breaking news
Vikram Simha
-
మోడీకి రజనీ స్పెషల్ షో!
రజనీకాంత్ నటించిన ‘కోచ్చడయాన్’ (తెలుగులో ‘విక్రమ సింహ’) మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా ఈ చిత్రంపై ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. ఇటీవల చెన్నైలో రజనీకాంత్‌ని కలిసినపుడు ‘కోచ్చడయాన్’ గురించి ప్రస్తావించారట. అందుకే గుజరాత్లో ఆయన కోసం ప్రత్యేక ప్రదర్శన వేయడానికి రజనీ సన్నాహాలు చేస్తున్నారట. -
గీత స్మరణం
పల్లవి చూద్దాం ఆకసం అంతం... (2) వేద్దాం అక్కడే పాదం ॥ మళ్లీ పుట్టి మహినే గెలిచి ఎల్లలు దాటిన యోధా గాలుల గీతాలే ఎన్నడూ ఆగవులే గెలుపను దప్పిక ఎప్పుడూ తీరదులే తీరదులే హే... కత్తికొనతో ఒక సూర్యుణ్ణే సృష్టించు హే... మాతృదేశంలో సంతోషం పండించు చరణం : 1 ఆకాశం అడ్డొస్తే ఎగిరే పక్షైపోదాం మహాశిఖరమే అడ్డొస్తే దాటి మేఘాలౌదాం అరణ్యమొస్తే గాలైపోదాం సముద్రమొస్తే చేపైపోదాం వీరా... నీ గుండె వజ్రం వజ్రం వజ్రం వెంటేపడుతుంది విజయం విజయం విజయం లక్ష్యం ఎన్నటికీ దీక్షకి బంధువురా విజయం ఎప్పటికీ చెమటకి చుట్టమురా ॥ చరణం : 2 మనసు ధనస్సు మాట బాణం ఎప్పుడైనా తప్పబోదు కొదమసింహమా గెలిచి పోరాడు పోరాడు... వీరా... నీ గుండె వజ్రం వజ్రం వజ్రం వెంటేపడుతుంది విజయం విజయం విజయం అందరి దీవెనతో ఆయువు పొందానే మీకే నా బ్రతుకే అంకితమిస్తానే హే... కత్తికొనతో ఒక సూర్యుణ్ణే సృష్టించు హే... మాతృదేశంలో సంతోషం పండించు ॥ చిత్రం : విక్రమ సింహ (2014) రచన : చంద్రబోస్ సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ గానం : ఎస్.పి.బాలు, బృందం - నిర్వహణ: నాగేశ్