breaking news
Wife elopes with lover
-
కుటుంబాన్ని చిదిమేసిన ఇన్స్టాగ్రామ్ ప్రేమ!
సాక్షి, చెన్నై: ఇన్స్టాగ్రామ్ ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ఇందులో పరిచయమైన వ్యక్తితో భార్య వెళ్లిపోవడంతో భర్త ఉన్మాదిగా మారాడు. తన ముగ్గురు పిల్లల్ని గొంతు కోసి చంపేసి ఆపై పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లా పట్టుకోట్టైలో శనివారం వెలుగుచూసింది. ఈ ప్రాంతంలోని కోయిల్ సముద్రం గ్రామానికి చెందిన వినోద్ కుమార్ (38), నిత్య (35)కు పన్నెండేళ్ల క్రితం వివాహమైంది.తొలుత వినోద్ కుమార్ సొంతంగా వ్యాపారం చేయగా.. నష్టాలు రావడంతో ఫొటోగ్రాఫర్‌గా మారి ఆపై ఓ హోటల్లో పనికిచేరాడు. ఈ దంపతులకు కుమార్తెలు ఓవియ(11), కీర్తి(8), కుమారుడు ఈశ్వర్(5) ఉన్నారు. ఆర్థికంగా నష్టపోవడంతో ఆ కుటుంబానికి సమస్యలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో నిత్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది.వాటికి ఆకర్షితుడైన మన్నార్గుడికి చెందిన ఓ యువకుడు ఆమెను బుట్టలో వేసుకున్నాడు. ఆమె ఆర్థిక కష్టాలను గుర్తించి ఆ ఇంటికి కావాల్సిన వస్తువులను కొనిస్తూ ఆమెకు దగ్గరయ్యాడు. వీరిద్దరూ సన్నిహితంగా మెలగుతుండటాన్ని గుర్తించిన వినోద్‌కుమార్.. నిత్యను మందలించాడు. దీంతో తనకు విలాసవంతమైన జీవితం కావాలంటూ ఆ యువకుడితో నిత్య ఇటీవల వెళ్లిపోయింది.ఉన్మాదిగా మారి...ఆమెను బతిమిలాడినా తిరిగి రాకపోవడంతో విజయ్‌కుమార్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో పెద్ద కుమార్తె ఓవియ బడి మానేసి తన చెల్లి, తమ్ముడి లాలన చూసుకునేది. క్రమంగా వినోద్‌కుమార్ మానసికంగా కుంగిపోతూ ఉన్మాదిగా మారాడు. శుక్రవారం రాత్రి పకోడీని తన తమ్ముడు, చెల్లికి ఓవియ తినిపిస్తుండగా, మద్యం మత్తులో వచ్చిన వినోద్‌కుమార్ ఓవియ, ఈశ్వర్‌ను బయటకు పంపించాడు.మరో కుమార్తె కీర్తిని తన ఒడిలో పెట్టుకుని లాలిస్తూ, క్షణాల్లో కత్తితో ఆమె గొంతు కోసేశాడు. కీర్తి పెడుతున్న కేకలతో ఓవియ, ఈశ్వర్ ఇంట్లోకి పరుగులు తీశారు. క్షణాల్లో మిగిలిన ఇద్దరినీ గొంతుకోసి చంపేశాడు. రక్తపు మడుగులో మరణించిన పిల్లలను చూసి ఏడుస్తూ, తన భార్యకు గుణపాఠం చెప్పేశానంటూ తాను పనిచేస్తున్న హోటల్‌కు వెళ్లి ఈ విషయాన్ని చెప్పాడు. అక్కడి నుంచి మదుక్కూర్ పోలీసు స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. -
పెళ్లైన 3 రోజులకే ప్రియుడితో ఉడాయించిన నవవధువు.. భర్త అదృశ్యం
సాక్షి, అనంతపురం: వివాహమైన మూడు రోజులకే ప్రేమించిన వ్యక్తితో నవ వధువు పరారయ్యింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఇంటినుంచి వెళ్లిపోయాడు. పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లికి చెందిన బండ్లపల్లి తిమ్మరాజు, ప్రశాంత్‌కుమార్ సోదరులు. వీరికి తండ్రి లేడు. బతుకు తెరువు కోసం తల్లి అంజనమ్మ కువైట్‌కు వెళ్లింది. ఈ క్రమంలో సోదరులిద్దరూ అనంతపురానికి వలసవచ్చి నగర శివారులోని కురుగుంట వైఎస్సార్ కాలనీ నివాసముంటున్నారు. తిమ్మరాజు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, ప్రశాంత్‌కుమార్ డిగ్రీ పూర్తయి ఇంటివద్దనే ఉంటున్నాడు. గత నెల 9న ఓ యువతితో తిమ్మరాజుకు వివాహమైంది. ఈ పెళ్లి ఇష్టంలేని ఆమె పెళ్లైన మూడో రోజే అంతకు ముందు తాను ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయింది. నవ వధువు కనిపించకపోయే సరికి కంగారుపడ్డ తిమ్మరాజు, బంధువులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన తిమ్మరాజు ఈ నెల 9న సాయంత్రం 6 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సోదరుడు ప్రశాంత్‌కుమార్ పలుచోట్ల వెతికాడు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో సోమవారం అనంతపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ప్రియుడు కోసం ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వస్తే. -
