breaking news
Water purification center
-
ఇరాన్ వార్ యూటర్న్.. గల్ఫ్‌లో నీటి యుద్ధం మొదలైందా?
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. మూడో ప్రపంచ యుద్ధమే కనుక జరిగితే అది నీటి కోసమే అని పలువురు నిపుణులు చాలాకాలంగా చెబుతున్న క్రమంలో అది వాస్తవమే అనే విధంగా ఇరాన్ యుద్ధం టర్న్ తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధంలో భాగంగా నీటిశుద్ధి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు చూస్తుంటే తాగునీరు యుద్ధానికి లక్ష్యంగా మారుతుందనే విషయం స్పష్టమైంది. రెండు వైపుల వారు ఆయా దేశాల్లోని నీటి వనరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.గల్ఫ్ దేశాల బలం చమురు అయితే.. బలహీనత నీరు. ఇరాన్-అమెరికా యుద్ధం గల్ఫ్ దేశ దుర్భలత్వాన్ని బయటపెట్టింది. ఎడారి వాతావరణం ఉన్న గల్ఫ్ దేశాల్లో నీటికొరత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధంలో భాగంగా నీటిశుద్ధి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. తమ నీటి శుద్ధి ప్లాంట్‌పై దాడి చేశారని ఇరాన్ ఆరోపించగా, తమ ప్లాంట్‌పై ఇరాన్ దాడి చేసిందని బహ్రెయిన్ తెలిపింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత గ్లోబల్ మార్కెట్లు ఆత్రుతగా పర్షియన్ గల్ఫ్ ఇంధన మౌలిక సౌకర్యాలను పరిశీలించడం ప్రారంభించాయి. అయితే యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ రెండు ప్రాంతాల్లో దుర్బలమైన తాగు నీటి అంశం అతిపెద్ద సమస్యగా ఉద్భవించింది. దీంతో రెండు వైపుల వారు ఆయా దేశాల్లోని నీటి వనరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా నీటి శుద్ది ప్లాంట్లపై దాడులు ప్రారంభించారు. ఆయా దేశ పౌరులను తీవ్ర ఇక్కట్లలోకి నెట్టాలన్నది వారి వ్యూహంగా తెలుస్తోంది.పశ్చిమాసియాలోనే అధికం..గల్ఫ్ దేశాల్లో తాగునీటి కొరత అత్యంత తీవ్రంగా ఉంది. పశ్చిమాసియాలో మంచినీటి కొరత కారణంగా ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న నీటిని శుద్ధి చేసి మంచినీటిగా మార్చేందుకు నీటి శుద్ధి ప్లాంట్లను (డీసాలినేషన్ ప్లాంట్స్.. ఉప్పునీటిని తాగునీటిగా మార్చే యంత్రాలు) ఆయా దేశాలు విస్తృతంగా ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో ప్రపంచంలోని 60 శాతం నీటి శుద్ధి యూనిట్లు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ తదితర అరబ్ దేశాల వారు అత్యధికంగా వీటిపైనే ఆధారపడటంతో శత్రు దేశానికి ఇప్పుడు అవే అత్యంత విలువైన లక్ష్యాలుగా మారాయి. అలాగే ఇరాన్‌లోని ప్లాంట్లను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నాయి. కాగా, ఒక పెద్ద ప్లాంట్ దెబ్బతింటే కొన్ని రోజుల్లోనే రాజధానులు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని అమెరికాకు చెందిన కొన్ని రహస్య నివేదికలు హెచ్చరించాయి.గల్ఫ్ దేశాలు ఆధారపడే స్థితి ఇలా.. కువైట్: 90% నీరు డీసాలినేషన్ ద్వారా మంచి నీరుయుఏఈ: 90% నీరు డీసాలినేషన్ ద్వారా తాగునీరు ఒమాన్: 86% నీరు డీసాలినేషన్ ద్వారా మంచి నీరు దొరుకుతుంది.బహ్రెయిన్: 80 శాతం.. అత్యధికంగా డీసాలినేషన్ మీద ఆధారపడుతోంది. సౌదీ అరేబియా: 70% నీరు డీసాలినేషన్ ద్వారా తాగు నీరు ఖతార్: 70 శాతం చిన్న దేశం కావడంతో నిల్వలు తక్కువ, ప్లాంట్లపై అధికంగా ఆధారపడే పరిస్థితి.నీటిపై యుద్ధ ప్రభావం.. యుద్ధం నేపథ్యంలో ప్లాంట్లకు ప్రమాదం జరిగి నీటి సరఫరా ఆగిపోతే, ఆహార సంక్షోభం మరింత పెరుగుతుంది. గల్ఫ్ దేశాలు 80–90% ఆహారాన్ని దిగుమతి చేసుకుంటాయి. నీరు లేకపోతే ఆహారం కూడా నిల్వ చేయలేరు. ఆరోగ్య బీమా కంపెనీలు యుద్ధ ప్రమాద కవరేజీ తొలగించడంతో సరుకు రవాణా కూడా ఆగిపోతోంది.