breaking news
U.S. military
-
ఇరాన్‌పై అత్యంత భారీ బాంబు
వాషింగ్టన్: ఇరాన్‌లోని ఇంధన మౌలికవనరులు, అణు కేంద్రాలే లక్ష్యంగా అతి భారీ దాడులకు అమెరికా మిలటరీ సన్నాహాలు చేస్తోంది. అమెరికా పొదిలో ఉన్న మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని పిలుచుకునే అతిపెద్ద నాన్–న్యూక్లియర్ బాంబును వేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే అనుమతి కూడా ఇచ్చినట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. యుద్ధం ఎటూ తేలకపోవడం, హార్మూజ్‌ను ఇరాన్ దిగ్బంధించడం, చమురు ధరలకు భారీగా రెక్కలు రావడం వంటి పరిణామాలు అధ్యక్షుడు ట్రంప్‌నకు కొరుకుడు పడని నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. మధ్యంతర ఎన్నికలు నవంబర్ 3వ తేదీన ముగిశాక, ఈ బాంబును పిక్‌యాక్స్ పర్వతం అడుగున ఇరాన్ అత్యంత పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్న అణుకేంద్రంపైనా దాడులు చేస్తామని ట్రంప్ గురువారం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం గమనార్హం. దాడులకు అతిపెద్ద బాంబును వాడుతామని చెప్పిన ఆయన..అణుబాంబును ప్రయోగించే అవకాశమే లేదని స్పష్టం చేశారు. అయితే, అమెరికా–ఇరాన్‌ల మధ్య 8 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారీ బంబు సీబీయూ–43/బీ మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ బాంబ్(ఎంఓఏబీ)ని ప్రయోగించడం వల్ల మరింత ముదిరే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఎంవోఏబీ బరువు సుమారు 9.8 టన్నులు. మొదటిసారిగా దీనిని 2017లో అఫ్గానిస్తాన్‌లోని ఐఎస్ సొరంగంపై వేశారు. అయితే, ఇరాన్ అణుకేంద్రంపై బీవోఎంబీ ప్రయోగం ఆశించిన ఫలితాలను ఇచ్చే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. -
గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో నౌకను అడ్డుకున్న అమెరికా
వాషింగ్టన్: ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఛేదించుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన మరో వాణిజ్య నౌకను అమెరికా సైన్యం అడ్డుకుంది. గాంబియా దేశ జెండా కలిగిన లియాన్ స్టార్ అనే భారీ రవాణా నౌక ఇరాన్ ఓడరేవులోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ రాత్రంతా అమెరికా దళాల నుండి వచ్చిన హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిందని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అమెరికా విమానాలు ఆ నౌకను నిలిపివేశాయని, ప్రస్తుతం అది అక్కడే ఉందని పేర్కొన్నారు. అయితే, అమెరికా దళాలు ఆ నౌకలోకి చెప్పారు. ఇప్పటిదాకా దిగ్బంధనాన్ని ఛేదించుకకొని రావడానికి ప్రయత్నిస్తున్న ఆరు నౌకలను అమెరికా సైన్యం అడ్డుకుంది. వాటిలో ఒకదానిని ముందుకు వెళ్లడానికి అనుమతించారు. -
సిరియాపై దాడికి అమెరికా సిద్ధం!
డమాస్కస్: రసాయన దాడి జరిపి 1,300 మంది పౌరులను బలిగొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిరియాపై సైనిక చర్యకు అమెరికా, దాని మిత్రదేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్సిద్ధమయ్యాయి. సిరియా సైనిక స్థావరాలపై పరిమిత దాడులు చేసే అంశంపై అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆలోచిస్తున్నారని ఆ దేశ అధికారులు చెప్పినట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక మంగళవారం తెలిపింది. క్షిపణులు, బాంబర్ విమానాలతో చేసే ఈ దాడులు రెండు రోజులకు మించి కొనసాగకపోవచ్చని వారు పేర్కొన్నట్లు వెల్లడించింది. ఒబామా ఆదేశిస్తే సిరియాపై చర్యలు తీసుకోవడానికి తమ సైన్యం సిద్ధంగా ఉందని అమెరికా రక్షణ మంత్రి హేగెల్ చెప్పారు. సిరియా సమస్యపై భారత్ స్పష్టమైన వైఖరి తీసుకోవాలని రాజ్యసభలో వామపక్షాలు, జేడీయూ డిమాండ్ చేశాయి.


