vijay hajare oneday
-
ధోని 44, జడేజా134
ఆంధ్ర పరాజయం విజయ్ హజారే ట్రోఫీ ఆలూరు: జార్ఖండ్ తరఫున టాప్‌స్కోరర్‌గా నిలి చినా... ఎమ్మెస్ ధోని (64 బంతుల్లో 44; 4 ఫోర్లు) తన జట్టును గెలిపించలేకపోయాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో జార్ఖండ్‌ను చిత్తు చేసింది. ముందుగా జార్ఖండ్ 47 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. అనంతరం గుజరాత్ 40.5 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (2/30, 32 నాటౌట్) ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చాడు. రాజ్‌కోట్: రవీంద్ర జడేజా (117 బంతుల్లో 134; 8 ఫోర్లు, 6 సిక్సర్లు)కు తోడు షెల్డన్ జాక్సన్ (111) కూడా సెంచరీ చేయడంతో సౌరాష్ట్ర 7 పరుగులతో మధ్యప్రదేశ్‌ను ఓడించింది. ముందుగా సౌరాష్ట్ర 5 వికెట్లకు 340 పరుగులు చేయగా, మధ్యప్రదేశ్ 49.1 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌటైంది. జలజ్ సక్సేనా (133) శతకం వృథా అయింది. న్యూఢిల్లీ: గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో బరోడా 89 పరుగులతో ఆంధ్రను చిత్తు చేసింది. కేదార్ దేవ్‌ధర్ (81), దీపక్ హుడా (53) రాణించడంతో బరోడా 6 వికెట్లకు 291 పరుగులు చేసింది. అనంతరం ఆంధ్ర 43.1 ఓవర్లలో 202 పరుగులకే ఆలౌటైంది. కేవీ శశికాంత్ (59) అర్ధ సెంచరీ చేయగా, భరత్ (45), ఏజీ ప్రదీప్ (43) ఫర్వాలేదనిపించారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ భార్గవ్ భట్ (6/37) ఆంధ్రను కుప్పకూల్చాడు. -
యువరాజ్ శ్రమ వృథా
ధోని విఫలం విజయ్ హజారే వన్డే టోర్నీ రౌండప్ సాక్షి, హైదరాబాద్: విజయ్ హజారే వన్డే టోర్నీలో తొలి రోజు యువరాజ్ సింగ్ ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత దేశవాళీ మ్యాచ్ ఆడుతున్న ధోని బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. గ్రూప్ ‘ఎ’లో యువరాజ్ (93 బంతుల్లో 93; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) సత్తా చాటినా... ముంబై చేతిలో పంజాబ్ జట్టు 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. పంజాబ్ 254 పరుగులకు ఆలౌట్ కాగా, కెరీర్లో తొలి మ్యాచ్ ఆడుతున్న జై బిస్తా (87 బంతుల్లో 92; 12 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ముంబై 5 వికెట్లకు 255 పరుగులు చేసి నెగ్గింది. అస్సాంతో జరిగిన మరో మ్యాచ్‌లో ముకుంద్ (104), అశ్విన్ (3/31) తమిళనాడును గెలిపించారు. ఆలూరు: గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో జార్ఖండ్ 5 పరుగుల తేడాతో జమ్ము కశ్మీర్‌పై గెలుపొందింది. జార్ఖండ్ 210 పరుగులకు ఆలౌట్ కాగా, కశ్మీర్ 7 వికెట్లకు 205 పరుగులే చేయగలిగింది. ధోని (24 బంతుల్లో 9; 1 ఫోర్) విఫలమయ్యాడు. మరో మ్యాచ్‌లో రైల్వేస్ జట్టు డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటకపై వికెట్ తేడాతో సంచలన విజయం సాధించింది. ఢిల్లీ: త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో (గ్రూప్ సి) ఆంధ్ర 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఏజీ ప్రదీప్ (71), శివకుమార్ (51) అర్ధ సెంచరీల సహాయంతో ఆంధ్ర 273 పరుగులు చేసింది. అనంతరం త్రిపుర 215 పరుగులకే ఆలౌటైంది. -
ఎనిమిదేళ్ల తర్వాత...
జార్ఖండ్ తరఫున బరిలోకి ధోని నేటినుంచి విజయ్ హజారే ట్రోఫీ ఆలూరు (కర్ణాటక): భారత వన్డే జట్టు కెప్టెన్ ధోని సుదీర్ఘ కాలం తర్వాత దేశవాళీ క్రికెట్లో తన సొంత జట్టు జార్ఖండ్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. నేటినుంచి జరగనున్న విజయ్ హజారే వన్డే ట్రోఫీలో అతను వరుణ్ ఆరోన్ కెప్టెన్సీలో ఆడతాడు. జార్ఖండ్ తమ తొలి మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్‌తో తలపడుతుంది. 2009 అక్టోబర్‌లో ఇండియా బ్లూ సభ్యుడిగా తన చివరి దేశవాళీ వన్డే ఆడిన ధోని... అంతకు రెండున్నరేళ్ల క్రితమే 2007లో ఏప్రిల్‌లో ఆఖరి సారి జార్ఖండ్ తరఫున ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్ బరి లోకి దిగాడు. ధోనితో పాటు పలువురు అగ్రశ్రేణి క్రికెటర్లు తమ సొంత జట్ల తరఫున ఆడుతుండటంతో టోర్నీపై ఆసక్తి పెరిగింది. దక్షిణాఫ్రికాతో టెస్టుల్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన అశ్విన్ కూడా తమిళనాడు కెప్టెన్‌గా పోరుకు సిద్ధమయ్యాడు. మారిన లీగ్ ఫార్మాట్ గత ఏడాది వరకు జోనల్ పద్ధతిలో నిర్వహించిన ఈ టోర్నీని ఈ సారి దాదాపు రంజీ తరహాలోకి మార్చారు. మొత్తం 27 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌నుంచి టాప్-2 టీమ్‌లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో, గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లు బెంగళూరు, ఆలూరులలో, గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లు ఢిల్లీలో, గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లు రాజ్‌కోట్‌లలో జరగనున్నాయి.