breaking news
Vaikuntham queue complex
-
తిరుమలలో మరో వంతెన
తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయానికి అనుసంధానంగా ఉన్న కదిలే æవంతెన స్థానంలో మరో కొత్త వంతెన నిర్మించాలని టీటీడీ భావిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి భక్తులు వేగంగా, సులువుగా వెళ్లేందుకు వీలుగా కొత్త వంతెన నిర్మించాలని నిర్ణయించింది. భక్తుల క్యూ వేగానికి కదిలేవంతెన చాలడం లేదు 1985లో మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్, 2003లో రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్ నిర్మించారు. వీటికి అనుసంధానంగా దక్షిణమాడ వీధిలోని తిరుమల నంబి సన్నిధి వద్ద కదిలే వంతెన నిర్మించారు. ఐదేళ్లకు ముందు పూర్తిస్థాయి హైడ్రాలిక్ యంత్రాలతో నిర్మించారు. ఈ వంతెనపై కేవలం రెండు లైన్లే వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల క్యూలు ఆలస్యమవుతున్నాయి. రద్దీ రోజుల్లో మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కింద భాగంలోని అత్యవసర ద్వారం నుంచి తిరుమల నంబి ఆలయం మీదుగా ఆలయ క్యూలకు భక్తులను అనుమతించాల్సి వస్తోంది. శ్రీవారి వాహనసేవలకూ ఇబ్బందే బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పర్వదినాల్లో వాహన సేవల ఊరేగింపు సమయాల్లో కదిలేవంతెనతో ఇబ్బందులున్నాయి. వాహనసేవకు ముందు తీయడం, తిరిగి అమర్చేందుకు కనీసం 20 నిమిషాల సమయం పడుతోంది. దీనివల్ల క్యూలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కదిలేవంతెన సమస్యల్ని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు గుర్తించారు. ఆమేరకు నిపుణుల సూచనలు కోరారు. ఇందులో భాగంగానే గురువారం టీటీడీ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, ఐఐటీ నిపుణుల బృందం కూడా కదిలే వంతెనను పరిశీలించింది. కొత్త వంతెన అమర్చాలని నిర్ణయం ప్రస్తుతం ఉన్న కదిలే వంతెనకు ఆనుకునే పడమర దిశలో కొత్త వంతెన నిర్మించనున్నారు. భక్తులు నాలుగు లేన్లుగా వెళ్లడం, వాహన సేవల ఊరేగింపు సమయాల్లో తొలగించడం, తిరిగి అమర్చే విషయంలో కేవలం 5 నిమిషాల సమయం ఉండేలా కొత్త వంతెన అమర్చాలని భావిస్తున్నారు. రానున్న బ్రహ్మోత్సవాల్లోపు ఈ వంతెన నిర్మించాలని ఇంజినీర్లు యోచి స్తున్నారు. ప్రస్తుతమున్న వంతెన అత్యవసర పరిస్థితుల్లో వినియోగించనున్నారు. శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2016లో మొత్తం 2.66 కోట్ల మంది వచ్చారు. అంటే రోజూ 72 వేల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. దీనికి తగ్గట్టుగా క్యూలు లేవు. అందుకనుగుణంగా క్యూల్లో మార్పులుచేర్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. -
పచ్చని చెట్లతో తిరుమల క్షేత్రం అభివృద్ధి
టీటీడీ ఈవో సాంబశివరావు వికలాంగుల క్యూ మార్పునకు ఆదేశం సాక్షి,తిరుమల : తిరుమల క్షేత్రాన్ని పచ్చని చెట్లు, మనసుదోచే పుష్పాల మొక్కలతో అభివృద్ధి చేస్తామని టీటీడీ ఈవో డి.సాంబశివరావు అన్నారు. గురువారం ఆయన ఆలయ నాలుగు మాడ వీధులతోపాటు పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్తోపాటు ఎక్కడ చూసినా పచ్చదనం కనిపించేలా మొక్కలు నాటే పనులు ప్రారంభించాలని అధికారులను ఈవో ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వేసవి రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని అన్ని విభాగాలను ఆదేశించామన్నారు. కల్యాణకట్టల్లో సత్వరమే గుండ్లు కొట్టేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అక్కడ కూడా పారిశుధ్యం మరింత మెరుగుపడేలా సత్వర చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. యాత్రాసదన్లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. వికలాంగుల క్యూ మార్పునకు ఆదేశం వికలాంగులు, వృద్ధుల నడక భారాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం అనుమతించే తిరుమల ఆలయం నుంచి కాకుండా ఇకపై సహస్రదీపాలంకరణ మండపం ఎదురుగా ఉండే అత్యవసర ద్వారం నుంచే అనుమతించే ఏర్పాట్లు చేయాలని ఈవో సాంబశివరావు ఇంజినీర్లను ఆదేశించారు. ఉదయం10, మధ్యాహ్నం 3 గంటలకు అనుమతించే సమయంలో తాత్కాలిక క్యూలు ఏర్పాటు చేసి వారి నడక భారాన్ని తగ్గించాలని ఆయన ఆదేశించారు.