మూగ, చెవిటి పాత్రలో స్టార్ హీరోయిన్ | Tamannah To Play Deaf, Mute In Vashu Bhagnani Film | Sakshi
Sakshi News home page

మూగ, చెవిటి పాత్రలో స్టార్ హీరోయిన్

Apr 15 2017 11:20 AM | Updated on Sep 5 2017 8:51 AM

మూగ, చెవిటి పాత్రలో స్టార్ హీరోయిన్

మూగ, చెవిటి పాత్రలో స్టార్ హీరోయిన్

ప్రస్తుతం స్టార్ హీరోయిన్లందరూ లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద దృష్టిపెడుతున్నారు. అలా కుదరని పక్షంలో ఉన్నంతలో

ప్రస్తుతం స్టార్ హీరోయిన్లందరూ లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద దృష్టిపెడుతున్నారు. అలా కుదరని పక్షంలో ఉన్నంతలో తమ పాత్రతో నటిగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనుష్క, నయనతార లాంటి స్టార్ హీరోయిన్స్ పర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్లో సక్సెస్ సాధించగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అదే ప్రయత్నాల్లో ఉంది.

సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ హీరోయిన్గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న తమన్నా ఇప్పుడు నటిగా ప్రూవ్ చేసుకోవాలని తాపత్రేయపడుతోంది. అందుకే అభినేత్రి సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవటంతో తమన్నా కష్టం వృథా అయ్యింది. అయితే తాజాగా మరో ఛాలెంజిగ్ రోల్కు ఓకె చెప్పింది ఈ హాట్ బ్యూటీ.

ప్రస్తుతం బాహుబలి 2 ప్రమోషన్లో బిజీగా ఉన్న తమన్నా, ఈ పనులన్ని పూర్తయ్యాక, బాలీవుడ్ దర్శకుడు వసు భగ్నాని నిర్మాణంలో ఓ సినిమా చేయనుంది. ఈ సినిమాలో తమన్నా మూగ, చెవిటి అమ్మాయిగా నటిస్తుందట. ఈ సినిమాతో నటిగా తాను అనుకున్న ఇమేజ్ వస్తుందన్న నమ్మకంతో ఉంది తమ్ము. అంతేకాదు మరోసారి ప్రభుదేవా దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించానన్న తమన్నా, ఆ సినిమాతో తన క్యారెక్టర్ అభిమానులకు షాక్ ఇస్తుందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement