సిరియాపై దాడికి అమెరికా సిద్ధం! | U.S. military "ready" to attack Syria, Hagel says | Sakshi
Sakshi News home page

సిరియాపై దాడికి అమెరికా సిద్ధం!

Aug 28 2013 3:42 AM | Updated on Apr 4 2019 3:25 PM

రసాయన దాడి జరిపి 1,300 మంది పౌరులను బలిగొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిరియాపై సైనిక చర్యకు అమెరికా, దాని మిత్రదేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్‌సిద్ధమయ్యాయి.

 డమాస్కస్: రసాయన దాడి జరిపి 1,300 మంది పౌరులను బలిగొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిరియాపై సైనిక చర్యకు అమెరికా, దాని మిత్రదేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్‌సిద్ధమయ్యాయి. సిరియా సైనిక స్థావరాలపై పరిమిత దాడులు చేసే అంశంపై అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆలోచిస్తున్నారని ఆ దేశ అధికారులు చెప్పినట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక మంగళవారం తెలిపింది. క్షిపణులు, బాంబర్ విమానాలతో చేసే ఈ దాడులు రెండు రోజులకు మించి కొనసాగకపోవచ్చని వారు పేర్కొన్నట్లు వెల్లడించింది. ఒబామా ఆదేశిస్తే సిరియాపై చర్యలు తీసుకోవడానికి తమ సైన్యం సిద్ధంగా ఉందని అమెరికా రక్షణ మంత్రి హేగెల్ చెప్పారు. సిరియా సమస్యపై భారత్ స్పష్టమైన వైఖరి తీసుకోవాలని రాజ్యసభలో వామపక్షాలు, జేడీయూ డిమాండ్ చేశాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement