breaking news
Venkatesvarravu
-
‘స్వదేశీ’ ముసుగులో విదేశీ సేవ
‘ఇఫ్టూ’ నేత వెంకటేశ్వర్రావు కాశిబుగ్గ : దేశప్రధాని నరేంద్రమోడీ స్వదేశీ నినాదం ముసుగులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఆయా దేశాల సేవకు అంకితమయ్యారని ఐఎఫ్టీయూ ఆల్ ఇండియా అధ్యక్షుడు సాదినేని వెంకటేశ్వర్రావు విమర్శించారు. వరంగల్ 14వ డివిజన్లోని ఐఎఫ్‌టీ యూ కార్యాలయంలో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెళ్లి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలోని ప్రధాన ఆదాయ వనరుల నిర్వహణ కో సం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిం చడం ద్వారా ఇక్కడి సంపదను వారికి దారాధత్తం చేస్తున్నారని ఆరోపించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వ్యతిరేకం గా సెప్టెంబర్‌లో చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. అలాగే, వచ్చే 9వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దీక్షలు చేపట్టాలని తీర్మానించారు. సమావేశంలో ఐ.కృష్ణ, అనురాధ, నరేందర్, రాసుద్దీన్, శంకర్, విశ్వనాథం, అవినాష్, విష్ణు, దయాకర్, నున్నా అప్పారావు, బయ్యన్న, నర్సిం గం, శ్రీను పాల్గొన్నారు. -
పోలీసుల బలిదానాలు మరువొద్దు
వరంగల్ క్రైం, న్యూస్‌లైన్ : పోలీసుల బలిదానాలు ప్రజలు మరువొద్దని వరంగల్ రూరల్, అర్బన్ ఎస్పీలు పాలరాజు, వెంకటేశ్వర్రావు అన్నారు. పోలీసుల అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో 5కే రన్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, పోలీసు సిబ్బంది, అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. వరంగల్ అర్బ న్, రూరల్ ఎస్పీలు పాల్గొన్న ఈ 5కే రన్‌ను రూరల్ అదనపు ఎస్పీ కె.శ్రీకాంత్ జెండా ఊపి ప్రారంభించా రు. హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలైన ఈ పరుగు నక్కలగుట్ట, కలెక్టర్ హౌస్, సర్క్యూట్ గెస్ట్ హౌస్ మీదుగా పోలీస్‌హెడ్ క్వార్టర్స్‌కు చేరుకుంది. ఈ పోటీల్లో సుమారు 500 మంది పాల్గొన్నారు. ఓపెన్ విభాగంలో శ్రవన్‌కుమార్, నాగరాజు, మధుసూదన్ మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు. 35 సంవత్సరాలు పైబడిన వారి విభాగంలో మైసయ్య, రా మారావు, సత్యనారాయణ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. జిల్లా స్పోర్ట్స్ హాస్టల్ విద్యార్థి నిఖి ల్ వర్మకు ప్రత్యేక నగదు బహుమతి అందజేశారు. విజేతలకు ఎస్పీలు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్పీ మాట్లాడుతూ పోలీసులపై ప్రజల కు ఉన్న అభిమానంతో పలువురు ఈ పరుగులో పాల్గొన్నారన్నారు. జిల్లా ప్రజలకు, పోలీసులకు మధ్య చక్కటి స్నేహపూర్వక వాతావరణం ఉందన్నారు. పోలీ సు బలిదానాలతోనే జిల్లా శాంతి కుసుమాలు విరభూసాయని అర్బన్ ఎస్పీ అన్నారు. అర్బన్ అదనపు ఎస్పీ ఉమామహేశ్వర్, కమాండెంట్ ప్రభాకర్, డీఎస్పీ రమే శ్, ఆర్ఐ ప్రతాప్, సుబేదారి, హన్మకొండ, కేయూసీ సీఐలు మధుసూదన్, దేవేందర్‌రెడ్డి, సత్యనారాయణ, సంక్షేమ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.