breaking news
water Steam
-
శ్రీశైల జలాశయ నీటిమట్టం: 802.70 అడుగులు
కర్నూలు(శ్రీశైలం): శ్రీశైల జలాశయ నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 802.70 అడుగులుకు చేరింది. జలాశయ పరిసర ప్రాంతాలలో 15 మి.మీటర్ల వర్షపాతం కురిసినప్పటికీ పగటివేళల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల 65 క్యూసెక్కుల నీరు ఆవిరి అయినట్లు గేజింగ్ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 30.3154 టీఎంసీల నీరు ఉంది. -
‘వేడి గురుగ్రహం’పై నీటి ఆవిరి!
మన సౌరకుటుంబంలోనే అతిపెద్దదైన గురు గ్రహం కన్నా ఏకంగా ఆరు రెట్లు పెద్దగా ఉన్న ‘టౌ బూ బి’ అనే ఓ వేడి గ్రహంపై వాతావరణంలో నీటి ఆవిరి ఉన్నట్లు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇన్ఫ్రారెడ్ పద్ధతికి డాప్లర్ టెక్నిక్‌ను జోడించి ఆ నీటిఆవిరిని కనుగొన్నట్లు వారు తెలిపారు. ‘టౌ బూటిస్’ అనే నక్షత్రం చుట్టూ అతి సమీపం నుంచే తిరుగుతున్న ‘టౌ బూ బి’ తన నక్షత్రాన్ని 3.3 రోజులకే ఓసారి చుట్టి వస్తోందట. మన గురుగ్రహం సూర్యుడికి దూరంగా, చల్లగా ఉంటుంది. కానీ ఇతర నక్షత్రాల చుట్టూ ‘టౌ బూ బి’ లాంటి వేడి గురుగ్రహాలు చాలానే తిరుగుతున్నాయట. ‘టౌ బూ బి’పై నీటి ఆవిరిని గుర్తించేందుకు ఉపయోగించిన ఈ పద్ధతితో ఇతర గ్రహాల వాతావరణాన్ని కూడా అధ్యయనం చేయొచ్చని, సౌరకుటుంబం ఆవలి గ్రహాలపై నీరు, ఇతర అణువులను కూడా గుర్తించొచ్చని భావిస్తున్నారు.