‘వేడి గురుగ్రహం’పై నీటి ఆవిరి! | Scientists detect water around a hot Jupiter | Sakshi
Sakshi News home page

‘వేడి గురుగ్రహం’పై నీటి ఆవిరి!

Mar 21 2014 5:31 AM | Updated on Sep 2 2017 5:00 AM

‘వేడి గురుగ్రహం’పై నీటి ఆవిరి!

‘వేడి గురుగ్రహం’పై నీటి ఆవిరి!

గ్రహం కన్నా ఏకంగా ఆరు రెట్లు పెద్దగా ఉన్న ‘టౌ బూ బి’ అనే ఓ వేడి గ్రహంపై వాతావరణంలో నీటి ఆవిరి ఉన్నట్లు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

మన సౌరకుటుంబంలోనే అతిపెద్దదైన గురు
 గ్రహం కన్నా ఏకంగా ఆరు రెట్లు పెద్దగా ఉన్న ‘టౌ బూ బి’ అనే ఓ వేడి గ్రహంపై వాతావరణంలో నీటి ఆవిరి ఉన్నట్లు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇన్‌ఫ్రారెడ్ పద్ధతికి డాప్లర్ టెక్నిక్‌ను జోడించి ఆ నీటిఆవిరిని కనుగొన్నట్లు వారు తెలిపారు. ‘టౌ బూటిస్’ అనే నక్షత్రం చుట్టూ అతి సమీపం నుంచే తిరుగుతున్న ‘టౌ బూ బి’ తన నక్షత్రాన్ని 3.3 రోజులకే ఓసారి చుట్టి వస్తోందట.
 
 మన గురుగ్రహం సూర్యుడికి దూరంగా, చల్లగా ఉంటుంది. కానీ ఇతర నక్షత్రాల చుట్టూ ‘టౌ బూ బి’ లాంటి వేడి గురుగ్రహాలు చాలానే తిరుగుతున్నాయట. ‘టౌ బూ బి’పై నీటి ఆవిరిని గుర్తించేందుకు ఉపయోగించిన ఈ పద్ధతితో ఇతర గ్రహాల వాతావరణాన్ని కూడా అధ్యయనం చేయొచ్చని, సౌరకుటుంబం ఆవలి గ్రహాలపై నీరు, ఇతర అణువులను కూడా గుర్తించొచ్చని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement