ఆగస్టు 5 తేదిన డీఎస్సీ నోటిఫికేషన్: గంటా
నెల్లూరు: ఆగస్టు 5 తేదిన డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. నెల్లూరులోని విక్రమ సింహ పురి విశ్వవిద్యాలయ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఆదివారం ఉదయం గంటా, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ పాల్గొన్నారు.
యూనివర్సిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి గంటాకు సూచించారు. అంతేకాకుండా యూనివర్సిటీ కోసం మరింత స్థలాన్ని కేటాయించాలని కాకాని కోరారు.