లవర్‌తో భార్య పరార్.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి భర్త ఆత్మహత్య
బెంగళూరు: వివాహేతర సంబంధాలు జీవితాలనే నాశనం చేస్తున్నాయి. ఓ మహిళ తన ప్రియుడితో వెళ్లిపోయిన క్రమంలో మనస్తాపం చెందిన భర్త తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన కర్ణాటకలోని తుమకూర్ జిల్లా, పీహెచ్ కాలనీలో గురువారం వెలుగు చూసింది. మృతుడిని సమీయుల్లాగా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సమీయుల్లాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొద్దిరోజుల కింద భార్య సహీరా బాను.. ప్రియుడితో కలిసి సౌదీ అరేబియాకు వెళ్లిపోయింది. అక్కడ పనిమనిషి ఉద్యోగం చేస్తూ.. ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. భర్తకు అప్పుడప్పుడు వీడియో కాల్స్ చేస్తూ వారు తిరిగే ప్రదేశాలను చూపించేది. ఈ క్రమంలో ఇంటికి రమ్మని భర్త ఎంత బతిమిలాడినా ఆమె మనసు కరగలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సమీయుల్లా.. తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి అనంతరం తానూ విషం తాగాడు. ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురు పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని బెంగళూరు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: బిహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్.. 8 నెలలుగా వసూళ్ల పర్వం -
హనీమూన్ నుంచి తిరిగొచ్చి.. భర్తకు షాకిచ్చి!
న్యూఢిల్లీ: ఆ జంటకు కొత్తగా పెళ్లయింది. హిమాలయ పర్వత సానువుల వద్ద ఉన్న బాగ్దోగ్రాకు హనీమూన్‌కు వెళ్లొచ్చారు. హనీమూన్ ముగించుకొని ఇంటికి తిరిగి వెళుతుండగా భర్తకు షాకిస్తూ.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన వధువు అదృశ్యమైంది. సోమవారం సాయంత్రం ఎయిర్‌పోర్టులోని వాష్‌రూమ్‌లోకి వెళ్లిన వధువు ఎంతకు బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన భర్త సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్)ను ఆశ్రయించాడు. దీంతో అతను, సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఎయిర్‌పోర్టులోని సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నీలిరంగు చీర కట్టుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్లిన అతని భార్య.. బయటకు వచ్చేటప్పుడు మాత్రం బురఖా ధరించింది. సీసీటీవీ దృశ్యాల్లో ఆమె ఎత్తు, బరువు, నడకతీరును గమనించిన భర్త బురఖాలో ఉన్నది తన భార్యేనని తెలుసుకొని బిత్తరపోయాడు. ఆమె బురఖా ముసుగు కప్పుకొని వెళ్లి ఓ వ్యక్తిని కలిసింది. అతనికి మరొకడు జత కలిశాడు. ఆ ముగ్గురు ట్యాక్సీల వద్దకు వెళ్లి జనంలో కలిసిపోయారు. ఈ దృశ్యాలన్నింటినీ చూసి బిత్తరపోయిన ఆ నూతన వరుడు లబోదిబోమంటున్నాడు. లక్నో చెందిన ఓ వ్యక్తి విషయంలో ఈ ఘటన జరిగింది. పెళ్లయి హనీమూన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత అతని భార్య తన ప్రియుడితో కలిసి లేచిపోయి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. ఉద్దేశపూరితంగానే ఆమె తన హ్యాండ్ బ్యాగ్‌ను, సెల్‌ఫోన్‌ను భర్త వద్ద వదిలేసి వెళ్లిందని భావిస్తున్నారు. ఈ దృశ్యాలు చూసి దిగ్భ్రాంతుడైన సదరు భర్త పోలీసులకు ఫిర్యాదు కూడా చేయకుండా అక్కడి నుంచి నిష్క్రమించాడు. అతని భార్య స్వచ్ఛందంగా వెళ్లిపోవడంతో ఆమె ప్రియుడితో కలిసి వెళ్లి ఉంటుందని, బాధితుడు ఫిర్యాదు చేయనందున కేసు కూడా నమోదు కాకుండానే ఈ వ్యవహారం ఇంతటితో ముగిసిందని పోలీసులు అంటున్నారు.