breaking news
vip sunitha
-
విప్ సునీత ఇంటి ఎదుట ఆందోళన
యాదగిరిగుట్ట : నూతనంగా ఏర్పాటు కానున్న మోటకొండూర్ మండలంలో తమ గ్రామాన్ని కలుపవద్దని చిన్నకందుకూర్ గ్రామ ప్రజలు, అఖిలపక్ష నాయకులు యాదగిరిగుట్టలోని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఇంటిని గురువారం ముట్టడించారు. ఉదయం నుంచి పడుతున్న వర్షంలోనే గ్రామస్తులు ఎమ్మెల్యే వచ్చే వరకు భీష్మించి కూర్చున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పచ్ నమిలె పాండు, ఉపసర్పంచ్ కట్ట మల్లే్లష్గౌడ్ మాట్లాడుతూ గతంలో మాదిరిగానే మా గ్రామాన్ని యాదగిరిగుట్ట మండలంలోనే కొనసాగించాలన్నారు. లేదంటే పాలనపంగా ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ఈ విషయమై ఇప్పటికే సీఎస్ సీసీఎల్ఏ, జిల్లా కలెక్టర్, భువనగిరి ఆర్డీఓను కలిసినా స్పందన లేదని తెలిపారు. మోటకొండూర్‌లో కలిపితే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. సాయంత్రం వరకు ఇంటి ముట్టడి కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమంలో గ్రామస్తులు, అఖిలపక్షం నాయకులు చందసాయి బాబు, దూసరి కిష్టయ్య, బడే పోచయ్య, జహంగీర్, ర్యాకల స్వామి, అశోక్, భీమగాని రవి తదితరులు ఉన్నారు. -
బతుకమ్మ ఘాట్‌ను పరిశీలించిన విప్ సునీత
యాదగిరిగుట్ట: యాదాద్రికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణన్ని అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణంలోని గండిచెరువును మినీట్యాండ్, బతుకమ్మ ఘాట్లను ప్రభుత్వ విప్ గొంగిడి సునిత శుక్రవారం అకస్మికంగా పరిశీలించారు. నిర్మాణం పనుల పట్ల కాంట్రాక్టర్‌పై ఆగ్రహాం వ్యక్త పరిచారు. కట్ట పై భాగంలో వేస్తున్న సీసీ రోడ్డు నాసిరకంగా ఉందని, రోడ్డును 15ఫీట్ల వరకు వెడల్పు చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. బతుకమ్మ సంబరాల సందర్భంగా చెరువులోనికి దిగడానికి కట్టలోంచి మెట్లను, భక్తులు సేద తీరడానికి బేంచ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నిర్మాణ సమయంలో చెరువు కట్ట మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించకుండా సీసీ రోడ్డు పనులు పూర్తి చేసినందుకు ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు సక్రమంగా లేకుంటే కాంట్రాక్టు రద్దు పరిచి, బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. పనుల లోపాలపై ఇరిగేషన్ ఈఈతో ఫోన్లో మాట్లాడారు. పనులు నాణ్యతగా చేయాలి... బతుకమ్మ ఘాట్ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ సునీత ఆదేశించారు. ఘాట్‌ను సందర్శించిన సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. బతుకమ్మలను నిమజ్జన సమయంలో మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనుల్లో ఎలాంటి అవకతవకలు జరిగిన క్షమించేది లేదని కాంట్రాక్టర్, అధికారులను హెచ్చరించారు. బతుకమ్మ ఘాట్, మినీ ట్యాంక్ బండ్ పనుల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఆమె వెంట జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, ఎంపీటీసీ సీస కృష్ణ, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు కర్రె వెంకటయ్య, కాటబత్తిని ఆంజనేయులు, మిట్ట అనిల్‌గౌడ్, ఠాకూర్ సతీష్‌సింగ్, ఆవుల సాయి, వంగపల్లి శ్యాం తదితరులున్నారు.