Vegetable oils
-
ఔను.. రాధికకు రాయితీలిచ్చాం
సాక్షి, అమరావతి: ఔను.. రాధిక వెజిటబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 44 శాతం మేర రాయితీలిచ్చిన మాట వాస్తవమేనని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు స్పష్టం చేశారు. ‘రాధికకు ఇన్ని రాయితీలా?’ అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంపై గురువారం ప్రభుత్వం తరఫున ఆయన వివరణ ఇచ్చారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ప్రకారం రూ.200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే వాటిని మెగా పరిశ్రమలుగా పరిగణిస్తున్నామన్నారు. రూ.200 కోట్లకు పైగా ఉన్న మెగా ప్రాజెక్టులకు ఈ పాలసీ ప్రకారం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చే వెసులుబాటు ఉందన్నారు. రాధిక వెజిటబుల్ ఆయిల్స్ లిమిటెడ్ ప్రాజెక్టు మూలధన పెట్టుబడి రూ.218 కోట్లకు పైగా ఉన్నందున పాలసీ ప్రకారం స్థిర మూలధన పెట్టుబడిలో 75 శాతం వరకు ప్రోత్సాహకాలు మంజూరు చేయవచ్చన్నారు. ఈ మేరకు రాయితీలిచ్చామని చెప్పారు. 'రాధిక'కు ఇన్ని రాయితీలా!? -
ఆ కొవ్వులు మంచివే..!
కొత్త పరిశోధన వయసు మళ్లిన వాళ్లకు శాకాహార నూనెలు, చేపనూనెల్లోని కొవ్వులు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. శాకాహార నూనెలు, చేప నూనెల్లోని మేలు చేసే కొవ్వు పదార్థాలు గుండెజబ్బులు, పక్షవాతం, అధిక రక్తపోటు బారి నుంచి కాపాడతాయని, ఫలితంగా ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించేందుకు దోహదపడతాయని స్వీడన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అరవయ్యేళ్లకు పైబడిన వయసు గల నాలుగువేల మందిపై జరిపిన పరిశోధనల్లో శాకాహార నూనెలు, చేప నూనెల్లోని పాలీ అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని తేలినట్లు స్వీడన్‌లోని ఉప్సలా వర్సిటీ నిపుణుడు డాక్టర్ అల్ఫ్ రైజరస్ చెబుతు న్నారు. సాధారణంగా వయసు మళ్లిన వారి ఆహారంలో 25-30 శాతం కంటే అధికంగా కొవ్వు పదార్థాలు ఉండవని, ఈ కొవ్వులు మేలైన పదార్థాల నుంచి వచ్చినవిగా చూసుకుంటే చాలని ఆయన అంటున్నారు.


