breaking news
vanka ravindranath
-
World MSME Day: సర్వతోముఖాభివృద్ధికి సంపూర్ణ చేయూత
ఒక దేశ సర్వతోముఖాభి వృద్ధికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎమ్ఎస్ఎమ్ఈలు) ఎంతో ఉపయోగకరం. ఐక్యరాజ్య సమితి 2017 ఏప్రిల్ 6న 74వ ప్లీనరీలో... అభివృద్ధి చెందుతున్న దేశాలలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో ఎమ్ఎస్ఎమ్ఈల జాతీయ సామర్థ్యాలను ఆయా దేశాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం కోసం జూన్ 27వ తారీఖును ఎమ్ఎస్ఎమ్ఈల డేగా ప్రకటించడం ప్రాముఖ్యం సంతరించుకున్నది. మన దేశంలో 2016 నాటి గణాంకాల ప్రకారం 6 లక్షల ఎమ్ఎస్ ఎమ్ఈలు ఉన్నాయి. కేంద్రం... రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత సహకారం అందజేస్తూ తగిన విధానాలను, సాంకేతికతను, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడానికి ముందుకు రావాలి. ఏపీలో గత ప్రభుత్వం 2017లో ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఎమ్‌ఎస్‌ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ప్రారంభించింది. అయితే దానికి ఎటువంటి నామినేటెడ్ బాడీనిగానీ, ఆఫీసునుగానీ ఏర్పాటు చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం పోయిన ఏడాది కార్పొరేషన్ చైర్మన్‌ను, డైరెక్టర్లను నియమించింది. రాష్ట్రంలో సుమారు లక్ష ఎమ్ఎస్ఎమ్ఈలు రిజిస్టరై ఉన్నాయి. కోవిడ్ వల్ల దెబ్బతిన్న ఎమ్ఎస్ఎమ్ఈలు ఇప్పుడిప్పుడే తిరిగి పునః ప్రారంభమవుతున్నాయి. ఈ తరుణంలో గత రాష్ట్ర ప్రభుత్వం ఎమ్ఎస్ఎమ్ఈలకు ప్రకటించిన ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా చెల్లించడంతో వాటికి ఒక చక్కటి భరోసా లభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కుడా ఆర్థిక ప్రోత్సాహకాలను త్వరలోనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇటీవల జరిగిన పారిశ్రామిక రివ్యూ సమావేశంలో ఎమ్ఎస్ఎమ్ఈల వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడానికి దేశంలోని నిపుణుల నుండి సలహాలు తీసుకోవాలని అన్నారు. సంస్థ ప్రభావవంతంగా పనిచేయడానికి శాఖాపరమైన మార్పుల కోసం నోట్‌ను తయారు చేయమని కార్పొ రేషన్ అధ్యక్షుణ్ణి ఆదేశించారు. ఆర్థిక ప్రోత్సాహకాలతో పాటు, నాణ్యమైన ఉత్పత్తి, ప్రణాళికాబద్ధమెన యాజమాన్యపు పద్ధ తులు, శాస్త్ర సాంకేతికతలో వచ్చిన నూతన అభివృద్ధి, నాణ్యమైన ముడి పదార్థాల సరఫరా, దేశీయ, అంతర్జాతీయ రంగాలలో మార్కెటింగ్ మెలకువలు లాంటి విషయాలు... ఎమ్ఎస్ఎమ్ఈలు స్థిరపడడానికీ, అభివృద్ధి చెందడానికీ చాలా అవసరం. ఈ అంశాలలో తగిన విషయ పరిజ్ఞానం లేకపోవడం మూలంగా అనేక ఎమ్ఎస్ఎమ్ఈలు పోటీలో నిలబడలేక అంతరించిపోతున్నాయి. (క్లిక్: విద్యారంగంలో జగన్ జైత్రయాత్ర) నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్... ఇనుము, రసాయనాలు, లోహాలు, ఇతర ముడి పదార్థాలు ఎమ్ఎస్ఎమ్ఈల కోసం క్రమబద్ధంగా భారీ పరిశ్రమల నుండి కొనుగోలు చేసి వాటికి క్రెడిట్ రూపంలో అందించగలుగుతుంది. ఈ సౌకర్యాన్ని మన రాష్ట్రంలో అత్యంత పరిమితంగా వాడుకుంటున్నాం. ఏ చిన్న పరిశ్రమకైనా ముడిపదార్థం నిరంతర సరఫరా జరిగితేనే ఆ సంస్థ నిలదొక్కుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే మిషనరీ కొనుగోలు చేయడంలోనూ, డిజిటల్ సర్వీసెస్ అందజేయడంలోనూ, ఇన్ఫో మీడియరీ సర్వీస్ అందజేయడంలోనూ, జాతీయ – అంతర్జా తీయ ఎగ్జిబిషన్లలో పాల్గొనడంలోనూ ఇది ఎమ్ఎస్ఎమ్ఈలకు సహకరిస్తుంది. ఇలాగే నాబార్డ్, సిడ్బి, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ సంస్థ, ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్, వరల్డ్‌బ్యాంక్, ఐక్యరాజ్య సమితి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలు అందించే సహకారాన్ని కుగ్రామాల్లో ఉన్న ఎమ్ఎస్ఎమ్ఈలకు చేరవేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో ముందు ముందు ఇవి దేశ ప్రగతిలో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. (క్లిక్: పేద యువతను నిందించగలమా?) - వంక రవీంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్ ఎమ్ఎస్ఎమ్ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ (జూన్ 27న ఎమ్ఎస్ఎమ్ఈల దినోత్సవం) -
