breaking news
Vadodara Airport
-
గుజరాత్లో కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చిన మోదీ అభిమానులు
వడోదర: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్లో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. టౌన్‌హాల్ సమావేశం కోసం ఆయన వడదోరలోని ఎయిర్‌పోర్టులో దిగగానే 'మోదీ, మోదీ' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఓ గుంపు ఆయనకు ఎదురుపడింది. అయితే కేజ్రీవాల్ మాత్రం వారికి చిరునవ్వుతో బదులిచ్చారు. మీడియా ప్రతినిధులంతా ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. తర్వాత సమావేశం నిర్వహిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంత మంది ఆప్ అభిమానులు బీజేపీకీ దీటుగా 'కేజ్రీవాల్, కేజ్రీవాల్' అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనపై బీజేపీ నేత ప్రీతి గాంధీ స్పందిస్తూ.. 'మోదీ అడ్డా అయిన గుజరాత్లో కేజ్రీవాల్‌కు సాదర స్వాగతం లభించింది' అంటూ సెటైర్లు వేశారు. #WATCH | Delhi CM and AAP national convener Arvind Kejriwal greeted with ‘Modi-Modi’ chants in Vadodara, Gujarat…later ‘Kejriwal-Kejriwal’ chants also heard. pic.twitter.com/dr8HB5Hw2q — ANI (@ANI) September 20, 2022 ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలోకి వచ్చిన ఆప్.. గుజరాత్‌లోనూ పాగా వేసి 27ఏళ్ల బీజేపీ పాలనకు చెక్ పట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే కేజ్రీవాల్ తరచూ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆప్ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి విజయం కోసం ఉత్సాహంతో పనిచేయాలని సూచిస్తున్నారు. గుజరాత్లో ప్రజలను ఆకర్షించేందుకు ఇప్పటికే ప్రజలపై హామీల వర్షం కురిపించారు కేజ్రీవాల్. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగులకు భృతి, ఢిల్లీ మోడల్ తరహాలో విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకొస్తామన్నారు. చదవండి: బీజేపీనే నెం.1.. థాక్రే ఖేల్ ఖతం -
త్వరలో తొలి రైల్వే యూనివర్సిటీ
-
త్వరలో తొలి రైల్వే యూనివర్సిటీ: మోదీ
వడోదర(గుజరాత్): వడోదర ఎయిర్ పోర్టులో అంతర్జాతీయ టెర్మినల్‌ను ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విమానయాన రంగం అభివృద్ధి కోసం కొత్త పాలసీ తీసుకు వచ్చామన్నారు. కేరళలోని కొచ్చి, గుజరాత్‌లోని వడోదరలో గ్రీన్ ఎయిర్ పోర్ట్‌లు పర్యావరణ అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో ఎంతో అధునికత వస్తోందని, రైళ్లలో కొత్త సాంకేతికత తీసుకొస్తామని చెప్పారు. త్వరలో వడోదరలో తొలి రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.