breaking news
unlisted companies
-
మార్కెట్లో లిస్ట్ కాకముందే కోటీశ్వరులు కావొచ్చా?
అన్‌లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం అనేది ప్రస్తుతం ఇన్వెస్టర్లలో బాగా ప్రాచుర్యం పొందుతున్న అంశం. స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాకముందే తక్కువ ధరకు ఈ కంపెనీల షేర్లు కొని, ఐపీఓ ద్వారా మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత అధిక లాభాలు సంపాదించవచ్చని చాలా మంది భావిస్తున్నారు. అయితే, మెరిసేదంతా బంగారం కాదని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల సెబీ సైతం అన్‌రెగ్యులేటెడ్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల కఠినంగా వ్యవహరిస్తుండటంతో అన్‌లిస్టెడ్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేముందు కొన్ని కీలక విషయాలను తెలుసుకోవడం అత్యవసరం.‘గ్రే మార్కెట్’ ఉచ్చులో పడకండి!అన్‌లిస్టెడ్ షేర్లు సాధారణంగా అధికారిక స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లభించవు. వీటిని ‘గ్రే మార్కెట్’ లేదా కొన్ని ప్రైవేట్ యాప్స్ ద్వారా విక్రయిస్తుంటారు. అయితే, వీటిలో ధరను పారదర్శకంగా నిర్ణయించరనే వాదనలున్నాయి. ఒక యాప్‌లో ఒక ధర ఉంటే, మరో చోట మరో ధర ఉండే అవకాశం ఉంది. సెబీ ఇప్పటికే ఇలాంటి అనధికారిక ప్లాట్‌ఫామ్‌ల పట్ల ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే అన్‌లిస్టెడ్ కంపెనీల్లో ఎంత లాభం ఉందో అంతే రిస్క్ కూడా ఉందని గమనించాలి.అన్‌లిస్టెడ్ కంపెనీలు అంటే ఏమిటి?స్టాక్ ఎక్స్ఛేంజీలు (NSE, BSE)లో నమోదు కాని కంపెనీలను అన్‌లిస్టెడ్ కంపెనీలు అంటారు. ఇవి సాధారణంగా స్టార్టప్‌లు కావచ్చు లేదా పబ్లిక్ ఇష్యూకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న పెద్ద కంపెనీలు కావచ్చు. వీటి షేర్లను ‘ప్రీ-ఐపీఓ (Pre-IPO) షేర్లు’ అని కూడా అంటారు.ఎలా పెట్టుబడి పెడుతారంటే..అన్‌లిస్టెడ్ మార్కెట్లో షేర్లు కొనడానికి నేరుగా స్టాక్ ఎక్స్ఛేంజీలు ఉండవు. దీనికోసం కొన్ని మార్గాలను అనుసరిస్తారు. ప్రస్తుతం అన్‌లిస్టెడ్ షేర్ల ట్రేడింగ్ కోసం Precise, UnlistedZone, Altius Investech.. వంటి చాలా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది స్టాక్ బ్రోకర్లు పర్సనలైజ్డ్ సర్వీసుల ద్వారా అన్‌లిస్టెడ్ షేర్లను విక్రయిస్తుంటారు. ఇంకో మార్గం ఏమిటంటే.. కంపెనీ ఉద్యోగులు తమకు వచ్చిన షేర్లను బయటి వ్యక్తులకు విక్రయించినప్పుడు వాటిని కొనుగోలు చేయవచ్చు.ఇన్వెస్ట్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలులిస్టెడ్ షేర్లను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవచ్చు. కానీ అన్‌లిస్టెడ్ షేర్లకు కొనుగోలుదారులు దొరకడం కష్టం. మీరు అత్యవసరంగా అమ్మాలనుకున్నప్పుడు అవి అమ్ముడుపోకపోవచ్చు.లిస్టెడ్ కంపెనీల వలె ఇవి ప్రతి త్రైమాసిక ఫలితాలను వెల్లడించాల్సిన అవసరం లేదు. కాబట్టి కంపెనీ ఫైనాన్షియల్ వివరాలు తెలుసుకోవడం కష్టమవుతుంది.