breaking news
vigilance rides
-
పాల కల్తీపై విజి‘లెన్స్’
ఏడావులపర్తిలో అధికారుల మెరుపు దాడులు అదుపులోకి పాల తయారీదారుడు బుక్కరాయసముద్రం: కల్తీ పాలతయారీపై విజిలెన్స్ దృష్టి సారించింది. ఏడావులపర్తి గ్రామంలో ‘విజిలెన్స్’ అధికారులు దాడులు నిర్వహించి కల్తీ పాల తయారీదారుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళితే.. ఏడావులపర్తిలో లక్ష్మీపతి అనే వ్యక్తి పాల వ్యాపారం చేస్తున్నాడు. గేదెల ద్వారా రోజుకు 40 నుంచి 60 లీటర్లు వరకు పాలు వస్తున్నాయి. అయితే త్వరగా ధనవంతుడు కావాలనే అత్యాశతో కల్తీపాల తయారీపై దృష్టిసారించాడు. తన ఇంట్లోని ప్రత్యేక గదిలో ఉదయాన్నే పాలు తయారు చేసేవాడు. అలా రోజుకు 200 నుంచి 250 లీటర్లు పాలను అనంతపురంలోని హోటళ్లకు, టీస్టాళ్లకు విక్రయించేవాడు. రోజుకు రూ.10వేల మేర సంపాదించేవాడు. ఏడాది కాలంగా నిరాటంకంగా కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇంతపెద్ద మొత్తంలో పాలు ఎలా ఉత్పత్తి చేస్తున్నాడని గ్రామంలో కొంతమందికి అనుమానం వచ్చింది. ఏదో జరుగుతోందని భావించి విజిలెన్స్ అధికారులకు, ఫుడ్ ఇన్స్పెక్టర్లకు సమాచారం ఇచ్చారు. జిల్లా విజిలెన్స్ ఎస్పీ అనిల్‌బాబు ఆదేశాల మేరకు విజిలెన్స్ సీఐ రెడ్డప్ప, ఫుడ్ ఇన్స్పెక్టర్ శివశంకర్‌రెడ్డి, అసిస్టెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, విజిలెన్స్ కమర్షియల్ ఆఫీసర్ చెన్నయ్య, పోలీసు బృందంతో బుధవారం లక్ష్మీపతి ఇంటిపై మెరుపు దాడి నిర్వహించారు. పాలలోకి కల్తీకి ఉపయోగించే 25 కేజీల గోల్డన్ ఆయిల్, 50 కేజీల చక్కెర, పాలపొడి, లిక్విడ్‌తోపాటు కృత్రిమ పదార్థాలతో తయారు చేసిన 200 లీటర్ల కల్తీపాలను స్వాధీనం చేసుకున్నారు. పాల శ్యాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. లక్ష్మీపతిపై చీటింగ్ కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించామని సీఐ రెడ్డప్ప తెలిపారు. -
గ్యాస్ ఏజెన్సీపై విజిలెన్స్ దాడులు
చింతలపూడి : పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలోని భారత్ గ్యాస్ ఏజెన్సీపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఉండవలసినవాటికన్నా 1143 డొమెస్టిక్ సిలిండర్లు, 21 కమర్షియల్ సిలిండర్లు అధికంగా ఉండటంతో గ్యాస్ ఏజెన్సీపై కేసు నమోదు చేశారు. వీటి విలువ రూ.19 లక్షలు ఉంటుందని తెలిపారు. అలాగే వివిధ రికార్డులను పరిశీలించారు. -
నిడమనూరు పంచాయతీ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు
నిడమనూరు(కృష్ణా జిల్లా): కృష్ణా జిల్లా నిడమనూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోమవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. పంచాయతీ కార్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయని తమకందిన ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు చేశారు. విజయవాడ విజిలెన్స్ డీఎస్పీ పూర్ణచందర్రావు ఆధ్వర్యంలో మొత్తం ముగ్గురు అధికారులు పంచాయతీ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. తనిఖీల్లో వెలుగు చూసిన వాస్తవాలపై మాట్లాడేందుకు అధికారులు నిరాకరించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని డీఎస్పీ పూర్ణచందర్రావు మీడియాకు తెలిపారు.