breaking news
vimalamma
-
షర్మిల, సునీతలు శత్రువుల చేతుల్లో కీలుబొమ్మలు: వైఎస్సార్ సోదరి విమలమ్మ
సాక్షి, అమరావతి: ‘వైఎస్ కుటుంబ ఆడపడుచులు షర్మిల, సునీత అన్యాయంగా మాట్లాడుతున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తున్నారు. నేనూ వైఎస్ కుటుంబ ఆడపడుచునే. వివేకానందరెడ్డి అందరికంటే నాకే ఎక్కువ సన్నిహితుడు. ఆ కుటుంబ ఆడపడుచుగా చెబుతున్నా.. మా అన్నయ్య వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో ఎంపీ అవినాష్రెడ్డికిగానీ వైఎస్ భాస్కర్రెడ్డికిగానీ ఎలాంటి సంబంధంలేదు’.. అని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరి విమలమ్మ విస్పష్టంగా ప్రకటించారు. ‘కొంగు పట్టుకుని షర్మిల ఓట్లు అడుగుతున్న వీడియో చూసి చాలా బాధపడ్డాను. వైఎస్ కుటుంబ పరువును ఆమె రోడ్డుకీడుస్తున్నారు. ఆమెలో నాయకత్వ లక్షణాల్లేవు. నిత్యం వైఎస్ అవినాష్‌ను విమర్శిస్తున్నారు. అతను హత్యచేయడంగానీ చేయించడంగానీ వాళ్లు చూశారా? సీఎం జగన్‌పై కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరు హత్యచేశారో షర్మిల, సునీతే నిర్ణయించేస్తే ఇక కోర్టులు, జడ్జీలు ఎందుకు?’ అని ఆమె సూటిగా ప్రశ్నించారు. విజయవాడలో శనివారం విమలమ్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు కీలక అంశాలపై ఇలా సూటిగా స్పందించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్ శత్రువుల చేతుల్లో కీలుబొమ్మలుగా షర్మిల, సునీత.. వైఎస్ రాజశేఖరరెడ్డి శత్రువులంతా ఒక్కటయ్యారు. ఈ తరుణంలో వైఎస్ కుటుంబం అంతా కలిసికట్టుగా ఉండాలి. కానీ, వైఎస్ శత్రువుల చేతుల్లో షర్మిల, సునీత కీలుబొమ్మలయ్యారు. వాళ్లిద్దరి చూట్టూ ప్రస్తుతం వైఎస్ కుటుంబ శత్రువులే ఉన్నారు. షర్మిల, సునీతలకు చెబుతున్నా.. వారు నోరు మూసుకోవాలి. పేద ప్రజలకు మంచి చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడటం సరికాదు. వారిద్దరూ ఎందుకిలా చేస్తున్నారో అర్థంకావడంలేదు. డబ్బు కోసమో పదవి కోసమే తెలీడం లేదుగానీ అసూయ, ద్వేషంతో వ్యవహరిస్తున్నారు. ఏదో ఆశించే ఇదంతా చేస్తున్నారు. జగన్ సీఎం అయ్యాక బంధువులు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని దూరం పెట్టారు. వాళ్ల పనులు కావడంలేదనే ఇలా ప్రవర్తిస్తున్నారనిపిస్తోంది. వారికి మంచి చెప్పాలని చూశాను. అప్పటి నుంచి నాతో మాట్లాడటం మానేశారు. హంతకుడు దస్తగిరి దర్జాగా తిరుగుతున్నాడు.. షర్మిల, సునీత తామేది మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటున్నారు. మా ఇంట్లో అమ్మాయిలు ఇలా అన్యాయంగా మాట్లాడుతుంటే బాధ కలుగుతోంది. వివేకానందరెడ్డిని కిరాతకంగా హత్యచేశాను అని చెప్పిన దస్తగిరి మాత్రం బయట దర్జాగా తిరుగుతున్నాడు. అతని మాటలు నమ్మి అవినాష్‌రెడ్డిని విమర్శిస్తారా? ఏ తప్పూ చేయని వైఎస్ భాస్కర్‌రెడ్డి ఏడాదిగా జైల్లో ఉన్నారు. అవినాష్ బెయిల్ రద్దుచేయాలని షర్మిల, సునీత కోర్టులో కేసులు వేశారు. కానీ, వివేకాను హత్యచేశాను అని చెప్పిన దస్తగిరి బెయిల్‌పై ఉన్నా వారెందుకు పట్టించుకోవడంలేదు? షర్మిల, సునీత ఎన్ని మాటలంటున్నా అవినాష్ ఒక్క మాటా కూడా అనడంలేదు. వైఎస్‌కు వివేక ఎలాగో.. జగన్‌కు అవినాశ్ అలా.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వివేకానందరెడ్డి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బాధ్యతలు చూసేవారు. అందుకే పులివెందుల, కడప జిల్లాలో పార్టీ బాధ్యతలను వివేకాకు అప్పగించారు. వారిద్దరిలో ఒకరు ఎంపీగా పోటీచేస్తే మరొకరు ఎమ్మెల్యేగా పోటీచేసేవారు. అలా ఓటమి అన్నది లేకుండా గెలుస్తూ వచ్చారు. