ఢిల్లీ వక్ఫ్ బోర్డు సీఈవోగా ఆలం నియామకంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలు నిబంధనల్ని పక్కన పెట్టారంటూ ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ వక్ఫ్ బోర్డు సీఈవోగా మెహబూబా ఆలం నియామకంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలు నియమ, నిబంధనల్ని పక్కన పెట్టారంటూ ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది.
బోర్డు నియామకాల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. సీఎం, డిప్యూటీ సీఎంల పాత్రపై విచారించిన సీబీఐ మంగళవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అయితే ఈ ఎఫ్‌ఐఆర్‌పై ఢిల్లీ ప్రభుత్వం తరఫున ఎవరూ అధికారికంగా స్పందించలేదు.


