breaking news
Vigilance SP
-
ఆరు వాహనాల సీజ్
అనంతపురం సెంట్రల్: మడకశిర, కదిరి నియోజకవర్గాల్లో పర్మిట్లు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ మైనింగ్ సామగ్రిని తరలిస్తున్న ఆరు వాహనాలను సీజ్ చేసినట్లు విజిలెన్స్ ఎస్పీ అనిల్‌బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు వాహన యజమానులపై చర్యలు తీసుకోవాలని మైన్, వాణిజ్య పన్నులశాఖ అధికారులకు సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. -
అక్రమ కట్టడాలను కూల్చే సత్తా ఉందా..?
– పన్నుల వసూలులో నిర్లక్ష్యం దేనికి..? – మున్సిపల్ కమిషనర్లతో విజిలెన్స్ ఎస్పీ అనిల్‌బాబు అనంతపురం న్యూసిటీ : ‘మున్సిపాలిటీల పరిధిలో అనుమతుల్లేని కట్టడాలు చాలా ఉన్నాయి. వాటిని కూల్చే సత్తా మీలో ఉందా? నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు’ అని విజిలెన్స్ ఎస్పీ అనిల్‌బాబు మునిసిపల్ కమిషనర్లను ప్రశ్నించారు. శుక్రవారం మున్సిపల్ ఆర్డీ కార్యాలయంలో ఆర్డీ విజయలక్ష్మితో కలసి ఆయన కమిషనర్లతో సమావేశమయ్యారు. ఇంటి, ఖాళీ జాగా పన్ను, అక్రమ కట్టడాలు, సెల్‌టవర్స్ తదితర వాటిపై విజిలెన్స్ ఎస్పీ ఆరా తీశారు. మీ నిర్లక్ష్యం కారణంగానే బకాయిలు ఏళ్ల తరబడి పేరుకుపోయాయని అసహనం వ్యక్తం చేశారు. ప్రధానంగా 2008 నుంచి జిల్లాలోని మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఫంక్షన్ హాల్స్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అనంతపురం, హిందూపురం, గుత్తి, ధర్మవరం ప్రాంతాల్లో రూ. కోట్లలో బీపీఎస్ చెల్లించాల్సి ఉందని తేలిందన్నారు. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో రూ .94 లక్షలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. దీనికి టీపీఓ ఇస్సాక్ అహ్మద్ బదులిస్తూ నిర్వాహకులు గతంలోనే బీపీఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారని కానీ వారి కట్టడాలకు అనుమతి లభించలేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టారని తెలిపారు. హిందూపురంలో ఖాళీ జాగా పన్ను రూ 2 కోట్లు, ధర్మవరంలో రూ .30 లక్షలు, కదిరిలో రూ. 14 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా ఎందుకు జాప్యం చేస్తున్నారని విజిలెన్స్ ఎస్పీ అనీల్‌బాబు ప్రశ్నించారు. మొదట అక్రమ భవనాలు, ఖాళీ స్థలాలు, మొండి బకాయిల జాబితాను సిద్ధం చేసి 15 రోజుల్లో పురోగతి సాధించాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుంతకల్లులో రూ. 7 కోట్ల బకాయిలు: గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే స్టేషన్ రూ. 4 కోట్లు, ఏపీ కో ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లు నుంచి రూ. 3 కోట్లు బకాయిలు వసూలు కావాల్సి ఉందని మున్సిపల్ ఆర్డీ దష్టికి విజిలెన్స్ ఎస్పీ దష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ శాఖల నుంచి ఏ మేరకు వసూలు చేయాలో వాటి వివరాలను సిద్ధం చేయాలన్నారు. -
విజిలెన్స్ అధికారుల దాడులు
- విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు, రిమాండు - దితుల్లో ఒకరు ఎంపీటీసీ సభ్యుడు మొయినాబాద్: విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఇద్దరిపై విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేసి రిమాండుకు తరలించారు. నిందితుల్లో ఒకరు ఎంపీటీసీ సభ్యుడు ఉండటం గమనార్హం. విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఎనికేపల్లి ఎంపీటీసీ సభ్యుడు డప్పు ఆనంద్ కొన్నేళ్లుగా తన ఇంటికి కరెంట్ మీటర్ లేకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నాడు. గతంలోనూ ఆయనపై విద్యుత్ విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. అదే విధంగా అజీజ్‌నగర్ గ్రామానికి చెందిన తూర్పు కృష్ణారెడ్డి తన వ్యవసాయ పొలం వద్ద పశువుల షెడ్‌కు కరెంట్ మీటర్ లేకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నాడు. ఇతనిపైనా గతంలో కేసులు నమోదయ్యాయి. అయినా వీరు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతూనే ఉన్నారు. బుధవారం విజిలెన్స్ ఎస్పీ మురళీధర్‌రావు, విజిలెన్స్ ఏఈ బి.బలరాం, మండల విద్యుత్ ఏఈ నాగరాజులు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఎనికేపల్లిలో ఎంపీటీసీ సభ్యుడు డప్పు ఆనంద్, అజీజ్‌నగర్‌లో తూర్పు కృష్ణారెడ్డిలు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఎస్పీ మురళీధర్‌రావు తెలిపారు.