breaking news
vehicles auction
-
పోలీసులు మీ బండి తీసుకెళ్లారా.. అయితే త్వరపడండి
సాక్షి, హైదరాబాద్: వివిధ కేసుల్లో జప్తు చేసిన, వివిధ ప్రాంతాల నుంచి స్వాధీనం చేసుకున్న 2,193 వాహనాలు ప్రస్తుతం పోలీసుల అధీనంలో ఉన్నాయని నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ గురువారం పేర్కొన్నారు. వీటిని బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించామని తెలిపారు. ఆయా వాహనాల వేలంపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా, లేదా వాహన యాజమాన్య హక్కులు, ఫైనాన్స్/హైపోథికేషన్ క్లెయిమ్‌లు ఉన్నవారు సంబంధిత ఆధారాలతో ఆరు నెలల్లోగా దరఖాస్తు చేసుకోవాలని కొత్వాల్ సూచించారు. ఆ సమయంలోపు బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ భవనంలో ఉన్న సిటీ పోలీసు కమిషనరేట్‌లో దరఖాస్తు సమర్పించి తమ వాహనాలను క్లెయిమ్ చేసుకోవచ్చని తెలిపారు. వేలానికి సిద్ధంగా ఉన్న వాహనాల పూర్తి వివరాలు అంబర్పేట్ పోలీసు ఆసుపత్రి వెనుక ఉన్న ఎస్ఏఆర్ సీపీఎల్ పోలీసు గ్రౌండ్స్‌లోని ‘ఆక్షన్ టీమ్’ వద్ద అందుబాటులో ఉన్నాయి. సిటీ పోలీసు అధికారిక వెబ్సైట్ (www.hyderabadpolice.gov.in) ద్వారానూ ఈ వాహనాల వివరాలను పరిశీలించవచ్చని సీపీ ఒక ప్రకటనలో తెలిపారు.చదవండి: మెట్రో ప్రయాణికులకు ఊరట.. 60 కొత్త కోచ్‌లు! -
20న వాహనాల వేలం
ప్రొద్దుటూరు క్రైం: ఈ నెల 20న ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో వాహనాల వేలం నిర్వహిస్తున్నట్లు ఆర్టీఓ అబ్దుల్‌రవూఫ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్యాక్స్‌కట్టకుండా, బకాయిలు చెల్లించకుండా పట్టుబడిన వాహనాలను వేలం వేస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 34 వాహనాలు ఉన్నాయని, వాటిలో లైట్ గూడ్స్ వాహనాలు 25, హెవీగూడ్స్ 1, మోటార్ క్యాబ్ 1, ఆటోలు 7 ఉన్నాయని చెప్పారు. వేలంలో పాల్గొనదలిచిన వారు అసిస్టెంట్ సెక్రటరి ఆర్టీఓ పేరు మీద రూ.5 వేలు డీడీ తీసి దరఖాస్తు ఫారంతో పాటు అందజేయాలన్నారు. ఇతర వివరాలకు కార్యాలయంలోని 9848528645 అనే ఏఓ ఫోన్ నెంబర్‌కు సంప్రదించాలని ఆర్టీఓ తెలిపారు.