ఇరాన్‌కు నష్టం తక్కువే.. ఇరాన్ తాగునీటి కోసం ప్రధానంగా డ్యామ్‌లు, భూగర్భ జలాలు మీద ఆధారపడుతుంది. అందువల్ల తీరప్రాంత డీసాలినేషన్ ప్లాంట్లపై దాడులు జరిగినా, ఇరాన్‌కు పెద్ద నష్టం ఉండదు. కానీ గల్ఫ్ దేశాలకు ఇది ప్రాణాంతక సమస్యగా ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలు నీటి భద్రతను జాతీయ భద్రత స్థాయిలో చూడాల్సిన సమయం వచ్చింది. -
మిఠీనది పరిరక్షణకు బీఎంసీ కసరత్తు
- జలశుద్ధీకరణ కేంద్రం నిర్మాణానికి ఆమోదం - నదిపై అక్రమంగా వెలసిన కట్టడాలు, పరిశ్రమలపై చర్యలు సాక్షి, ముంబై: మిఠీనది పరిరక్షణ, జలాల శుద్ధికి మహానగర పాలక సంస్థ (బీఎంసీ) శ్రీకారం చుట్టింది. నదిలో పెరిగిపోయిన కాలుష్యకారకాలను తక్షణమే తొలగించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నదిపై జల శుద్ధీకరణ కేంద్రాన్ని నిర్మించాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మీఠీనది పరిరక్షణ చర్యలు చేపట్టాలని, కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని బీఎంసీకి ఆర్నెళ్ల కిందటే మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నోటీసు జారీ చేసింది. ఇందుకు స్పందించిన బీఎంసీ పరిపాలన విభాగం ఈ మేరకు జలశుద్ధీకరణ కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించింది. మిఠీనదిలోకి ఎక్కడెక్కడి నుంచి మురికి కాల్వలు, నాలాలు వచ్చి కలుస్తున్నాయో, జల శుద్ధీకరణ కేంద్రం ఎక్కడ నిర్మించాలనే విషయాలను అధ్యయనం చేయడానికి ఐటీఐకి చెందిన నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ బీఎంసీ పరిపాలన విభాగానికి సూచనలు చేయనుంది. కుచించుకుపోయిన నది మీఠీనదిలోకి నగరం, శివారు ప్రాంతాల్లోని అనేక మురికి కాల్వలు, నాలాలు వచ్చి కలుస్తాయి. నగర ప్రజలు దైనందిన పనులకు వాడే నీటితోపాటు పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాలు కూడా ఇందులోనే కలువడంతో నది కాలుష్యకాసారంగా మారింది. ఫలితంగా 2005 జూలై 26న కురిసిన భారీ వర్షాలకు నగరంతోపాటు శివారు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. అప్పట్లో వచ్చిన వరదలకు 200పైగా మంది చనిపోయారు. ఆస్తి నష్టం కూడా భారీగా సంభవించింది. ఈ ఘటనతో కళ్లు తెరిచిన ప్రభుత్వం వరదలకు ప్రధాన కారణాలను అధ్యయనం చేసేందుకు చితలే కమిటీని నియమించింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన ఈ కమిటీ మిఠీనది కుచించుకుపోవడంతో వర్షపు నీరు సాఫీగా వెళ్లడం లేదని, దీంతోపాటు నదికి ఇరువైపులా మట్టిపోసి అందులో వెలసిన అక్రమ కట్టడాలే వరదముప్పునకు ప్రధాన కారణంగా తేల్చి చెప్పింది. అప్పటి నుంచి మిఠీనది అభివృద్ధి అంశం తెరమీదకు వచ్చింది. సుమారు 500 పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు ఈ నదిలో సుమారు 500పైగా పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు వచ్చి చేరుతున్నాయని కాలుష్యనియంత్రణ మండలి విడుదల చేసిన జాబితాలో స్పష్టం చేసింది. ఇందులో నుంచి ఏ పరిశ్రమ నుంచి ఎంతమేర కలుషిత నీరు చేరుతుందనేది పరిశీలించాల్సి ఉంది. ఆ తరువాత ఆయా యజమానులపై చర్యలు తీసుకుంటామని బీఎంసీ డిప్యూటీ కమిషనర్ అశోక్ ఖైరే వెల్లడించారు. అదే విధంగా మిఠీనదిని ఆక్రమించుకొని రెండు వైపులా వెలసిన అక్రమ కట్టాడాలు, పరిశ్రమలపై చర్యలు తీసుకొనున్నట్లు చెప్పారు. మీఠినది పరిరక్షణకు అవసరమైన అన్నిచర్యలను తీసుకొంటామని ఆయన చెప్పారు.


