breaking news
V Chamundeswaranath
-
బీసీసీఐ ఎపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా చాముండేశ్వరనాథ్
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా ఆంధ్ర మాజీ క్రికెటర్ వి.చాముండేశ్వరనాథ్ ఎన్నికయ్యారు. ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఐసీఏ) పురుషుల క్రికెటర్ల ప్రతినిధిగా ఆయన కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. బుధ, గురువారాల్లో జరిగిన ఐసీఏ ఎన్నికల్లో అపెక్స్ కౌన్సిల్ పదవి కోసం ఎన్నిక జరిగింది. ఇందులో చాముండి 755–83 ఓట్ల తేడాతో రాజేశ్ జడేజాపై గెలుపొందారు. ఇప్పటి వరకు చాముండి ఐసీఏ ప్రతినిధిగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో ఉన్నారు. దిలీప్ వెంగ్‌సర్కార్ స్థానంలో ఎపెక్స్ కౌన్సిల్లోకి వచ్చిన ఆయన మూడేళ్ల పాటు పదవిలో ఉంటారు. ఐసీఏ ఎన్నికల్లో భారత మాజీ కెప్టెన్ శాంత రంగస్వామి అధ్యక్షురాలిగా, వి.సుందరమ్ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఎపెక్స్ కౌన్సిల్ మహిళా క్రికెటర్ల ప్రతినిధిగా సుధా షా ఎంపిక కాగా...ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో శుభాంగి కులకర్ణికి అవకాశం దక్కింది. చదవండి: IND vs AUS: కెప్టెన్సీ నుంచి తొలగిస్తారని భయపడ్డా: సూర్యకుమార్ యాదవ్ -
దీపా నిర్ణయంతో షాక్ తిన్నత్రిపుర సర్కారు
-
ఆ బీఎండబ్ల్యూ కానుక.. తిరిగి ఇచ్చేస్తుందట!
రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్‌లకు క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లు కానుకగా అందిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఖరీదైన కానుకను మెయింటెన్ చేయలేక తిరిగి ఇచ్చేద్దామనుకుంటోంది దీపా కర్మాకర్. రియో ఒలింపిక్స్ జిమ్నాస్టిక్‌లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన దీపకు, సింధు, సాక్షిలతోపాటు బీఎండబ్ల్యూ కారును హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ చాముండేశ్వరినాథ్ బహూకరించిన సంగతి తెలిసిందే. ఈ కారును భరించడం తనకు తలకుమించిన బరువు కావడంతో దానిని తిరిగి చాముండేశ్వరినాథ్‌కు ఇవ్వాలని ఆమె నిర్ణయించినట్టు తెలుస్తోంది. అగర్తలా వంటి చిన్న నగరంలో అంతటి ఖరీదైన, విలాసవంతమైన కారును ఉపయోగించడం దీప, ఆమె కుటుంబానికి కష్టంగా మారడం.. అగర్తలాలో ఇరుకురోడ్లు గుంతలు, గోతులతో అస్తవ్యస్తంగా ఉండటం వారు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణమని సమాచారం. అంతేకాకుండా వచ్చేనెలలో జర్మనీలో జరగబోయే చాలెంజర్స్ కప్ కోసం దీప సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బీఎండబ్ల్యూ మెయింటెన్స్ భరించే స్థోమత ఆమె వద్ద లేదని, అంతేకాకుండా ఎక్కువ సమయాన్ని ఆమె ప్రాక్టీస్ మీద దృష్టిపెట్టడంతో దీనిని ఉపయోగించే పరిస్థితి కూడా లేదని, అందుకే తిరిగి ఇచ్చేద్దామని భావిస్తున్నదని దీప కోచ్ బిశ్వేశ్వర్ నంది తెలిపారు. కారు తిరిగి ఇచ్చేద్దామన్న నిర్ణయం నిజానికి దీపది కాదని, కానీ దీప కుటుంబం, తాను కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు.