breaking news
warm welcome
-
నార్వే జట్టుకు నీరాజనం
ఓస్లో (నార్వే): ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఓడి ఇంటి బాట పట్టిన నార్వే ఫుట్‌బాల్ జట్టుకు స్వదేశంలో ఘనస్వాగతం లభించింది. టోర్నీ ఆసాంతం అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆటగాళ్లకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరిన నార్వే... ఇంగ్లండ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్‌ను బోల్తా కొట్టించడంతోపాటు ఈ టోర్నీ మొత్తం నార్వే అద్భుత ప్రదర్శన కనబర్చింది. స్టార్ స్ట్రయికర్ ఇర్లింగ్ హాలాండ్ ఏడు గోల్స్‌తో జట్టును ఒంటిచేత్తో నడిపించగా... మైదానం బయట అభిమానులంతా ‘వైకింగ్ రో’ సంబరాలతో ప్రత్యేకత చాటుకున్నారు.గ్రూప్ ‘ఐ’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి 6 పాయింట్లతో నాకౌట్‌కు అర్హత సాధించిన నార్వే జట్టు... ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది. రౌండ్–32లో ఐవరీ కోస్ట్‌పై విజయం సాధించిన నార్వే... ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్‌ను మట్టికరిపించింది. దీంతో నార్వే పేరు మారుమోగిపోయింది. ఆరున్నర అడుగుల స్ట్రయికర్ ఇర్లింగ్ హాలాండ్ 5 మ్యాచ్‌ల్లోనే ఏడు గోల్స్ సాధించడంతో పాటు... తన ప్రవర్తనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్నాడు. వరల్డ్‌కప్‌లో చక్కటి ప్రదర్శన అనంతరం సోమవారం స్వదేశానికి చేరుకున్న టీమ్‌కు... అభిమానులకు అనూహ్య స్వాగతం పలికారు. వేలాది మంది అభిమానులు విమానాశ్రయానికి చేరుకొని ‘వైకింగ్ రో’ సంబరాలతో హోరెత్తించారు. కనుచూపు మేరంతా అభిమానులతో విమానాశ్రయం జనసంద్రాన్ని తలపించగా... అనంతరం టీమ్ ప్లేయర్లు ఓపెన్ టాప్ బస్సులో ముందుకు సాగారు. దారి పొడవునా అభిమానులు ప్లేయర్లకు శుభాకాంక్షలు తెలుపుతుండగా... నార్వే యువరాజు హాకాన్ డ్రమ్స్ వాయిస్తూ ‘వైకింగ్ రో’ సంబరాలకు నేతృత్వం వహించడం విశేషం. క్వార్టర్ ఫైనల్లోనూ చక్కటి ఆటతీరు కనబర్చిన నార్వే... అదనపు సమయంలో బెలింగ్‌హామ్ చేసిన గోల్‌తో ఇంగ్లండ్ జట్టు ముందంజ వేసింది. ఏంటీ వైకింగ్... వరల్డ్‌కప్ సమయంలో నార్వే ప్లేయర్లు, అభిమానులు, ప్రజలు ఇలా ప్రతీ ఒక్కరూ ‘వైకింగ్ రో’ సంబరాల్లో భాగస్వాములయ్యారు. ఇంతకూ ఏంటీ ‘వైకింగ్ రో’... ఎందుకు దానికి అంత ప్రత్యేకత అంటే... ఇది ప్రాచీన నౌకాయాన సంస్కృతికి నిదర్శనం. క్రీస్తు శకం 8వ శతాబ్ద కాలంలో సముద్రయానానికి ప్రత్యేకమైన పడవలు వినియోగించేవారు. లాంగ్షిప్స్ అని పిలుచుకునే తేలికపాటి చెక్క పడవలను నడపడంలో నార్వే ప్రజలు అప్పట్లో సిద్ధహస్తులు.సుదూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు వైకింగ్ యోధులంతా ఒక లయతో... క్రమశిక్షణతో కలిసికట్టుగా పడవలను ముందుకు నడిపేవారు. ఇది వారి బృంద స్ఫూర్తిని ప్రస్ఫుటించేంది. అయితే ఆధునిక కాలంలో వైకింగ్ పడవలు లేకపోయినా... తమ చారిత్రక వారసత్వాన్ని కొనసాగిస్తున్న నార్వే ప్రజలు... ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ప్లేయర్ల ‘టీమ్ స్పిరిట్’కు చిహ్నంగా మైదానంలో ‘వైకింగ్ రో’ సంబరాలు ప్రారంభించగా... అది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాషన్‌గా మారిపోయింది. -
లండన్ లో రామ్ చరణ్.. చుట్టుముట్టిన మెగాఫ్యాన్స్ (ఫొటోలు)
-
పులివెందులలో జననేత.. ఆప్యాయంగా పలకరిస్తూ.. ముందుకు సాగుతూ (ఫొటోలు)
-
ఢిల్లీలో భూటాన్ రాజుకు ఘనస్వాగతం
