుతూ తన కంటే మందు చాలా మంది పురుషులు ఉన్నారని, తనను మాత్రమే వెనక్కు లాగాడని పేర్కొన్నారు. తాను దాడి చేయలేదని, కేవలం తోశానని చెప్పారు. పోలీస్ అధికారులు, బ్యాంకు మేనేజర్ జోక్యం చేసుకుని.. ఉద్యోగులందరం సమన్వయంతో వెళ్లాలని, వారిద్దరి మధ్య సర్దుబాటు చేశారు. తర్వాత సిబ్బంది విధులను యథావిధిగా నిర్వహించారు.


