breaking news
vijayawada commissioner venkateswara rao
-
ముందస్తుగానే సమాచారమిచ్చిన చంద్రబాబు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారుల బదిలీల నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తుగానే సమాచారం ఇచ్చారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా వెంకటేశ్వరరావు నియమితులయిన విషయం తెలిసిందే. అయితే విజయవాడ సీపీ వెంకటేశ్వరరావు అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాల్లో ఉండగా, వెళ్లవద్దని ఆయనకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం. కాగా ఓటుకు కోట్లు కేసులో ముందస్తు సమాచారం లేకపోవటంపై చంద్రబాబు గుర్రుగా ఉన్నారు. ఇంత పక్కాగా పథకం వేసినా ఉప్పందించలేకపోయారని ఐపీఎస్ అధికారణి అనురాధపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆమెను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు డీజీగా బదిలీ చేశారు. -
ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధపై బదిలీ వేటు
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు ప్రభావం ఏపీ ఐపీఎస్ అధికారులపైన పడింది. ఏపీ నిఘా విభాగం చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధపై బదిలీ వేటు పడింది. ఆమె స్థానంలో విజయవాడ కమిషనర్ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ చీఫ్గా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నియమించింది. మరోవైపు అనురాధను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ డీజీగా బదిలీ చేశారు. అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్గా గౌతం సవాంగ్ నియమితులయ్యారు. కాగా ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బులిస్తూ అడ్డంగా దొరికిన వీడియోలు, ఆ నామినేటెడ్ ఎమ్మెల్యేతో చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు బయటపడిన వ్యవహారం ముందుగా పసిగట్టి సమాచారం ఇవ్వడంలో వైఫల్యం చెందారనే సాకుతో అనురాధను తప్పించినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... ఇంటెలిజెన్స్ అధికారులపై అసంతృప్తిగా ఉన్నారు. దాంతో అనుకున్నట్లుగానే ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధపై బదిలీ వేటు పడింది.