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి వివేకానందరెడ్డి ఎలానో ప్రస్తుతం వైఎస్ జగన్‌కు వైఎస్ అవినాశ్ అలా అండగా ఉన్నారు. కానీ, వైఎస్ హఠాన్మరణం తర్వాత మారిన పరిస్థితుల్లో వైఎస్ జగన్ తన తండ్రి ఆశయ సాధన కోసం పార్టీ పెట్టారు. దురదృష్టవశాత్తూ ఆనాడు వివేకానందరెడ్డి కాంగ్రెస్ వైపు ఉండిపోయారు. ఆ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా జగన్ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బాధ్యతలు చూసుకోవాల్సి వచ్చింది. అందుకే పులివెందుల, కడప జిల్లాల్లో పార్టీ బాధ్యతలను చూసుకునేందుకు అవినాష్‌రెడ్డిని ఎంపిక చేసుకున్నారు. దీంతో అవినాష్ తనపై పెట్టిన బాధ్యతను ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. పులివెందులను, కడప జిల్లాను అభివృద్ధి చేస్తున్నారు. అసలు అవినాష్‌ను ఎంపీగా గెలిపించాలనే వివేకానందరెడ్డి చివరివరకూ ప్రచారం చేశారు కదా. ఈ విషయాన్ని గుర్తించయినా షర్మిల, సునీత అవినాష్ మీద దుష్ప్రచారాన్ని మానుకోవాలి. ప్రజలకు మంచి చేస్తున్న జగన్‌కు అండగా నిలవాలి. వారిద్దరూ మరోసారి కూర్చుని చర్చించి జగన్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. ఎందుకంటే జగన్ శత్రువులంతా ఒక్కటయ్యారు. బయట శత్రువులంతా ఒక్కటైతే కుటుంబం అంతా కలిసికట్టుగా ఉండి ఎదుర్కోవాలి. ఆ కుటుంబ ధర్మాన్ని పాటించాలని షర్మిల, సునీతలకు సూచిస్తున్నా. జగన్‌ను మళ్లీ సీఎంను చేయండి.. ఇక వైఎస్ రాజశేఖరరెడ్డి కోట్లాది మంది ప్రజల గుండెల్లో దేవుడిగా ఉన్నారు. వైఎస్, వివేకా ఇద్దరూ ఫ్యాక్షన్ రాజకీయాలకు వ్యతిరేకం. మా నాన్నను హత్యచేసిన తరువాత కూడా ఎలాంటి ప్రతికార రాజకీయాలకు పాల్పడకుండా వారు ఫ్యాక్షన్‌ను అంతంచేశారు. కానీ, ప్రశాంతంగా ఉన్న పులివెందులలో ప్రస్తుతం కొందరు అల్లర్లు రేకెత్తించేందుకు యత్నిస్తుండటం బాధ కలిగిస్తోంది. తండ్రి రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను సాధించేందుకు జగన్ ప్రజలకు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. పేద ప్రజలకు అంత మంచి చేస్తున్న జగన్ మరోసారి సీఎం కావాలి. అందుకోసం రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు అందరినీ గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. -
అవినాష్ ను టార్గెట్ చేయడం సరికాదు: వైఎస్ విమలమ్మ
-
సునీత వెనుక కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి: విమలమ్మ
-
సిస్టర్ విమలారెడ్డి ఈస్టర్ సందేశం
సాక్షి, హైదరాబాద్: ఏసుక్రీస్తు గుడ్ ఫ్రైడే నాడు శిలువ మరణం పొంది మూడవ రోజున సజీవుడై తిరిగి లేచిన పర్వదినమే ఈస్టర్. లోకంలో కక్ష, రాక్షసత్వాలు ఎంతగా పేట్రేగినా.. ప్రేమ, కరుణలకు సమాధి కట్టలేరు. ఈ పరమ సత్యాన్ని చాటేదే ఈ పర్వదినం.. శిలువపై బలిదానమైన దైవ కుమారుడు ఏసుక్రీస్తు పునరుత్థానం చెందిన పర్వదినమే ఈస్టర్.. శోకానికి అడ్డుకట్ట తథ్యమని..అంతిమంగా క్షమే జయిస్తుందని, పొలిమేరలు లేని ప్రేమకే పట్టాభిషేకమని సందేశమిచ్చే పండగ ఈస్టర్. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈస్టర్ ఆదివారం రోజున క్రైస్తవులు సమాధుల వద్దకు చేరుకుని రంగులతో అలకరించిన సమాధులపై పూలు చల్లి, కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేస్తారు. ఈస్టర్ పర్వదినం ప్రాముఖ్యతపై సిస్టర్ వైఎస్ విమలారెడ్డి వివరణాత్మక సందేశం ఇచ్చారు. ఈస్టర్ పర్వదినంపై పూర్తి వివరణాత్మక సందేశం కోసం ఈ కింది వీడియోను వీక్షించండి. -
