breaking news
Vance Hartwell
-
ప్రోస్థెటిక్ మేకప్ కింగ్‌తో జూనియర్ ఏం చేస్తున్నాడు?
వాన్స్ హార్ట్వెల్... ఎన్టీఆర్ పక్కన ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు. ఈయన మామూలోడు కాదండీ బాబు. సకల కళా వల్లభుడు! హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 30 ఏళ్ల అనుభవం ఈయనది. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’, ‘ఐరన్ మాన్’, ‘లైఫ్ ఆఫ్ పై’ తదితర చిత్రాల్లో ఆర్టిస్టులకు ఈయన ప్రోస్థెటిక్ మేకప్ సేవలు అందించారు. అంతేనా... పెయింటింగులు, విజు వల్ ఎఫెక్ట్స్ చాలా చేస్తారు. రజనీకాంత్ ‘రోబో’కి యానిమెట్రోనిక్స్ అండ్ మేకప్ ఎఫెక్ట్స్ వర్క్స్ చేశారు. రజనీ రోబో మాస్కులు తయారుచేసింది ఈయనే. ఇప్పుడీయన హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్‌ని కలిశారు. ప్రోస్థెటిక్ మేకప్ కింగ్‌తో ఎన్టీఆర్ ఏం చేస్తున్నారనే డౌట్ వచ్చిందా? ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వాన్స్ హార్ట్వెల్ పనిచేస్తున్నారు. ్రపోస్థెటిక్ మేకప్ అండ్ ఎఫెక్ట్స్ సేవలు అందించనున్నారు. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించకున్నా.... ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. మూడు పాత్రల మధ్య మేకప్పరంగా వ్యత్యాసం చూపించడానికి వాన్స్ హార్ట్‌వెల్‌ని రప్పించారని ఊహించవచ్చు. ఇందులో ముగ్గురు కథానాయికలు నటిస్తారు. ఇప్పటికే రాశీఖన్నా, నివేదా థామస్‌లను ఎంపిక చేశారట. -
జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రఖ్యాత మేకప్ ఆర్టిస్ట్
చెన్నై: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో ప్రఖ్యాత మేకప్ ఆర్టిస్ట్ పనిచేయనున్నారు. లార్డ్ ఆఫ్ రింగ్స్, షట్టర్ ఐలాండ్ వంటి చిత్రాలకు మేకప్ ఆర్టిస్టుగా పనిచేసిన వాన్స్ హార్ట్వెల్ ఎన్టీఆర్‌కు మేకప్ మేన్‌గా పనిచేయనున్నట్లు సమాచారం. లాస్ఏంజెల్స్ నుంచి వచ్చిన మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్వెల్ శనివారం చెన్నైలో జూనియర్ ఎన్టీఆర్‌తో గంటసేపు చర్చలు జరిపారు. బాబీ దర్శకుడిగా ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నెలాఖరులో ఎన్టీఆర్ కూడా షూటింగ్లో పాల్గొంటారని, మార్చిలో మేకప్ ఆర్టిస్ట్ హార్ట్వెల్ వస్తారని చిత్ర వర్గాలు తెలిపాయి. మూడు రకాల గెటప్‌తో ఎన్టీఆర్ ఈ సినిమాలో పూర్తి వెరైటీ లుక్‌తో ఉంటారని చెబుతున్నారు. ఈ సినిమాలో రాశీఖన్నా ఓ హీరోయిన్గా కాగా మరో హీరోయిన్ నూ ఇంకా నిర్ణయించాల్సి ఉందని సమాచారం.