breaking news
Vinod Chopra
-
సోలోగానే వెళ్తానంటోన్న టాప్ డైరెక్టర్
తనుశ్రీ దత్తా ప్రారంభించిన ‘మీటూ’ ఉద్యమం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమా, జర్నలిజం వంటి పలు రంగాలకు చెందిన ప్రముఖుల మీద లైంగిక వేధింపులు ఆరోపణలు రావడంతో దేశం అట్టుడికి పోయింది. ఇలా ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ కూడా ఉన్నారు. ‘సంజు’ సినిమా సమయంలో రాజ్‌కుమార్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ ఏడాది అనీల్ కపూర్ - సోనమ్ కపూర్లు ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఏక్ లడ్కీ కో దేఖా థో హైసా’ లగా చిత్రం నుంచి కూడా రాజ్‌కుమార్ పేరును తొలగించారు. ఇన్నాళ్లు వినోద్ చోప్రోతో కలిసి తన ప్రొడక్షన్ హౌస్‌లో ఎన్నో హిట్ సినిమాలు తీసిన రాజ్‌కుమార్ హిరాణీ తొలిసారి ఒంటరిగా ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నట్లు సమాచారం. ‘ప్రస్తుతానికి స్క్రిప్ట్ రెడీ అయ్యింది. ఈ సారి రాజ్‌కుమార్ ఒక్కరే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే కొంతమంది నటీనటులతో సినిమా గురించి మాట్లాడారు. వారంతా ఈ చిత్రంలో పని చేసేందుకు రెడీగా ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రటకన వెలువడనుంద’ని రాజ్‌కుమార్ సన్నిహితుడొకరు మీడియాకు తెలిపారు. గతంలో రాజ్‌కుమార్ సంజు, పీకే సినిమాలకు వినోద్ చోప్రాతో కలిసి నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే రాజ్‌కుమార్ మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సంజయ్ దత్, రణ్‌బీర్ కపూర్, సోనమ్ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు మద్దతుగా నిలిచారు. -
సెప్టెంబర్ 5న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: ప్రజ్ఞాన్ ఓజా (క్రికెటర్); వినోద్ చోప్రా (దర్శకుడు). ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. దీనికి అధిపతి రాహువు. న్యూమరాలజీలో నాలుగుకు చాలా ప్రాధాన్యముంది. చాలా కాలంగా కోర్టులో నడుస్తున్న న్యాయ సంబంధమైన వివాదాలు, పెండింగ్‌లో ఉన్న కేసులు ఈ సంవత్సరం పరిష్కారమవుతాయి. ఆస్తులు కొనుక్కోవాలని, ఉన్న ఆస్తులను అభివృద్ధి చేయాలని కంటున్న కలలు నెరవేరతాయి. వారసత్వంగా రావలసిన ఆస్తులు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. వీరి పుట్టిన తేదీ 5. ఇది 5. ఇది బుధ గ్రహానికి సంబంధించిన సంఖ్య కాబట్టి బుద్ధిబలం, ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. అన్ని ఆటంకాలు, విఘ్నాలు తొలగిపోయి, వృత్తి, ఉద్యోగాల పరంగా అవకాశాలు వస్తాయి. కుటుంబ పరంగా ఉత్సాహకరంగా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలతో మంచి సాంకేతిక నైపుణ్యంతో చురుకుగా పని చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. ఉద్యోగులకు ముఖ్యంగా యూనిఫారం ధరించే ఉద్యోగులు మంచి ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి ప్రదర్శించి అధికారుల మన్ననలు అందుకుంటారు. లక్కీ నంబర్స్: 1,4,5; లక్కీ కలర్స్: గ్రీన్, రెడ్, క్రీమ్, బ్లూ, వైట్; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్ర, శనివారాలు. సూచనలు: విష్ణుసహస్రనామ పారాయణ చేయడం, పెసలు దానం చేయడం, దుర్గాదేవిని ఆరాధించడం, వీధి కుక్కలకు ఆహారం పెట్టడం, వికలాంగులను ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
ఇప్పుడు హాలీవుడ్లో...
