breaking news
Washington Post-ABC survey
-
ట్రంప్ పాలనపై పెదవి విరుపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పనితీరును సుమారు 60 శాతం మంది ప్రజలు తిరస్కరించారు. 50 శాతం మంది ట్రంప్‌పై అభిశంసనకు మద్దతు పలికినట్లు వాషింగ్టన్ పోస్ట్–ఏబీసీ న్యూస్ పోల్ సర్వేలో తేలింది. 36 శాతం మంది ట్రంప్ పనితీరుపై సంతృప్తిగా ఉన్నట్లు సర్వే తేల్చింది. ఆగస్టు 26–29 మధ్య ఈ అధ్యయనం చేపట్టారు. ట్రంప్‌ను అభిశంసించేందుకు కాంగ్రెస్ సంసిద్ధం కావాలని 49 శాతం మంది అభిప్రాయపడగా, 46 శాతం మంది అందుకు భిన్నంగా స్పందించారు. అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యంపై రాబర్ట్ ముల్లర్ జరుపుతున్న విచారణలో జోక్యం చేసుకోవడం ద్వారా ట్రంప్ న్యాయ ప్రక్రియకు అడ్డంకులు సృష్టించారని 53 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవహారాల్లో ట్రంప్ తీరును 45 శాతం మంది సమర్థించగా, అంతే శాతం మంది తిరస్కరించారు. -
చెత్త ప్రెసిడెంట్ ట్రంప్
‘వాషింగ్టన్ పోస్ట్–ఏబీసీ’ సర్వేలో 36 శాతమే మద్దతు వాషింగ్టన్: మొదటి 6 నెలల పాలనలో అతి తక్కువ ప్రజాదరణ పొందిన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రికార్డు సృష్టించారు. ‘వాషింగ్టన్ పోస్ట్–ఏబీసీ న్యూస్’ నిర్వహించిన ఈ సర్వేలో ట్రంప్‌కు కేవలం 36 శాతం అమెరికన్లే మద్దతు తెలిపారు. గత 70 ఏళ్లలో ఇదే అతి తక్కువని ఏబీసీ న్యూస్ పేర్కొంది. ట్రంప్ 100 రోజుల పాలనపై ‘వాషింగ్టన్ పోస్ట్–ఏబీసీ న్యూస్’ నిర్వహించిన సర్వేలో 42 శాతం ప్రజాదరణ దక్కగా 80 రోజుల వ్యవధిలో అది 6 శాతం తగ్గడం గమనార్హం. దాదాపు 48 శాతం అమెరికన్లు ట్రంప్ నిర్ణయాల్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ పోల్‌ను ట్విటర్లో ట్రంప్ తప్పుబడుతూ.. ‘ఇది కూడా ఎన్నికల సమయంలో నిర్వహించిన తప్పుడు సర్వేలాంటిదే’ అని పేర్కొన్నారు. ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్, అల్లుడు కుష్నర్, ఎన్నికల ప్రచార శిబిరం మేనేజర్ పాల్లు రష్యా లాయర్‌తో సమావేశమవడాన్ని 66 శాతం వ్యతిరేకించగా కేవలం 26 శాతమే సమర్థించారు. ఇక 2016 అధ్యక్ష ఎన్నికల్ని రష్యా ప్రభావితం చేసిందని 60 శాతం చెప్పగా.. ట్రంప్ సహాయకులు అలాంటి ప్రయత్నం చేసి ఉండవచ్చని 41 శాతం పేర్కొన్నారు. రష్యా సాయంతో ట్రంప్ లాభపడ్డారని 44 శాతం, అధ్యక్ష ఎన్నికల్ని రష్యా ప్రభావితం చేయలేదని 31 శాతం అమెరికన్లు చెప్పారు. పన్నులు తగ్గించడం కంటే అందరికీ ఆరోగ్య బీమా ముఖ్యమని 63 శాతం మంది స్పష్టం చేశారు. ఒబామా కేర్‌కు 50 శాతంపైగా మద్దతు ప్రకటించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయంగా అమెరికా ప్రభావం తగ్గుతుందని 48 శాతం మంది పేర్కొన్నారు.