సెబీ (SEBI) నిబంధనల ప్రకారం, ఒక కంపెనీ ఐపీఓకి వచ్చిన తర్వాత, అంతకుముందు కొన్న అన్‌లిస్టెడ్ షేర్లపై 6 నెలల వరకు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే లిస్ట్ అయిన వెంటనే మీరు వాటిని అమ్మలేరు.ఈ షేర్ల ధర డిమాండ్, సప్లై ఆధారంగా మారుతుంటుంది. అధికారిక ధర అంటూ ఏదీ ఉండదు కాబట్టి ఇతర ప్లాట్‌ఫామ్‌లతో ధరను సరిపోల్చుకోవాలి.లిస్టింగ్ అయ్యే విధానంఅన్లిస్టెడ్ కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అవ్వాలంటే సుదీర్ఘ ప్రక్రియను అనుసరించాలి. కంపెనీ ముందుగా ఐపీఓ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను నియమించుకుంటుంది. కంపెనీ తన పూర్తి వివరాలతో కూడిన డీఆర్‌హెచ్‌పీను సెబీకి సమర్పిస్తుంది. సెబీ ఈ నివేదికను పరిశీలించి అన్నీ బాగున్నాయని భావిస్తే అనుమతి ఇస్తుంది. కంపెనీ తన షేర్ ధరను నిర్ణయించి పబ్లిక్ ఇష్యూ తేదీలను ప్రకటిస్తుంది. ఐపీఓ సక్సెస్ అయ్యాక షేర్లు ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్‌కు అందుబాటులోకి వస్తాయి. దాంతో అన్‌లిస్టెడ్‌గా ఉన్న షేర్లు లిస్టెడ్ కేటగిరీలోకి మారతాయి.ఇదీ చదవండి: ఈ ఏడాది టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ కలకలం -
స్టార్టప్‌లకు 5 వేల్యుయేషన్ విధానాలు
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు అన్‌లిస్టెడ్ అంకుర సంస్థలు జారీ చేసే షేర్ల విలువను మదింపు చేసే విధానాలకు సంబంధించి కొత్త ఏంజెల్ ట్యాక్స్ నిబంధనలను ఆదాయపు పన్ను శాఖ నోటిఫై చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని 11యూఏ నిబంధనలో ఈ మేరకు సవరణలు చేసింది. దీని ప్రకారం అన్‌లిస్టెడ్ స్టార్టప్‌లు జారీ చేసే ఈక్విటీ షేర్లు, కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల (సీసీపీఎస్) వేల్యుయేషన్‌ను సముచిత మార్కెట్ విలువ (ఎఫ్‌ఎంవీ)కి పది శాతం అటూ ఇటూగా లెక్క కట్టవచ్చు. ప్రవాస ఇన్వెస్టర్లు అయిదు రకాల వేల్యుయేషన్ విధానాలను ఉపయోగించవచ్చు. ఆప్షన్ ప్రైసింగ్ విధానం, మైల్స్టోన్ అనాలిసిస్ విధానం మొదలైనవి వీటిలో ఉంటాయి. దేశీ ఇన్వెస్టర్లకు ఈ అయిదు విధానాలు వర్తించవు. రూల్ 11 యూఏ ప్రకారం దేశీయ ఇన్వెస్టర్లకు ప్రస్తుతమున్న డీసీఎఫ్ (డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో), ఎన్ఏవీ (అసెట్ నికర విలువ) విధానాలు వర్తిస్తాయి. ఎఫ్ఎంవీకి మించిన ధరకు షేర్లను విక్రయించడం ద్వారా స్టార్టప్‌లు సమీకరించిన నిధులపై వేసే పన్నును ఏంజెల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది తొలుత దేశీ ఇన్వెస్టర్లకే పరిమితమైనప్పటికీ 2023–24 బడ్జెట్లో విదేశీ పెట్టుబడులను కూడా దీని పరిధిలోకి తెచ్చారు. దీన్ని అమల్లోకి తెచ్చే దిశగా కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. అయిదు రకాల వేల్యుయేషన్స్ విధానాలను అందుబాటులోకి తేవడం వల్ల ఇన్వెస్టర్లకు పన్నులపరంగా కొంత వెసులుబాటు పొందే వీలు లభించగలదని డెలాయిట్ ఇండియా, నాంగియా అండ్ కో తదితర సంస్థలు తెలిపాయి. -