‘‘చిన్నప్పటి నుంచి హిందీ మీడియంలో చదువుకున్న నేను ఒక హాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని కలలో కూడా అనుకోలేదు’’ అని అంటున్నారు దర్శక - నిర్మాత విధు వినోద్ చోప్రా. ‘1942: ఎ లవ్ స్టోరీ’, ‘మిషన్ కాశ్మీర్’ లాంటి విజయవంతమైన చిత్రాల దర్శకునిగా, ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘లగే రహో మున్నాభాయ్’, ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’ లాంటి విభిన్నమైన చిత్రాల నిర్మాతగా పేరొందిన విధు వినోద్ చోప్రా మొదటిసారిగా ‘బ్రోకెన్ హార్సెస్’ అనే హాలీవుడ్ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం తన కలలను సాకారం చేసిందనీ, హాలీవుడ్ దర్శక దిగ్గజాలు జేమ్స్ కామెరూన్, ఆల్ఫాన్సో క్యూరోన్ ప్రశంసలు మర్చిపోలేనని విధు వినోద్ చోప్రా చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. -
అవకాశం కుదిరితే రాజమౌళి దర్శకత్వంలో...
‘‘రికార్డులు బ్రేక్ చేయాలనే లక్ష్యంతో నేను సినిమాలు ఎంపిక చేసుకోను. కథ నన్ను కదిలించాలి. నా హృదయాన్ని హత్తుకోవాలి. అలాంటి కథలకు పచ్చజెండా ఊపేస్తా’’ అని ఆమిర్ ఖాన్ అన్నారు. ‘త్రీ ఇడియట్స్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆమిర్ నటించిన ‘పీకె’ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమిర్ ఖాన్, చిత్రకథానాయిక అనుష్క శర్మ, రాజ్‌కుమార్ హిరాని, నిర్మాతలు విధు వినోద్ చోప్రా, అభిజిత్ హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమిర్ ఈ విధంగా సమాధానాలిచ్చారు. ‘పీకె’ అంటే ఏంటి? మీ పాత్ర ఎలా ఉంటుంది? సినిమా విడుదల వరకు దాని గురించి చెప్పకూడదని మేం నిర్ణయించుకున్నాం. ఇప్పటివరకు ఏ సినిమాకీ పడనంత కష్టం ఈ సినిమా కోసం పడ్డాను. నేను నవ్వకుండా ఎదుటి వ్యక్తిని నవ్వించాలి. అదెంత కష్టమో ఊహించుకోండి. పీకె మీ పాత్ర పేరా? నిజం చెప్పనా?... ఈ సినిమాలో నా పేరేంటో నాకే తెలియదు. అందరూ నన్ను పీకె... పీకె అని పిలుస్తుంటారు. అలా ఎందుకు పిలుస్తారో కూడా తెలియదు. సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. ఈ చిత్రం ఒప్పుకోవడానికి ప్రధాన కారణం? దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ. సందేశం, వినోదం రెంటికీ ప్రాధాన్యం ఇస్తారు. ఆయన గొప్ప రచయిత, దర్శకుడు. ఈ చిత్రానికి ఆయనే హీరో అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాలో మీరు భోజ్‌పురి భాష మాట్లాడారట.. ఆ భాష మీకు వచ్చా? రాదు. ఈ సినిమా కోసం ఓ మూడు, నాలుగు నెలలు నేర్చుకున్నాను. భోజ్‌పురి అందరికీ అర్థం అయ్యే అవకాశం లేదు కాబట్టి.. సింపుల్ భాషలోనే సంభాషణలు ఉంటాయి. ఈ చిత్రం పోస్టర్లో రేడియో అడ్డం పెట్టుకుని.. అర్ధనగ్నంగా కనిపించడంపై కొన్ని విమర్శలు ఎదురయ్యాయి కదా? సినిమా చూస్తే ఆ సీన్‌కి ఉన్న ప్రాధాన్యం ఏంటో తెలుస్తుంది. కథకు అవసరం లేకుండా ఏదీ చేయలేదు. ‘ఓ మై గాడ్’ చిత్రానికీ, దీనికీ దగ్గర పోలికలున్నాయనే వార్త ప్రచారంలో ఉంది? అది నిజం కాదు. కానీ, ఈ చిత్రంలో మతపరంగా, మూఢనమ్మకాలపై సెటైర్లు ఉన్నాయి. అయితే అవి ఎవర్నీ కించపరిచే విధంగా ఉండవు. ఈ చిత్ర నాయిక అనుష్క శర్మ కన్నా మీరు పొట్టిగా కనిపిస్తున్నారు కదా! అవునా.. అలా అనిపిస్తోందా? (...