breaking news
Worm medicine
-
కూరగాయల్లో కాలకూటం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఆహార పంటలపై విచ్చలవిడిగా పురుగు మందుల వాడకం - కూరగాయలు, పండ్లపై పురుగు మందు అవశేషాల్లో దేశంలోనే నంబర్ వన్ - పంటలపై యథేచ్ఛగా నిషిద్ధ పురుగు మందుల పిచికారి - ఎన్ఐపీహెచ్ఎం, వ్యవసాయవర్సిటీ పరిశోధనల్లో వెల్లడైన చేదు వాస్తవాలు ఆహా ఏమి రుచి.. అంటూ వంకాయ ఫ్రైని ఆబగా ఆరగిస్తున్నారా? టమాట, బీరకాయ, బెండకాయ కూరల్ని లొట్టలేసుకుంటూ తింటున్నారా? హెల్త్‌కు మంచిదని పండ్లను తీసుకుంటున్నారా? ఆగండి ఆగండి..! ఆ కూరగాయలు, పండ్లలో కాలకూటం ఉండొచ్చు. అతి ప్రమాదకరమైన పురుగుమందుల అవశేషాలు ఉండొచ్చు. ఆ విష రసాయనాలు.. భేషుగ్గా ఉన్న మిమ్మల్ని ఆసుపత్రి బెడ్ వరకు తీసుకెళ్లొచ్చు!! అవును మరి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే నెలకొన్నారుు. మార్కెట్లకు వస్తున్న కాయగూరల నుంచి పండ్ల దాకా వేటిపై చూసినా పురుగు మందుల అవశేషాలు కనిపిస్తున్నారుు. ఆహార పంటలపై విచ్చలవిడిగా పురుగు మందుల వాడకంలో తెలుగు రాష్ట్రాలు ‘రెడ్‌లైన్’ దాటేశారుు. ఈ విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారుు. దేశ సగటు కంటే దాదాపు రెట్టింపు పురుగు మందుల అవశేషాలు మన రాష్ట్రాల్లోని పండ్లు, కాయగూరల్లో నమోదయ్యారుు. ఇది ఆందోళన కలిగించే అంశమని వైద్యులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. విచ్చలవిడిగా పురుగు మందుల వాడకం.. దేశవ్యాప్తంగా ఆహార పంటలపై పురుగు మందుల అవశేషాలను గుర్తించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ 2006 నుంచి ప్రతి నెలా దేశంలోని ప్రధాన నగరాల్లోని 25 ల్యాబోరేటరీల్లో పరీక్షలు నిర్వహిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో రైతులు, మార్కెట్లు, సేంద్రీయ మార్కెట్లు, పాలీ హౌజ్‌ల నుంచి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సేకరించి ఈ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో హైదరాబాద్‌లోని జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ కేంద్రం(ఎన్ఐపీహెచ్ఎం), ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయవర్సిటీలో ఈ పరీక్షలు జరుగుతారుు. ఈ కేంద్రాలు వేర్వేరుగా నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో నేరుగా రైతుల వద్ద(ఫార్మ్ గేట్), రైతు బజార్లు, ఇతర మార్కెట్లలో ఆహార పంటలను కొనుగోలు చేసి పరిశోధనలు చేసి, వాటి ఫలితాలను కేంద్రానికి పంపుతారుు. 2013 -14, 2014 -15 లతో పోలిస్తే.. 2015 -16లో తెలంగాణ, ఏపీలో మార్కెట్లకు వస్తున్న కాయగూరలు, ఆకుకూరలు, పండ్లపై పురుగు మందుల అవశేషాలు విపరీతంగా పెరిగాయి. మందుల్లో మనమే నంబర్ 1 రైతు బజార్లు, సాధారణ మార్కెట్లలో అత్యధిక పురుగు మందుల అవశేషాలతో కూడిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లలో తెలంగాణ, ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారుు. రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో కర్ణాటక, నాలుగో స్థానంలో తమిళనాడు రాష్ట్రాలున్నారుు. షాపింగ్ మాల్స్, ఆర్గానిక్ స్టోర్లలో అమ్మే సేంద్రియ కూరగాయల్లో కూడా పరిమితికి మించి పురుగు మందుల అవశేషాలు ఉంటున్నారుు. ఇందులో కూడా తెలంగాణ, ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో కర్ణాటక ఉంది. ఇక పెస్టిసైడ్‌స అవశేషాలున్న పండ్ల విషయంలో తెలంగాణ తొలి స్థానంలో, ఢిల్లీ రెండో స్థానంలో ఉన్నారుు. కూరగాయలు, ఆకుకూరలు, ఇతర ఆహార పంటలపై రైతులు నిషిద్ధ పురుగు మందులను సైతం వాడేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో హైదరాబాద్‌లోని మలక్‌పేట, దిల్సుఖ్నగర్, కొత్తపేట, హయత్‌నగర్, ఎల్బీనగర్లో రైతులు, మార్కెట్ల నుంచి ఎన్ఐపీహెచ్ఎం సేకరించిన టమాటో శాంపిళ్లలో ‘ట్రైజోఫాస్’ పురుగు మందు అవశేషాలను గుర్తించారు. ఈ మందును కేవలం పత్తి, వరి, సోయాబీన్‌పై తెల్లదోమ నివారణకే వినియోగించాలి. ఈ ఏడాది జూన్‌లో మైలార్దేవులపల్లి, బుద్వేల్, హైదర్‌గూడ, గుడిమల్కాపూర్, మెహిదీపట్నంలో