breaking news
viajyanagaram
-
పేద విద్యార్ధులకు మరో విశిష్ట పథకం
-
విజయనగరంలో వైఎస్సార్సీపీ ధర్నా
-
విజయనగరంలో వైఎస్సార్సీపీ ధర్నా
విజయనగరం: నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేయాలంటూ సోమవారం ఉదయం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వద్ద నాయకులు ధర్నా చేశారు. చంద్రబాబు వచ్చాక ధనికులు కూడా కూరగాయలు కొనాలంటే భయపడుతున్నారని అన్నారు. కిలో టమాట రూ.100 లకి చేరిందంటే పరిస్థితి ఏవిధంగా తయారైందో చూడాలన్నారు. వెంటనే ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు దిగివచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘చంద్రన్న రాజ్యం దోపిడీ రాజ్యం’, ‘నిత్యావసర ధరలు ఆకాశంలో ప్రజలు ఉపవాసంలో’ అని మహిళలు ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
నెల్లిమర్లలో విజృంభిస్తున్నడయేరియా
నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతిలో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటికే నెల్లిమర్ల, జరగాపుపేటకు చెందిన సుమారు 200 మంది డయేరియా బారిన పడగా.. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో 27 మంది చికిత్స పొందుతున్నారు. ఇంత జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.