అంటూ అనుష్క శర్మను నిలబడమని, తన పక్కనే నిలబడ్డారు ఆమిర్). చూడండి.. నేనే హైట్‌గా ఉన్నాను కదా! కానీ, ఈ చిత్రం పోస్టర్లో మీరు పొట్టిగా కనిపిస్తున్నారు.. పొట్టివాడు గట్టివాడు అనే మాటతో ఏకీభవిస్తారా? అస్సలు ఏకీభవించను. ఎవరి సత్తా వారిది. మీకు పోస్టర్లో నేను పొట్టిగా కనిపిస్తే.. అది నా తప్పు కాదు (నవ్వుతూ). నేను మాత్రం అనుష్కకన్నా హైటే. నచ్చిన వ్యక్తులపై ప్రేమ వ్యక్తపరచడానికి పబ్లిక్‌లో ముద్దులు పెట్టుకోవచ్చనే కాన్సెప్ట్ కొచ్చిలో మొదలైంది. ‘కిస్ ఆఫ్ లవ్’ పేరుతో సాగుతున్న ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం? అది హద్దులు దాటనంత వరకూ ఓకే. కానీ, హద్దులు దాటితే అసహ్యంగా ఉంటుంది. మా అమ్మ, నా భార్య కిరణ్, పిల్లలపై నా ప్రేమను బహిరంగంగా వ్యక్తపరచడానికి నేను వెనకాడను. ఇతరులు కూడా వాళ్లకి నచ్చినవాళ్లపై ఆ విధంగా వ్యక్తపరిస్తే.. నేను కామెంట్ చేయను. ఎవరిష్టం వాళ్లది. మనది స్వతంత్ర భారత దేశం. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్లు ఉండొచ్చు. కానీ, అది ఇతరులను ఇబ్బందిపెట్టకుండా చూసుకోవాలి. ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాల గురించి, ఇతర సమస్యల గురించి ఇప్పటికే ‘సత్యమేవ జయతే’లో చాలా విషయాలు చెప్పారు... ఈ సినిమాలో ఆ అంశం గురించిన ప్రస్తావన ఉందా? ఈ సినిమా కథకూ, ఆ అంశానికీ సంబంధం లేదు. కానీ, మన చట్టం గురించి ఒక్కటి చెబుతాను. నిర్భయ కేసు జరుగుతున్న సమయంలో ఒక న్యాయవాది అమెరికా వెళ్లారు. అక్కడ కూడా నిర్భయ సంఘటన జరిగింది. నిర్భయ కేసుతో పాటు అమెరికాలో జరిగిన సంఘటన గురించి అక్కడి లాయర్లతో ఆమె చర్చించారు. అప్పుడు జరిగిన ఓ విషయాన్ని ఆమె నాతో పంచుకున్నారు. అదేంటంటే... ‘ఈ రెండు ఘోరాలూ ఒకేసారి జరిగాయి. కానీ, ఇక్కడ కేసు విచారణ ఇంకా సాగుతూనే ఉంది. అక్కడి వ్యక్తికి మాత్రం 120 ఏళ్ల జైలు శిక్ష పడింది’ అని ఆమె అన్నప్పుడు ఆశ్చర్యపోయాను. ఆ వ్యక్తి అన్నేళ్లు బతుకుతాడా లేదా అనేది తర్వాతి సంగతి. అతను చేసిన పనికి అన్నేళ్ల శిక్ష అవసరం అని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. మన చట్టం పనితీరు ఎలా ఉందో? దీన్నిబట్టి ఊహించుకోవచ్చు. తెలుగులో సినిమా చేయమంటే చేస్తారా? ఎందుకు చెయ్యను? బలమైన కథ ఉంటే కచ్చితంగా చేస్తాను. ఆ మధ్య ఓ సందర్భంలో నేను, రాజమౌళి కలుసుకున్న విషయం తెలిసిందే. సినిమా చేయాలనే ఆలోచనతో కలవలేదు. కానీ, రాజమౌళి మంచి విషయం ఉన్న దర్శకుడు. తనతో అవకాశం వస్తే, తప్పకుండా చేస్తాను.