-
14 ఏళ్లకే గవర్నర్ పదవి..?
వాషింగ్లన్ : మన దేశంలో 14 ఏళ్ల పిల్లాడు అంటే ఓ పది కేజీల పుస్తకాల సంచితో పొద్దున 6 - 7 గంటల ప్రాంతంలో వెళ్తే మళ్లీ రాత్రి ఎప్పుడో 8 గంటల ప్రాంతంలో తిరిగోస్తాడు. ఆదివారాలు, సెలవు రోజుల్లో అయితే ట్యూషన్లో కనిపిస్తాడు. అది లేకపోతే టీవీల ముందు కూర్చోని లేదా సెల్ఫోన్లో చాటింగ్ చేస్తూ కనిపిస్తాడు. కానీ గవర్నర్ పదవికి పోటీ చేస్తాడా అంటే.. పోటీ కాదు కదా కనీసం ఓటు కూడా వేయలేడు. ఎందుకంటే మన దేశంలో ఓటు హక్కు వయసు 18 ఏళ్లు. మరో అంశం ఏంటంటే గవర్నర్‌ను ఎన్నుకోం.. నియమిస్తారు. ఇది మనదేశంలో పరిస్థితి. కానీ అమెరికాలో మాత్రం రాష్ట్రాల వారిగా గవర్నర్లను ఎన్నుకుంటారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెర్మోంట్ రాష్ట్రంలో జరుగుతున్న గవర్నర్ ఎన్నికలు కేవలం ఆ రాష్ట్రంలోనే కాక అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఏథాన్ సోన్నేబోన్ అనే 14 ఏళ్ల బాలుడు గవర్నర్ పదవికి పోటి పడుతున్నాడు. అమెరికా ఈశాన్య రాష్ట్ర రాజ్యాంగ నియమాల వల్ల ఏథాన్ సోన్నేబోన్కు ఈ అవకాశం దక్కింది. ఈ నియమాల ప్రకారం వెర్మోంట్ రాష్ట్రంలో గవర్నర్ పదవికి పోటీ చేయాలంటే ఎటువంటి వయో పరిమితి లేదు. కానీ ఆ వ్యక్తి వరుసగా నాలుగేళ్లపాటు ఆ ప్రాంతంలో నివాసముండాలి. ఈ నియమం వల్ల ఏథాన్ వెర్మోంట్ ప్రాంత గవర్నర్‌గా పోటీ చేస్తున్నాడు. అయితే ఏథాన్ అందరిలా సాదాసీదీ పిల్లవాడు కాదు అంటున్నారు అతని మద్దతుదారులు. ఆరోగ్య రక్షణ, ఆర్థికాభివృద్ధి, విద్యారంగాల్లోఅభివుద్ధి కోసం నూతన సంస్కరణలు తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. ఏథాన్ ఇప్పటికే క్యాంపేయిన్ కూడా ప్రారంభించాడు. ఈ విషయం గురించి ఏథాన్ ‘మార్పు కోరుకునే వారిలో నేను ముందుంటాను. అందుకే ఈసారి నేను గవర్నర్ పదవికోసం పోటీ పడుతున్నాను. వయసు పెద్ద అడ్డంకి కాదు’ అన్నాడు. ఇతని ప్రత్యర్థిగా క్రిస్టీన్ హాల్క్విస్ట్ పోటీ చేస్తున్నాడు. ఇతని కూడా ప్రత్యేకమైన అభ్యర్దే. ఒకవేళ క్రిస్టీన్ ఈ ఎన్నికల్లో గెలిస్తే అమెరికాలో గవర్నర్‌గా విజయం సాధించిన తొలి లింగమార్పిడి వ్యక్తిగా చరిత్ర సృష్టిస్తాడు. అయితే ఏథాన్ గవర్నర్ పదవి కోసం పోటీ చేయడాన్ని అక్కడి మేధావులు వ్యతిరేకిస్తున్నారు. అతనికి ఉన్న రాజకీయ అనుభవం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఐస్‌క్రీంలకూ శ్మశానవాటిక..
నిజమే.. బ్రిటన్‌లోని వెర్మాంట్‌లో ఐస్క్రీంల కోసం ప్రత్యేకంగా ఓ శ్మశానవాటిక ఉంది. ఈ ఊర్లో బెన్ అండ్ జె ర్రీ ఐస్‌క్రీం చాలా ఫేమస్. ఈ కంపెనీయే వీటి కోసం ఈ శ్మశానవాటికను కట్టించింది. ఐస్క్రీంలలో ఎన్నో రుచులు ఉంటాయి. ఉదాహరణకు చాక్లెట్, వెనీలా వంటివి. కొత్త ఫ్లేవర్స్ వచ్చినప్పుడు పాత ఫ్లేవర్లు తెరమరుగైపోతాయి. ఒక్కోసారి వినియోగదారుల నుంచి డిమాండ్ లేకున్నా.. వాటిని తయారుచేయడం మానేస్తారు. ఈ లెక్కన సదరు కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 200 ఫ్లేవర్స్ తయారీ పలు కారణాలతో ఆపేశారు. దీంతో ‘చనిపోయిన’ ఆయా రుచుల ఐస్క్రీంల గౌరవార్థం ఈ శ్మశానవాటికను కట్టించారు. ‘నచ్చని’ వంట వడ్డిస్తారు.. ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్తే..మనకు నచ్చిన వంటకాలు వడ్డిస్తారు. కానీ ఈ రెస్టారెంట్లో అమెరికాకు ‘నచ్చని’ దేశాల వంటకాలు మాత్రమే వడ్డిస్తారు! అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో ఉన్న ఈ ‘కాన్ఫ్లిక్ట్ కిచెన్’ రెస్టారెంట్లో(పార్శిల్ సర్వీస్) ఆ దేశానికి శత్రుత్వం లేదా ఘర్షణ ఉన్న దేశాల వంటకాలు మాత్రమే తయారవుతాయి. అంటే ఇరాన్, ఉత్తర కొరియా, వెనిజులా వంటివన్నమాట. అంతేకాదు.. ఆయా దేశాల సంస్కృతి, సంప్రదాయాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడంతోపాటు అమెరికాకు ఆ దేశంతో ఉన్న ఘర్షణకు సంబంధించిన చరిత్రనూ వీరు తెలియజేస్తారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్‌లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement