breaking news
Vashu Bhagnani
-
రూ.80 కోట్ల మోసం.. ఆ డెరెక్టర్ పెద్ద మోసగాడు: ప్రముఖ నిర్మాత
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత వాసు భగ్నానీ సంచలన ఆరోపణలు చేశారు. ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన అలీ అబ్బాస్ జాఫర్ తనను మోసం చేశారంటూ కామెంట్స్ చేశారు. సినిమా నిర్మాణంలో దాదాపు రూ.80 కోట్ల వరకు అవతవకలకు పాల్పడారంటూ ఆరోపించారు. అక్షయ్ కుమార్ నటించిన ‘బడే మియాన్ చోటే మియాన్’ సినిమా నిర్మించే సమయంలో తన ఫేక్ కంపెనీతో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాడని వాసు భగ్నానీ వెల్లడించారు.తన ఫేక్ కంపెనీ పేరుతో ఆర్థిక నిర్వహణలో తీవ్రమైన అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. అబుదాబిలో రిజిస్టర్ చేసిన కంపెనీ పేరుతో.. ముంబయిలో జాలీ జంపర్ ఫిల్మ్స్ ఎల్ఎల్సీ పేరుతో మనీలాండరింగ్ చేశాడని అన్నారు. సినిమా బడ్జెట్‌ను దాదాపు రూ. 80 కోట్లు పెంచారని భగ్నాని వెల్లడించారు. ఆఖరికి నటీనటుల పారితోషికం తగ్గించినా భారీ మోసం కావడంతో ఇబ్బందులు పడ్డానని తెలిపారు. దీనిపై బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కేవలం నా డబ్బును తిరిగి పొందడం మాత్రమే కాదు. మరే ఇతర నిర్మాత ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం రాకూడదని నిజం బయటకు రావాలని పోరాడుతున్నట్లు వాసు భగ్నానీ అన్నారు.నిర్మాత వాసు భగ్నానీ మాట్లాడుతూ.. 'అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు మెహ్రా.. ఏఏజెడ్ ఫిల్మ్స్ అనే బ్యానర్ కింద పనిచేస్తున్నారు. మేము బడే మియాన్ చోటే మియాన్ మూవీ కోసం వారితో జతకట్టా. నేను ఈ ప్రాజెక్ట్ కోసం ఆర్థిక సహాయం కూడా చేశా. వారికి దర్శకత్వాన్ని బాధ్యతలు అప్పగించా. సృజనాత్మక నిర్ణయాలలో తాను పెద్దగా జోక్యం చేసుకోలేదని.. లండన్‌తో పాటు ఇండియాలో జాఫర్ సూచించిన షూటింగ్ ప్రదేశాలను ఆమోదించా. అయితే రెండు నెలల క్రితమే జాలీ జంపర్ ఫిల్మ్స్ ఎల్ఎల్సీ సంస్థ గురించి తెలుసుకున్నా. అది జాఫర్ సహాయకుడి పేరుతో రిజిస్టర్ చేశారు. ఇదంతా బయటికి రాకుండా రహస్యంగా నిర్వహించారు. సినిమా ఖర్చులను పెంచడం, నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు" అని అన్నారు. కాగా.. గతంలో బాలీవుడ్ నిర్మాత, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ కూడా ఈ సినిమా కోసం ఆస్తులు తాకట్టు పెట్టామని ఆవేదన చెందారు. -
మూగ, చెవిటి పాత్రలో స్టార్ హీరోయిన్
ప్రస్తుతం స్టార్ హీరోయిన్లందరూ లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద దృష్టిపెడుతున్నారు. అలా కుదరని పక్షంలో ఉన్నంతలో తమ పాత్రతో నటిగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనుష్క, నయనతార లాంటి స్టార్ హీరోయిన్స్ పర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్‌లో సక్సెస్ సాధించగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అదే ప్రయత్నాల్లో ఉంది. సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ హీరోయిన్గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న తమన్నా ఇప్పుడు నటిగా ప్రూవ్ చేసుకోవాలని తాపత్రేయపడుతోంది. అందుకే అభినేత్రి సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవటంతో తమన్నా కష్టం వృథా అయ్యింది. అయితే తాజాగా మరో ఛాలెంజిగ్ రోల్‌కు ఓకె చెప్పింది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం బాహుబలి 2 ప్రమోషన్లో బిజీగా ఉన్న తమన్నా, ఈ పనులన్ని పూర్తయ్యాక, బాలీవుడ్ దర్శకుడు వసు భగ్నాని నిర్మాణంలో ఓ సినిమా చేయనుంది. ఈ సినిమాలో తమన్నా మూగ, చెవిటి అమ్మాయిగా నటిస్తుందట. ఈ సినిమాతో నటిగా తాను అనుకున్న ఇమేజ్ వస్తుందన్న నమ్మకంతో ఉంది తమ్ము. అంతేకాదు మరోసారి ప్రభుదేవా దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించానన్న తమన్నా, ఆ సినిమాతో తన క్యారెక్టర్ అభిమానులకు షాక్ ఇస్తుందని తెలిపింది. -
ఆమెను అక్కడ పరిచయం చేయాలన్నదే నా కోరిక!