న్యూఢిల్లీ: భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్చుక్కు ఆదివారం ఢిల్లీలో భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ విమానాశ్రయంలో ఆయనకు ఆహ్వానం పలికారు. అనంతరం ఆయనతో భేటీ అయ్యారు. భారత్‌లో రాజు వాంగ్‌చుక్ ఎనిమిది రోజుల పర్యటన ఈ నెల 3న అస్సాం రాజధాని గువాహటిలో మొదలైంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆయన సమావేశం కానున్నారు. -
తొలిసారి హైదరాబాద్ గడ్డపై సీడబ్ల్యుసీ సమావేశం
-
కరోనాను జయించిన కానిస్టేబుల్‌కు ఘన స్వాగతం
సాక్షి, కాకినాడ (తూర్పుగోదావరి జిల్లా): కరోనాను జయించిన కానిస్టేబుల్‌కు పోలీస్ స్టేషన్లో ఘన స్వాగతం లభించింది. వివరాల ప్రకారం.. తిమ్మాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కానిస్టేబుల్ సత్యనారాయణకు కొన్ని రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో 28 రోజలపాటు క్వారంటైన్లో ఉన్న అనంతరం విధులకు హాజరయ్యారు. దీంతో స్టేషను వద్దనే కానిస్టేబుల్ సత్యనారాయణకు శాలువా, పూలమాలతో ఎస్సై విజయబాబు సాదరంగా ఆహ్వానించారు. మిగతా సిబ్బంది కూడా పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు. ఇక రెండు రోజుల క్రితం వివాహమైన అమలాపురం పట్టణం పద్మినీ పేటకు చెందిన యువతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. -
రాజ్‌నాథ్‌కు సీఎం స్వాదర సాగతం
విజయవాడ: తొలిసారిగా విజయవాడకు విచ్చేసిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సాదర స్వాగతం లభించింది. శుక్రవారం మధ్యాహ్నం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన నేరుగా విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం చంద్రబాబు, ఇతర ఉన్నతాధికారులు రాజ్‌నాథ్‌కు ఘన స్వాగతం పలికారు. నర్సరావుపేట మున్సిపాలిటీ శతాబ్ధి వేడుకల నుంచి నేరుగా గన్నవరం వచ్చిన సీఎం.. రాజ్ నాథ్ రాక కోసం కాసేపు వేచిచూశారు. అనంతరం కేంద్ర మంత్రిని క్యాంప్ ఆఫీస్ కు తోడ్కొని వెళ్లిన సీఎం.. అక్కడ రాజ్ నాథ్ గౌరవార్థం విందు ఇచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా, పలు జిల్లాలు దెబ్బతిన్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించిన సీఎం.. సహాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అందుకు ప్రతిగా ఏపీని అన్నివిదాలా ఆదుకుంటామని రాజ్ నాథ్ హామీ ఇచ్చారు. శనివారం విజయవాడలో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల జోనల్ సమావేశంలో రాజ్ నాథ్ పాల్గొంటారు. నాలుగు రాష్ట్రాల ముఖ్యఅధికారులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. -
కమల్‌హాసన్‌కు అనుకోని ఆతిథ్యం
ముంబై: విలక్షణ నటుడు కమల్‌హాసన్‌కు అనుకోని రీతిలో ఆతిథ్యం లభించింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే.. కమల్‌ను ముంబైలోని కృష్టకుంజ్ నివాసంలోకి సాదరంగా స్వాగతించారు. రాజ్ ఠాక్రేతోపాటు ఆయన భార్య షర్మిల, కుమార్తె ఊర్వశి కూడా కమల్ తదితరులను ఆహ్వానించారు. వాళ్లకు మరాఠా సంప్రదాయ రీతిలో శాలువాలు, పూలు ఇచ్చారు. 61 ఏళ్ల కమల్ హాసన్‌కు బంగారు శాలువాను కప్పి ఠాక్రే ఘనంగా సత్కరించారు. ఆయన భార్య షర్మిల.. కమల్‌కు నమస్తే చెప్పగా, కుమార్తె ఊర్వశి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకుంది. ఇది కేవలం మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమేనని ఎంఎన్ఎస్ వర్గాలు చెబుతుండగా, బాలీవుడ్లో మాత్రం కమల్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ కథనాలు గుప్పుమన్నాయి. కొంతమంది బాలీవుడ్ జనాలు కూడా రాజకీయ కోణాన్ని కొట్టిపారేస్తున్నారు. అసలు కమల్ హాసన్ సహజ ప్రవృత్తికి ఇది పూర్తి భిన్నమన్నారు.


