breaking news
wins seat
-
పోలీసు అవబోయి ఎమ్మెల్యేగా!!
జైపూర్: రాజ్‌కుమార్ రోట్.. నిన్నటివరకు సాధారణ మధ్యతరగతి యువకుడు. పోలీసు రిక్రూట్మెంట్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగి. మూడు నెలల క్రితం ఎన్నికల్లో పోటీ చేయమని ఓ పార్టీ అడిగితే సరే అన్నారు. అనూహ్య రీతిలో విజయం సాధించారు. పోలీసు కాబోయి ఎమ్మెల్యే అయ్యారు. త్వరలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న రాజ్‌కుమార్.. రాజస్తాన్ అసెంబ్లీలో గిరిజనుల ప్రతినిధిగా అడుగుపెట్టనున్నారు. దుంగార్పూర్లోని ఖూనియా గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. దీంతో ఛోరసీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాల్సిందిగా భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) రాజ్‌కుమార్‌ను కోరింది. సరేనన్నారు. బీజేపీ అభ్యర్థి సుశీల్ కటారాపై 12,934 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. -
స్వల్ప మెజారిటితో నెగ్గిన ప్రచండ
నేపాల్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న సీపీఎన్-మావోయిస్టు పార్టీ అధ్యక్షుడు ప్రచండ స్వల్ప మెజారిటీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సిరాహ స్థానం నుంచి పోటీచేసిన ప్రచండ కేవలం 900 ఓట్ల తేడాతో గెలిచారు. కాగా ఖాట్మాండు స్థానం నుంచి చిత్తుగా ఓడిపోయారు. ఇక్కడ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో మావోయిస్టు పార్టీ ఘోరంగా ఓడిపోగా, రెండు స్థానాల్లో పోటీచేసిన ప్రచండ అతికష్టమ్మీద ఓ చోట గెలిచారు. ఆయన సమీప బంధువులు ముగ్గురు చిత్తుగా ఓడిపోయారు.