రాష్ట్రంలో 26 ఎంఎస్ఎంఈ క్లస్టర్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లను బలోపేతం చేయడం ద్వారా పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంకా రవీంద్రనాథ్ తెలిపారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా 26 ఉత్పత్తులను గుర్తించి అన్ని సౌకర్యాలు ఒకేచోట లభించే విధంగా క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని గవర్నమెంట్ ప్రెస్ ఆవరణలో ఉన్న ఎంఎస్ఎంఈ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన అధ్యక్షతన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం నిర్వహించారు. అంతకు ముందు డైరెక్టర్లుగా నియమితులైన ఎన్.రఘునాథ్ రెడ్డి, ఎస్.ఆనందపార్థసారథి, నల్ల బేబీజానకి, భీమవరపు విజయలక్ష్మి, తలారి అంజనీ, గోపర్తి వరలక్ష్మి, కస్గిరెడ్డి శారద, షేక్ కరీముల్లా, మేడా వెంకటబద్రీనారాయణ, శీలమే నదియా, ముదడ్ల గౌరీశంకర్రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ జగయ్య పేటలో ఆభరణాల క్లస్టర్, కాకినాడలో ప్రింటింగ్, తూర్పుగోదావరి జిల్లా మాచవరంలో పప్పుదిను సులు, రాజమండ్రిలో ఫర్నిచర్, నెల్లూరులో రెడీ మేడ్ దుస్తుల క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. 2023 నాటికి అన్ని అసెంబ్లీ నియోజ కవర్గాల్లో 50 నుంచి 100 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సమావేశంలో కార్పొరేషన్ సీఈవో ఆర్.పవనమూర్తి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. -
రవీంద్రనాథ్‌కు నిర్యత్‌శ్రీ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: భారత ఎగుమతి సంస్థల సమాఖ్య(ఎఫ్ఐఈఓ) ప్రకటించిన నిర్యత్‌శ్రీ అవార్డును పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన వంకా రవీంద్రనాథ్ అందుకున్నారు. సోమవారం ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. వివిధ రంగాల్లో ఎగుమతుల విషయంలో విశేష ప్రతిభ కనబరిచిన వ్యాపారవేత్తలకు ఈ అవార్డును ప్రకటిస్తారు. ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్‌కు ఛైర్మన్ అయిన వంకా రవీంద్రనాథ్ తలనీలాల ఎగుమతుల్లో విశేష ప్రతిభ కనబరిచారు. మహిళలకు ఉపాధి కల్పించడం, విదేశీ మారక ద్రవ్యం తెచ్చిపెట్టడంలో గుర్తించదగిన ప్రతిభ, వృద్ధి చూపినందుకు ఆయనను ఈ అవార్డు వరించింది. -
'మత్స్యకారుల అభ్యున్నతికి ప్రత్యేక ప్రణాళిక'
నర్సాపురం: తీర ప్రాంతంలోని మత్స్యకారుల అభ్యున్నతికి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తారని నర్సాపురం లోక్‌సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంకా రవీంద్రనాథ్, అసెంబ్లీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. నర్సాపురంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వైఎస్ఆర్ సీపీ ద్వారానే సాధ్యమన్నారు. ఈ ఎన్నికల్లో సీలింగ్ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తమను గెలిపించాలని ఓటర్లను వారు అభ్యర్థించారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా, పేదల కష్టాలు తీరాలన్నా జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అన్ని వర్గాల వారు భావిస్తున్నారన్నారు.