సెప్టెంబర్ 5న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | On September 5 to carry forward the birthday celebration of celebrities | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 5న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Sep 4 2015 11:30 PM | Updated on Sep 3 2017 8:44 AM

సెప్టెంబర్  5న  పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

సెప్టెంబర్ 5న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. దీనికి అధిపతి రాహువు. న్యూమరాలజీలో నాలుగుకు చాలా

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
ప్రజ్ఞాన్ ఓజా (క్రికెటర్); వినోద్ చోప్రా (దర్శకుడు).

 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. దీనికి అధిపతి రాహువు. న్యూమరాలజీలో నాలుగుకు చాలా ప్రాధాన్యముంది. చాలా కాలంగా కోర్టులో నడుస్తున్న  న్యాయ సంబంధమైన వివాదాలు, పెండింగ్‌లో ఉన్న కేసులు ఈ సంవత్సరం పరిష్కారమవుతాయి. ఆస్తులు కొనుక్కోవాలని, ఉన్న ఆస్తులను అభివృద్ధి చేయాలని కంటున్న కలలు నెరవేరతాయి. వారసత్వంగా రావలసిన ఆస్తులు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. వీరి పుట్టిన తేదీ 5. ఇది  5. ఇది బుధ గ్రహానికి సంబంధించిన సంఖ్య కాబట్టి బుద్ధిబలం, ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. అన్ని ఆటంకాలు, విఘ్నాలు తొలగిపోయి, వృత్తి, ఉద్యోగాల పరంగా అవకాశాలు వస్తాయి. కుటుంబ పరంగా  ఉత్సాహకరంగా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలతో మంచి సాంకేతిక నైపుణ్యంతో చురుకుగా పని చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. ఉద్యోగులకు ముఖ్యంగా యూనిఫారం ధరించే ఉద్యోగులు మంచి ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి ప్రదర్శించి అధికారుల మన్ననలు అందుకుంటారు.

లక్కీ నంబర్స్: 1,4,5; లక్కీ కలర్స్: గ్రీన్, రెడ్, క్రీమ్, బ్లూ, వైట్; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్ర, శనివారాలు. సూచనలు: విష్ణుసహస్రనామ పారాయణ చేయడం, పెసలు దానం చేయడం, దుర్గాదేవిని ఆరాధించడం, వీధి కుక్కలకు ఆహారం పెట్టడం, వికలాంగులను ఆదరించడం మంచిది.                               
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement