breaking news
Venkatappa Naidu
-
కేసు..తీర్పు.. సంచలనం
జిల్లాలో సంచలనం రేపిన టీడీపీ నాయకుడు, దేవనకొండ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో నిందితులు 17 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఆదోని రెండవ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సుబ్రమణ్యం బుధవారం తీర్పు వెలువరించారు. 2008 మే 17న కప్పట్రాళ్ల వెంకటప్ప నాయడు సహా 10 మంది దేవనకొండ మండలం మాచాపురం బస్సు స్టేజీ సమీపంలో హత్యకు గురయ్యారు. 48 మందిపై కేసు నమోదైంది. ఆరు సంవత్సరాల సుదీర్ఘ విచారణ సాగింది. 26 మందిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. తీర్పు నేపథ్యంలో ఆదోని కోర్టు ఆవరణలో భారీగా పోలీసులను మోహరించడంతోపాటు కప్పట్రాళ్ల గ్రామానికి అదనపు బలగాలను తరలించారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదోని కోర్టుకు స్వయంగా వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. రెండు ప్రధాన వర్గాల మధ్య చోటుచేసుకున్న సంఘటనకు సంబంధించిన తీర్పు దృష్ట్యా శాంతిభద్రతలు అదుపు తప్పకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీతో పాటు ఆదోని డీఎస్పీ బీఆర్ శ్రీనివాసులు, ఆరుగురు సీఐలు, 20 మంది ఎస్ఐలు, 100 మంది పోలీసు, సాయుధ బలగాలు బందోబస్తు నిర్వహించారు. మిన్నంటిన రోదనలు : తమ కుటుంబ సభ్యులు జీవిత ఖైదు పడి జైలుకు వెళ్తుండడంతో బంధువుల రోదనలు ఆదోని కోర్టు ఆవరణలో మిన్నంటాయి. మమ్ములను విడిచి వెళ్లిపోతున్నారు.. ఇక మాకింకెవరు దిక్కంటూ గుండెలు పగిలేలా రోదించారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే కోర్టు బయట ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు కోర్టు ఆవరణలోకి విలపిస్తూ వచ్చారు. వారిని పోలీసులు అదుపు చేయడంతో రోడ్డుపైనే బైఠాయించారు. తమ తండ్రులు జైలు కెళ్తున్నారని తెలుసుకొని చిన్నారులు గుక్కపట్టి ఏడ్చారు. తమ వాళ్లు ఏ అన్యాయం చేయలేదని, అన్యాయంగా శిక్ష విధించారని తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. కొంతమంది మహిళలు రోదిస్తూ సృ్పహ తప్పి పడిపోయారు. ముద్దాయిలను సబ్‌జైలుకు తీసుకెళ్లే వరకు కుటుంబ సభ్యులను దూరంగా ఉంచారు. -
కప్పట్రాళ్ళ కేసు : 21 మందికి జీవిత ఖైదు
-
కప్పట్రాళ్లలో టెన్షన్ టెన్షన్
-
కప్పట్రాళ్లలో టెన్షన్ టెన్షన్
కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో ఆదోని కోర్టు బుధవారం తుదితీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కప్పట్రాళ్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అంతేకాకుండా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా... ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసులను మోహరించారు. 2008, మే 17నే కప్పట్రాళ్ల నుంచి కోడుమూరుకు వెంకటప్పనాయుడు ఆయన అనుచరులు వాహనంలో బయలుదేరారు. కాగా వారి కోసం ముందుగానే దేవనకొండ మండలం మాచాపురం వద్ద ఆయన ప్రత్యర్థులు కాపుకాచి కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి వాహనాన్ని లారీతో ఢీ కొట్టారు. అనంతరం ప్రత్యర్థులు బాంబులతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో కప్పట్రాళ్లతోపాటు ఆయన అనుచరులు పది మంది మరణిచారు. దీంతో కప్పట్రాళ్ల వెంకటపనాయుడి కుమారుడు ప్రత్యర్థి వర్గంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ హత్య కేసులో 48 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల నివేదిక ఆధారంగా ఈ హత్య కేసును పత్తికొండ మేజిస్ట్రేట్ కోర్టు విచారణకు తీసుకుంది. నిందితుల భద్రత దృష్ట్యా ఈ కేసును ఆదోని జిల్లా సెషన్స్ కోర్టుకు మార్చారు. ఈ కేసులో తుది తీర్పు ఈ రోజు వెలువడనుంది. దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామ సర్పంచ్‌గా కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు 27 ఏళ్ల వయస్సులోనే ఎన్నికయ్యారు.