breaking news
under 13
-
స్పాన్సర్లు లేరు, ప్రభుత్వ మద్దతు లేదు.. అయినా చరిత్ర సృష్టించిన భారత యువ జట్టు
భారత్‌కు చెందిన ఓ యువ జట్టు ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్ టోర్నీని నెగ్గి చరిత్ర సృష్టించింది. కొద్ది రోజుల కిందట నార్వేలో జరిగిన నార్వే కప్ 2025లో పంజాబ్‌కు చెందిన మినర్వా అకాడమీ అబ్బురపరిచే ప్రదర్శనలతో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ అండర్-13 జట్టుకు బ్రాండింగ్ లేకపోయనా, స్పాన్సర్లు లేకపోయినా, ప్రభుత్వ మద్దతు లేకపోయనా సంచలనాలు సృష్టించింది. ఈ యువ జట్టు తమ అభిరుచి, పట్టుదలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఫైనల్లో మినర్వా అకాడమీ స్థానిక జట్టు ఎస్ఐఎఫ్పై 14-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. మినర్వా అకాడమీ తరఫున దనమోని, రాజ్ హ్యాట్రిక్ గోల్స్ సాధించారు. చింగ్కే, కే చేతన్, పున్షిబా, అమర్సన్, ఆజమ్, రీసన్ గోల్స్ చేశారు.ఈ టోర్నీలో మినర్వా అకాడమీ ఆది నుంచి సంచలన ప్రదర్శనలు నమోదు చేసింది. గ్రూప్ స్టేజీలో అలస్కా ఐఎల్పై 25-0, ఫోర్డ్ ఐఎల్-3పై 15-0, క్కొకెల్వ్డలాన్ ఐఎల్పై 22-0 గోల్స్ తేడాతో గెలుపొందింది.నాకౌట్ మ్యాచ్‌ల్లో రోగ్లాండర్స్పై (Round of 32) 11-0, అమ్డాల్ టొక్కెపై (Round of 16) 17-0, క్వార్టర్ ఫైనల్లో ఫైల్లింగ్స్డలెన్పై 18-1, సెమీస్‌లో రదథెల్ చరిఫ్ క్లబ్‌పై (పాలస్తీన్) 8-2 గోల్స్ తేడాతో నెగ్గి ఫైనల్‌కు చేరింది. ఈ టోర్నీలో మినర్వ అకాడమీ 8 మ్యాచ్‌ల్లో మొత్తం 130 గోల్స్ చేసింది. ఈ యూరప్ సీజన్లో భారత్‌కు చెందిన జట్లు మూడు టైటిళ్లు సాధించాయి. నార్వే కప్‌కు ముందు భారత జట్లు గోథియా కప్, డానా కప్‌లు గెలిచాయి.అనామక కుర్రాళ్లు ప్రతిష్టాత్మక నార్వే కప్ గెలిచిన తర్వాత స్వదేశంలో వారిపై ప్రశంసల జల్లు కురుస్తుంది. ఈ జట్టు యూరప్‌లో ట్రోఫీని మాత్రమే కైవసం చేసుకోలేదు. ప్రతి భారత ఫుట్‌బాల్ ప్రేమికుడి కలను సాకారం చేసింది. ఎక్కడో మారుమూల అకాడమీ నుంచి వచ్చి విశ్వవేదికపై భారత కీర్తిపతాకను రెపరెపలాడించింది. ఆట పట్ల అభిరుచి ఏమి చేయించగలదో నిరూపించింది. మొత్తంగా దేశం గర్వపడేలా చేసింది. -
నైనా ఖాతాలో ఐదో విజయం
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–13 చెస్ చాంపియన్‌షిప్ బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నైనా గొర్లి వరుసగా ఐదో విజయం నమోదు చేసి అజేయంగా నిలిచింది. బుధవారం జరిగిన నాలుగో రౌండ్లో వైజాగ్‌కు చెందిన నైనా 60 ఎత్తుల్లో మీరా సింగ్ (ఢిల్లీ)పై, ఐదో రౌండ్లో 80 ఎత్తుల్లో ఆముక్త (ఆంధ్రప్రదేశ్)పై గెలిచింది. ఐదో రౌండ్ తర్వాత నైనా ఐదు పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉంది. తెలంగాణకు చెందిన సంహిత పుంగవనం, బి.కీర్తిక 4.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ఓపెన్ విభాగంలో తెలంగాణ కుర్రాడు చల్లా సహర్ష ఐదో రౌండ్ తర్వాత 4.5 పాయింట్లతో మరో ఎనిమిది మందితో కలిసి రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. -
రాజా రిత్విక్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్స్ చెస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ కుర్రాడు రాజా రిత్విక్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అఖిల భారత చెస్ సమాఖ్య ఆధ్వర్యంలో నాగ్‌పూర్‌లో జరిగిన ఈ టోర్నీ అండర్-13 విభాగంలో రిత్విక్ రన్నరప్‌గా నిలిచాడు. తొమ్మది రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో 8 పాయింట్లు సాధించి రజతాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం మెహతా నైతిక్ (8, గుజరాత్)తో జరిగిన చివరి గేమ్‌ను రిత్విక్ (8) డ్రా చేసుకున్నాడు. ఇద్దరి స్కోర్లు సమం కావడంతో మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా మెహతాను విజేతగా ప్రకటించారు. దీంతో రిత్విక్‌కు రెండో స్థానం దక్కింది. ప్రస్తుతం రాజా రిత్విక్ జూబ్లీహిల్స్‌లోని ఆర్కిడ్స ఇంటర్నేషనల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. జాతీయ స్థారుులో సత్తా చాటిన రాణించిన రిత్విక్‌ను రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు ఎ. నరసింహారెడ్డి, కార్యదర్శి ఆనం చిన్ని వెంకటేశ్వర రావు అభినందించారు. ఈ టోర్నీలో మొత్తం 100 మంది క్రీడాకారులు తలపడ్డారు. గతంలో రిత్విక్ కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో రజతం, ఆసియన్ చెస్ చాంపియన్‌షిప్స్ (2013, 2014, 2015)లో స్వర్ణాలతో పాటు పలు జాతీయ పతకాలను సాధించాడు. -
రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్‌లో..
చీరాల విద్యార్థుల ప్రతిభ చీరాల రూరల్: రాష్ట్ర స్థాయి జూనియర్ షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీల విభాగంలో చీరాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి మెమెుంటోలు, షీల్డులు అందుకున్నారు. రాష్ట్ర స్థాయి షటిల్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలు ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించారు. పోటీల్లో చీరాలకు చెందిన షేక్ న్యుమెర్, నితీష్ భట్లు అండర్–13 డబుల్స్ విభాగంలో పాల్గొని రన్నరప్‌గా నిలిచారు. శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ పున్నయ్య చౌదరి షీల్డులు అందజేశారు.