ఈ దేశాల నుంచి స్టార్టప్‌ల్లోకి పెట్టుబడులు.. పన్ను లేదు
న్యూఢిల్లీ: అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర 21 దేశాల నుంచి అన్‌లిస్టెడ్ భారత స్టార్టప్‌ల్లోకి వచ్చే పెట్టుబడులపై ఏంజెల్ ట్యాక్స్ వర్తించదని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. సింగపూర్, నెదర్లాండ్స్, మారిషస్ నుంచి వచ్చే పెట్టుబడులకు ఈ అవకాశం కల్పించలేదు. ఆస్ట్రేలియా, జర్మనీ, స్పెయిన్ ఆస్ట్రియా, కెనడా, చెక్ రిపబ్లిక్, బెల్జియం, డెన్మార్క్, ఫిన్లాండ్, ఇజ్రాయెల్, ఇటలీ, ఐస్ లాండ్, జపాన్, కొరియా, రష్యా, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ ఏంజెల్ ట్యాక్స్ మినహాయింపు జాబితాలో ఉన్నాయి. అన్‌లిస్టెడ్ కంపెనీల్లోకి వచ్చే విదేశీ పెట్టుబడులను ఏంజెల్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకొస్తూ బడ్జెట్లో ప్రతిపాదించారు. అనంతరం కొన్ని రకాల విదేశీ ఇన్వెస్టర్ల తరగతులను మినహాయించాలంటూ పరిశ్రమ నుంచి వినతులు రావడంతో.. ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. -
‘అన్‌లిస్టెడ్’ షేర్లూ.. డీమ్యాట్‌లోనే...
న్యూఢిల్లీ: అన్‌లిస్టెడ్ కంపెనీల్లో బినామీలను గుర్తించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్‌లిస్టెడ్ కార్పొరేట్ల షేర్లను డీమెటీరియలైజ్ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) మరికొన్ని వారాల్లో ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయా సంస్థల్లో సిసలైన వాటాదారులను గుర్తించేందుకు ఇది తో డ్పడగలదని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా 80,000–90,000 దాకా పబ్లిక్ కంపెనీలతో ఈ ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తోన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2017 మార్చి ఆఖరు నాటికి దేశీయంగా మొత్తం 11.7 లక్షల కంపెనీలు క్రియాశీలకంగా ఉన్నాయి. అయితే, ప్రస్తుతం షేర్ల డీమెటీరియలైజేషన్ ప్రక్రియ కేవలం 8,000 లిస్టెడ్ కంపెనీలకు మాత్రమే వర్తిస్తోంది. లక్షల సంఖ్యలో ఉన్న అన్‌లిస్టెడ్ సంస్థల షేర్లన్నీ ఎకాయెకిన డీమ్యాట్ చేయడం సాధ్యపడదు కాబట్టి ముందుగా పబ్లిక్ కంపెనీలతో మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సదరు సంస్థల్లో 5.5–6 కోట్ల మంది పైచిలుకు వాటాదారులపై ఇది ప్రభావం చూపొచ్చని అంచనా. సిసలైన లబ్ధిదారుల గుర్తింపు .. డొల్ల కంపెనీల్లో చాలా మటుకు యాజమాన్య వాటాలు బినామీల పేర్లమీదే ఉంటున్నాయని పసిగట్టిన ప్రభుత్వం.. అసలు యజమానులను కూడా గుర్తించేందుకు తగు నిబంధనల రూపకల్పనపైనా కసరత్తు చేస్తోంది. పది శాతం పైగా వాటాలున్న వారిని గణనీయంగా లబ్ధి పొందే యాజమాన్య అధికారాలున్న వారిగా వర్గీకరించాలని ప్రతిపాదించనుంది. అంతర్జాతీయ స్థాయిలో మనీలాండరింగ్‌పై పోరులో భాగంగా.. కంపెనీల చట్టంలో ఇప్పటికే కొత్తగా ఒక సెక్షన్ చేర్చడం జరిగింది. దీని ప్రకారం సిసలైన లబ్ధిదారులైన