జూనియర్‌ ఎన్టీఆర్‌ కోసం ప్రఖ్యాత మేకప్‌ ఆర్టిస్ట్‌ | hollywood makeup artist work for junior NTR movie | Sakshi
Sakshi News home page

జూనియర్‌ ఎన్టీఆర్‌ కోసం ప్రఖ్యాత మేకప్‌ ఆర్టిస్ట్‌

Feb 4 2017 8:55 PM | Updated on Sep 5 2017 2:54 AM

జూనియర్‌ ఎన్టీఆర్‌ కోసం ప్రఖ్యాత మేకప్‌ ఆర్టిస్ట్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌ కోసం ప్రఖ్యాత మేకప్‌ ఆర్టిస్ట్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో ప్రఖ్యాత మేకప్‌ ఆర్టిస్ట్‌ పనిచేయనున్నారు.

చెన్నై: జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో ప్రఖ్యాత మేకప్‌ ఆర్టిస్ట్‌ పనిచేయనున్నారు. లార్డ్‌ ఆఫ్‌ రింగ్స్‌, షట్టర్‌ ఐలాండ్‌ వంటి చిత్రాలకు మేకప్‌ ఆర్టిస్టుగా పనిచేసిన వాన్స్‌ హార్ట్‌వెల్‌ ఎన్టీఆర్‌కు మేకప్‌ మేన్‌గా పనిచేయనున్నట్లు సమాచారం. లాస్‌ఏంజెల్స్‌ నుంచి వచ్చిన మేకప్‌ ఆర్టిస్ట్‌ వాన్స్‌ హార్ట్‌వెల్‌ శనివారం చెన్నైలో జూనియర్‌ ఎన్టీఆర్‌తో గంటసేపు చర్చలు జరిపారు. బాబీ దర్శకుడిగా ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

ఈ నెలాఖరులో ఎన్టీఆర్‌ కూడా షూటింగ్‌లో పాల్గొంటారని, మార్చిలో మేకప్‌ ఆర్టిస్ట్‌ హార్ట్‌వెల్‌ వస్తారని చిత్ర వర్గాలు తెలిపాయి. మూడు రకాల గెటప్‌తో ఎన్టీఆర్‌ ఈ సినిమాలో పూర్తి వెరైటీ లుక్‌తో ఉంటారని చెబుతున్నారు. ఈ సినిమాలో రాశీఖన్నా ఓ హీరోయిన్‌గా కాగా మరో హీరోయిన్‌ నూ ఇంకా నిర్ణయించాల్సి ఉందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement