breaking news
Waqf Board CEO
-
రంజాన్ ప్రార్థనలకు మసీదులకు రావొద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను తప్పకుండా పాటించాలని వక్ఫ్ బోర్డు సీఈవో స్పష్టం చేశారు. ఈ నెల 24 లేదా 25వ తేదీల్లో రంజాన్ మాసం ప్రారంభం కానుందని, ఈ సమయంలో ప్రతీ ఒక్కరు ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. ప్రార్థనల కోసం మసీదులు, దర్గాల వద్దకు రావొద్దన్నారు. ఎవరింట్లో వాళ్లు ప్రార్థనలు చేసుకోవాలని, భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా వ్యాప్తిని అరికట్టాలని పిలుపునిచ్చారు. అలాగే మసీదులు, దర్గాల వద్ద లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని వక్ఫ్ బోర్డు సీఈవో శుక్రవారం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. చదవండి: పారాసిటమాల్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత -
కేజ్రీవాల్ నిబంధనలు ఉల్లంఘించారు: సీబీఐ
న్యూఢిల్లీ: ఢిల్లీ వక్ఫ్ బోర్డు సీఈవోగా మెహబూబా ఆలం నియామకంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలు నియమ, నిబంధనల్ని పక్కన పెట్టారంటూ ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. బోర్డు నియామకాల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. సీఎం, డిప్యూటీ సీఎంల పాత్రపై విచారించిన సీబీఐ మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే ఈ ఎఫ్ఐఆర్పై ఢిల్లీ ప్రభుత్వం తరఫున ఎవరూ అధికారికంగా స్పందించలేదు.