breaking news
varamma
-
ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అనుచరులతో మాకు ప్రాణహాని
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అనుచరులతో తమకు ప్రాణహాని ఉందని నెల్లూరు జిల్లా జలదంకి మండలం కమ్మపాలెం గ్రామానికి చెందిన వెనిగంట్ల వరమ్మ, ఆమె కుమార్తె రజిత మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో వివరాలను రజిత వెల్లడించారు. ‘నా తల్లి వరమ్మ పేరు మీద కమ్మపాలెంలో ఐదెకరాల భూమి ఉంది. ఇందులో నా అన్న రమేష్ కు 3 ఎకరాలు, పసుపు కుంకుమ కింద నాకు 2 ఎకరాలు వచ్చాయి. పెళ్లి తర్వాత నేను విజయవాడలో నివాసం ఉంటున్నాను. నాకు మా అమ్మ ఇచ్చిన భూమికి పక్కనే మరో రెండెకరాల భూమిని కొనుగోలు చేశా. కమ్మపాలెంకు దగ్గరగా జాతీయ రహదారి రావడంతో భూముల విలువ అమాంతం పెరిగింది. దీంతో కమ్మపాలెంలో ఉన్న మా అమ్మ ఇంటిపైనా, అలాగే నా భూమిపైనా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అనుచరులు దివి శ్రీను, ఘంటా అశోక్, ఘంటా సుబ్బనాయుడు కన్నుపడింది. అప్పటి నుంచి వారు నా నాలుగు ఎకరాల భూమిలోకి వెళ్లనీయకుండా బెదిరిస్తున్నారు. పైగా భూమిని వారి కబ్జాలోకి తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా తల్లిని ఇంట్లోకి రానీయకుండా సైతం ఇబ్బందులకు గురి చేశారు. ఇంటిని కబ్జా చేయడంతో భయపడి విజయవాడలో నా వద్దనే ఉంటోంది. మాకు జరిగిన అన్యాయాన్ని అధికారులకు చెప్పుకునేందుకు వెళితే ఎమ్మెల్యే తన అధికారాన్ని ప్రయోగిస్తున్నారు. జేసీ, ఆర్డీఓలకు ఫిర్యాదు చేయగా వారు జలదంకి పోలీసుల వద్దకు పంపించారు. పోలీస్ స్టేషన్‌కు వెళితే.. అప్పుడే అక్కడకు దివి శ్రీను, ఘంటా అశోక్; సుబ్బనాయుడు వచ్చారు. మాపై పోలీసుల ఎదుటే దౌర్జన్యం చేశారు. నా తల్లిని తలపై కొట్టారు. పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని మా భూమిని, ఇంటిని మాకు దక్కేలా చూడాలి’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. నేర చరిత్ర ఉన్న ఎమ్మెల్యే అనుచరుల నుంచి తమకు రక్షణ కల్పించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. -
రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
కోదాడ : రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డులో చోటు చేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం భీమారానికి చెందిన చిలుముల వరమ్మ (19) తన అన్న చిలుముల నాగార్జున, అక్క కొడుకు రవితో కలసి మోటార్ సైకిల్‌పై సోమవారం ఖమ్మం జిల్లా గోకినపల్లి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద మలుపు తిరుగుతుండగా వెనుక నుంచి వచ్చిన డీసీఎం వీరి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో వెనుక కూర్చున్న వరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలితో పాటు ఉన్న ఆమె అక్క కుమారుడికి, మోటార్‌సైకిల్ నడుపుతున్న ఆమె అన్నకు స్పల్ప గాయాలయ్యాయి. బంధువుల ఫిర్యాదు మేరకు కోదాడ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
వడదెబ్బతో మహిళ మృతి
టేకులపల్లి మండలం పరిధిలోని ముత్యాలంపాడు పంచాయతీ మాలపల్లి గ్రామానికి చెందిన అంతోటి వరమ్మ(50) అనే మహిళ శుక్రవారం వడదెబ్బ తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. పొలంలో కూలీ పనులకు వె ళ్లిపుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆమెకు ఇద్దరు కుమారులు.


