ఇరాన్ ఓడరేవుకు వెళ్తుండగా ఘటన
వాషింగ్టన్: ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఛేదించుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన మరో వాణిజ్య నౌకను అమెరికా సైన్యం అడ్డుకుంది. గాంబియా దేశ జెండా కలిగిన లియాన్ స్టార్ అనే భారీ రవాణా నౌక ఇరాన్ ఓడరేవులోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ రాత్రంతా అమెరికా దళాల నుండి వచ్చిన హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిందని అమెరికా అధికారి ఒకరు తెలిపారు.
గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అమెరికా విమానాలు ఆ నౌకను నిలిపివేశాయని, ప్రస్తుతం అది అక్కడే ఉందని పేర్కొన్నారు. అయితే, అమెరికా దళాలు ఆ నౌకలోకి చెప్పారు. ఇప్పటిదాకా దిగ్బంధనాన్ని ఛేదించుకకొని రావడానికి ప్రయత్నిస్తున్న ఆరు నౌకలను అమెరికా సైన్యం అడ్డుకుంది. వాటిలో ఒకదానిని ముందుకు వెళ్లడానికి అనుమతించారు.