యజమానుల పేర్లతో ఆయా అన్‌లిస్టెడ్ సంస్థలు ప్రత్యేక రిజిస్టరు మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. కనీసం పాతిక శాతం లేదా ఆ పై స్థాయిలో వాటాలు ఉన్న వారిని ఈ కేటగిరీ కింద వర్గీకరించవచ్చంటూ కంపెనీల చట్టం చెబుతోంది. అయితే, బినామీలను గుర్తించే క్రమంలో.. మరింత మంది షేర్హోల్డర్లను కూడా ఈ కేటగిరీలోకి చేర్చేలా నిర్దేశిత వాటాల పరిమితిని పది శాతానికి కుదించాలని ఎంసీఏ భావిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశీ ఇన్వెస్టర్లపైనా ప్రభావం.. మొత్తం మీద ఈ కొత్త మార్పులన్నీ విదేశీ ఇన్వెస్టర్లపైనా ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఇంకా అనుమతి లేని రంగాల్లో ఇన్వెస్ట్ చేసిన వారిపై అధిక ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నారు. నిర్దేశిత గడువులోగా షేర్లను డీమ్యాట్ చేయాలంటూ నిబంధనలు అమల్లోకి వచ్చిన వెంటనే .. అన్‌లిస్టెడ్ సంస్థల నుంచి ఒక్కసారిగా ఫైలింగ్స్ Ðð ల్లువెత్తనున్నాయి. కంపెనీల చట్టం కింద.. సిసలైన లబ్ధిదారుల వివరాలు వెల్లడించకపోయిన పక్షంలో రూ. 50,000 దాకా జరిమానాతో పాటు రోజువారీ రూ. 1,000 దాకా పెనాల్టీ కూడా వర్తిస్తుంది. అంతే కాకుండా, ఆయా కేసులపై విచారణ చేసేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారం కూడా ఉంటుంది. -
అన్‌లిస్టెడ్ కంపెనీలు విదేశాలలో లిస్ట్‌కావచ్చు
ముంబై: అన్‌లిస్టెడ్ కంపెనీలు సరాసరి విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయ్యేందుకు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) అనుమతించింది. తద్వారా విదేశీ నిధులను సమీకరించేందుకు అవకాశాలను కల్పించింది. అంతేకాకుండా విదేశీ రుణాలను చెల్లించేందుకు కూడా ఈ నిధులను వినియోగించుకునేందుకు దేశీయ అన్‌లిస్టెడ్ కంపెనీలకు వీలుచిక్కనుంది. ప్రభుత్వం గరిష్టస్థాయి కరెంట్ ఖాతాలోటుతో సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆర్బీఐ తాజా చర్యలకు ప్రాముఖ్యం ఏర్పడింది. ఇంతవరకూ ఉన్న నిబంధనల ప్రకారం అన్‌లిస్టెడ్ కంపెనీలు విదేశాలలో ప్రత్యక్షంగా లిస్ట్అయ్యేందుకు వీలులేదు. ఇందుకు ముందుగా దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కావలసి ఉంటుంది. అయితే ఈ నిబంధనల తాజా సమీక్షలో భాగంగా ఆర్బీఐ విదేశాలలో ప్రత్యక్షంగా లిస్ట్అయ్యేందుకు అన్‌లిస్టెడ్ కంపెనీలను అనుమతిం చేందుకు నిర్ణయించింది. ఇందుకు వీలుగా విడుదల చేసిన నోటిఫికేషన్లో తొలి దశకింద రెండేళ్ల గడువును విధించింది. పరిశీలనార్థం ఈ గడువును విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే సెబీతో ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్న ఐవోఎస్‌సీవో, ఎఫ్ఏటీఎఫ్ వంటి అంతర్జాతీయ ఆర్గనైజేషన్ల ద్వారా మాత్రమే లిస్టయ్యేందుకు కంపెనీలను అనుమతిస్తారు. కాగా, నిధులను సమీకరించాక విదేశాలలో వాటిని వినియోగించని పక్షంలో, వాటిని 15 రోజుల్లోగా దేశీయంగా వాణిజ్య బ్యాంకులలో జమ చేయాల్సి ఉంటుంది.