సిస్టర్ విమలా రెడ్డి గుడ్‌ఫ్రైడే సందేశం
సాక్షి, హైదరాబాద్ : గుడ్‌ఫ్రైడే... ! ఏసు క్రీస్తు శిలువ వేయబడిన రోజు. ప్రభువు ప్రాణత్యాగానికి గుర్తు. ప్రతి ఏడాది ఏప్రిల్ మాసంలో వచ్చే ఈ పండుగను క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. పండుగకు 42 రోజుల ముందు నుంచే క్రైస్తవులు అంతా ఉపవాసాలు చేయడం, రోజులో నాలుగు నుంచి అయిదు సార్లు ప్రార్థనలు చేస్తారు. భారతీయ క్రైస్తవులు ఈ రోజును శుభ శుక్రవారంగా పిలుచుకుంటారు. పండుగ రోజున చర్చీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ ప్రార్థనలో క్రైస్తవులంతా ఉపవాసంతో పాల్గొంటారు. ప్రభువు శిలువ వేయబడిన రోజు శుభ దినం ఎలా అవుతుంది? అసలు దీనికి శుభ శుక్రవారం అని క్రైస్తవులు ఎందుకు పిలుచుకుంటారని చాలా మందికి ఉండే సందేహాలే. అంతే కాకుండా శుభ శుక్రవారం రోజున క్రైస్తవులు ఏం చేస్తారు? అసలు క్రీస్తును శిలువ ఎందుకు వేశారు వంటి అనేక సందేహాలకు సమాధానంగా సిస్టర్ వైఎస్ విమలారెడ్డి వివరణాత్మక సందేశం ఇచ్చారు. పండుగ ప్రత్యేకతను, ఏసు శిలువ వేయబడిన తర్వాత శిలువపై ఆయన పలికిన ఏడు అంశాల గురించి ఆమె సమగ్రంగా వివరించారు. శుభ శుక్రవారంపై పూర్తి వివరణాత్మక సందేశం కోసం ఈ కింది వీడియోను వీక్షించండి. -
జగన్‌కు మరింత శక్తి ఇవ్వాలని ప్రార్థించాను
-
కేసీఆర్ సోదరి విమలమ్మ మృతి
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రెండో సోదరి విమలమ్మ (83) కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అల్వాల్‌లోని సాయిబాబా నగర్లో ఉన్న నివాసానికి పార్థివదేహాన్ని తరలించారు. మధ్యాహ్నం సీఎం కేసీఆర్, ఎంపీ కవిత, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు విమలమ్మకు నివాళులు అర్పించారు. అనంతరం సికింద్రాబాద్ తిరుమలగిరిలోని స్వర్గవాటికలో విమలమ్మ అంత్యక్రియలు జరిగాయి. కొడుకు విజయ భాస్కర్ దహన సంస్కారాలు నిర్వహించారు. మంత్రి హరీశ్ ఉదయం నుంచి సాయంత్రం అంత్యక్రియలు పూర్తి అయ్యేవరకు అక్కడే ఉండి పర్యవేక్షించారు. విమలమ్మకు భర్త రాజేశ్వర్‌రావు, ముగ్గురు కొడుకులు భూపాల్‌రావు, శ్రీనివాస్, విజయ్ భాస్కర్, కుమార్తె చంద్రమతి ఉన్నారు. అంత్యక్రియల్లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మైనంపల్లి హన్మంతరావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీఎన్ రెడ్డి, కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. కన్నీటి పర్యంతమైన కేసీఆర్ కాన్వాయ్‌లో నుంచి దిగి సోదరి పార్థివదేహం వద్దకు రాగానే కేసీఆర్ ఒక్కసారిగా ఉద్వేగానికిలోనై కన్నీటి పర్యంతమయ్యారు. పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు ఆయన్ను ఓదార్చారు. కేసీఆర్‌కు ఎనిమిది మంది సోదరీమణులు, ఒక సోదరుడు కాగా వీరిలో ఓ సోదరి, అన్న మరణించారు. విమలమ్మకు కేసీఆర్ అంటే అమితమైన ప్రేమని, ఏటా రాఖీ కట్టేదని కుటుంబ సభ్యులు చెప్పారు. -
పనీపాటా లేకుండా తిరుగుతున్నావన్నందుకు..
ఉద్యోగం చేయమని తల్లి మందలించడంతో ఓ యువకుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చంద్రగిరినగర్‌కు చెందిన విమలమ్మ కుమారుడు శివకుమార్ (22) చదువు మానేసి సినిమా కథలు రాయడం ప్రారంభించాడు. దీంతో తల్లి విమలమ్మ ఏదైనా పని చేసి, డబ్బు సంపాదించాలంటూ మందలించింది. మనస్తాపానికి గురైన శివకుమార్ ఈ నెల 21న ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. కుమారుడు ఇప్పటి వరకు తిరిగి రాకపోవడంతో తల్లి విమలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.