నటి నయనతారను బాలీవుడ్‌కు పరిచయం చేయాలన్నది తన కోరిక అని అన్నారు ప్రముఖ హిందీ నిర్మాత వాసు భగ్నాని. ఆయన తన భాగస్వామి దీప్షిఖా దేశ్ముఖ్తో కలిసి పూజా ఎంటర్టెయిన్మెంట్ అండ్ ఫిలింస్ లిమిటెడ్ పతాకంపై హిందీ, మరాఠి, పంజాబీ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. వాటిలో బిగ్‌బీ అమితాబ్, షారూఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ వంటి ప్రముఖ కథానాయకుల చిత్రాలు ఉన్నాయి. అలాంటి సంస్థ తాజాగా దక్షిణాదిలోనూ చిత్రాలు నిర్మించడానికి రెడీ అయ్యింది. తొలి ప్రయత్నంగా నయనతార కథానాయకిగా కొలైయుధీర్ కాలం అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి ఇంతకు ముందు కమలహాసన్ హీరోగా ఎన్నైప్పోల్ ఒరువన్, అజిత్‌తో బిల్లా–2 చిత్రాలను తెరకెక్కించిన చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ సెంట్రిక్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యువన్‌శంకర్‌రాజా సంగీత బాణీలు కడుతున్నారు. ఇప్పటికే ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలై చాలా ఆతృతను రేకెత్తించిన కొలైయుధీర్ కాలం చిత్రం శుక్రవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా పూజా ఎంటర్టెయిన్మెంట్ అండ్ ఫిలింస్ లిమిటెడ్ సంస్థ అధినేతలలో ఒకరైన వాసు భగ్నానీ మాట్లాడుతూ తమిళ చిత్రాలంటే తనకు చాలా ఆసక్తి అన్నారు. తాను తాను హిందీలో తొలిసారిగా నిర్మించిన కూలీ–1 చిత్రం తమిళ చిత్రం చిన్న మాప్పిళ్లైకు రీమేక్ అని తెలిపారు.ఆ తరువాత సతీలీలావతి చిత్రాన్ని రీమేక్ చేసినట్లు చెప్పారు.అలా ఇప్పటికి పలు భాషల్లో 30 చిత్రాలు చేసిన తమ సంస్థలో నిర్మిస్తున్న 31వ చిత్రం ఈ కొలైయుధీర్ కాలం అని తెలిపారు. తాను చూసిన ఉత్తమ నటీమణుల్లో నయనతార ఒకరన్నారు. అలాంటి నటి హీరోయిన్గా దక్షిణాదిలో తొలి చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. నయనతారను బాలీవుడ్‌కు పరిచయం చేయాలన్నది తన కోరిక అని, అంత టాలెంట్ ఉన్న నటి నయనతార అని పేర్కొన్నారు. తాము దక్షిణాదిలో అభిషేక్ ఫిలింస్ సంస్థతో కలిసి చిత్ర నిర్మా ణం, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇకపై తమిళం, మలయాళం భాషల్లో వరుసగా చిత్రాలు నిర్మించాలని భావిస్తున్నట్లు చెప్పారు.ఈ కొలైయుధీర్ కాలం చిత్ర హిందీ వెర్షన్లో నయనతార పాత్రను మిల్కీబ్యూటీ తమన్నా పోషించనున్నారు.ఆయనతోపాటు నటుడు ప్రభుదేవా నటించనున్నారు. -
జన్మలో బిపాసాతో సినిమా చేయను
బ్లాక్ బ్యూటీ అయినా కూడా బిపాసా బసు అంటే బాలీవుడ్లో బోలెడంత క్రేజ్ ఉంది. కానీ, శుక్రవారమే విడుదలైన 'హమ్‌షకల్స్' చిత్ర నిర్మాత వాషు భగ్నాని మాత్రం ఆమె పేరెత్తితే చాలు.. భగ్గుమంటున్నారు. ఇకమీదట పొరపాటున కూడా ఆమెతో సినిమా చేసే ప్రసక్తి లేదని కుండ బద్దలుకొట్టి మరీ చెబుతున్నారు. సాజిద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్, సైఫ్ అలీఖాన్, రాం కపూర్, ఈషా గుప్తా, తమన్నా.. వీళ్లంతా కూడా ఉన్నారు. ఇంతమంది ఉన్నా, బిపాసా అంటే మాత్రం ఆ నిర్మాత మండిపడుతున్నారు. తాను ఇలాంటి మాట చెప్పి ఉండకూడదు గానీ, వీలైనంత వరకు ఆమెతో సినిమా చేయకుండానే ఉంటానన్నారు. సినిమాకు సంబంధించిన ఒక్క ప్రమోషన్ ఈవెంట్‌కు కూడా బిపాసా వెళ్లలేదు. మిల్కీబ్యూటీ తమన్నా పక్కన తాను అంత అందంగా కనపడనని అనుకుందో ఏమో గానీ, మొత్తానికి బిప్స్ డుమ్మా కొట్టింది. ఇదే నిర్మాత గారి ఆగ్రహానికి కారణం అయ్యిందని అంతా అంటున్నారు. చివరకు సినిమా కూడా తుస్సుమందన్న టాక్ మొదటిరోజే వినిపించింది. సినిమాలో తన పాత్ర చిన్నదని ఆమె అంటున్నా.. సినిమా చూస్తే అలా ఎవరికీ అనిపించదని, తాను స్వయంగా ఆమెకు పారితోషికం కూడా ఇచ్చానని నిర్మాత అన్నారు.