సేకరించిన శాంపిళ్లలోనూ ట్రైజోఫాస్ అవశేషాలు కనిపించారుు. ఆకు కూరలపై నిషేధిత మిథేల్ పారాథియాన్తో పాటు అన్ని పంటలపై నిషేధించిన మోనోక్రోటోఫాస్ అవశేషాలను భారీ స్థారుులో నిర్ధారించారు. వాస్తవానికి పంటపై పురుగు మందులు పిచికారి చేసిన వారం నుంచి పది రోజుల తర్వాతే వాటిని మార్కెట్లో విక్రరుుంచాలి. కానీ పిచికారి చేసిన రెండు నుంచి నాలుగు రోజుల్లోనే మార్కెట్లకు తెస్తున్నారు. కేన్సర్‌కు గురవుతున్నారు పంటలపై వాడే పురుగు మందుల ప్రభావం తీవ్రంగా ఉంది. పట్టణ ప్రజల కంటే గ్రామీణ ప్రాంత రైతులు ఆరోగ్యంగా ఉంటారు. కానీ వారే ఎక్కువగా కేన్సర్‌కు గురవుతున్నారు. డీడీటీ, ఆర్గనోఫాస్పరస్, ఆర్సెనిక్ వంటి పురుగుమందులు కేన్సర్ కారకాలుగా ఉన్నారుు. అమెరికా జాతీయ కేన్సర్ సంస్థ కూడా పురుగు మందులతో కేన్సర్లు పెరుగుతున్నట్టు వెల్లడించింది. - డా.రమేశ్ మాటూరి, అసోసియేట్ ప్రొఫెసర్, ఎంఎన్‌జే హాస్పిటల్ శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి -
సరుగుడు తోటలో జంట ఆత్మహత్య
* వివాహేతర బంధాన్ని వీడలేకనే.. * పది రోజుల తర్వాత వెలుగులోకి.. * మృతదేహాలను గుర్తించిన బంధువులు సఖినేటిపల్లి : కొద్ది రోజుల క్రితం కనిపించకుండా పోయిన జంట.. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలుగా కనిపించింది. వివాహేతర బంధాన్ని వీడలేక.. వీరు ఇంటికి సమీపంలో ఉన్న సరుగుడు తోటలోకి వెళ్లి, పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పది రోజుల తర్వాత దుర్వాసన వెదజల్లుతూ, కుళ్లిపోయిన పరిస్థితుల్లో వారి మృతదేహాలు వ్యవసాయ కూలీలకు కనిపించాయి. అంతర్వేదికర గ్రామంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై కృష్ణభగవాన్, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బెల్లంకొండ నర్సింహమూర్తి(34)కి సుమారు 11 ఏళ్ల క్రితం మహాలక్ష్మితో వివాహమైంది. వీరికి చాలాకాలంగా సంతానం లేదు. కొంతకాలం క్రితం నర్సింహమూర్తి గల్ఫ్ వెళ్లి, ఆరు నెలలు క్రితం స్వగ్రామానికి తిరిగొచ్చాడు. అతడి ఇంటి సమీపంలోని కొబ్బరితోటలో నివసిస్తున్న నాగులపల్లి రుక్మిణి(24)తో అతడికి పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేదర బంధానికి దారితీసింది. రుక్మిణికి గతంలో రెండు పెళ్లిళ్లయ్యాయి. వివిధ కారణాల వల్ల విడిపోయిన ఆమె తల్లితోనే ఒంటరిగా ఉంటోంది. వేర్వేరు సందర్భాల్లో రుక్మిణి, మహాలక్ష్మి మధ్య గొడవలు జరిగాయి. అలాగే నర్సింహమూర్తి ఇంట్లో కూడా గొడవలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 4 నుంచి నర్సింహమూర్తి, రుక్మిణి కనిపించకుండా పోయారు. ఈ మేరకు నర్సింహమూర్తి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికోసం గాలిస్తుండగా.. శుక్రవారం ఉదయం పొలం పనుల కోసం సముద్ర తీరానికి సమీపంలోని సరుగుడు తోటల్లోకి వెళ్లిన వారు.. అక్కడ వస్తున్న దుర్వాసనను గమనించారు. అటువైపు వెళ్లిచూడగా.. రెండు కుళ్లిపోయిన మృతదేహాలు కనిపించాయి. ఈ విషయాన్ని స్థానికులకు, వీఆర్ఓ గుండాబత్తుల మురళికి తెలిపారు. వీఆర్ఓ ఫిర్యాదుతో ఎస్సై కృష్ణభగవాన్ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడ లభ్యమైన ఆధారాల మేరకు నర్సింహమూర్తి కుటుంబ సభ్యులను ఆరాతీశారు. మృతదేహాల వద్ద ఉన్న దుస్తులు, చెప్పులు, సెల్‌ఫోన్ నర్సింహమూర్తికి చెందినవిగా వారు గుర్తుపట్టారు. అలాగే మరో సెల్‌ఫోన్, చిరిగిన నైటీని కూడా పోలీసులు కనుగొన్నారు. వీటి ఆధారంగా ఆ రెండు మృతదేహాలు నర్సింహమూర్తి, రుక్మిణివిగా పోలీసులు నిర్థారించారు. మృతుల ఇళ్లకు సుమారు అర కి.మీ.దూరంలో మృతదేహాలు పడి ఉన్నాయి. కొద్దిరోజులుగా మృతదేహాలు అక్కడే ఉండడంతో, కుక్కలు, నక్కలు పీక్కుతిన్న ఆనవాళ్లున్నాయి. మృతదేహాలను లాక్కుని వెళ్లడంతో.. అవి రెండూ కొద్దిదూరంలో పడి ఉన్నాయి. దుస్తులు కూడా చిరిగిపోయి, ఎముకలు బయటపడ్డాయి. మృతదేహాల వద్ద కూల్‌డ్రింక్, పురుగు మందు సీసా, స్టీల్ గ్లాసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.