breaking news
UK Election
-
కౌన్సిలర్ ఎన్నికల బరిలో ఉగ్రవాది
బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో రాబోయే మే నెలలో నగర కౌన్సిలర్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందులో ఓ ఉగ్రవాది పోటీ చేస్తుండటం షాకింగ్‌గా అనిపిస్తోంది. 1999లో యెమెన్‌లోని బ్రిటీష్ కాన్సులేట్, ఓ మసీదు, స్విస్ హోటల్‌పై బాంబు దాడులు జరగ్గా.. వీటిలో భాగమైన షాహిద్ భట్ దోషిగా తేలాడు. ఉగ్రవాద సంఘాలతో సంబంధాలు కారణంగా జైలుశిక్ష అనుభవించాడు.ఉగ్రవాది అబూ హమ్జాకు గతంలో అనుచరుడిగా ఉన్న భట్.. అప్పట్లోనే అఫ్ధానిస్తాన్, బోస్నియా, తర్వాత యెమెన్‌కు వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే తనపై వచ్చిన విమర్శలను షాహిద్ ఖండించాడు. బర్మింగ్‌హామ్ కౌన్సిలర్ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై తనని తాను సమర్థించుకున్నాడు.యెమెన్ కోర్టులో తప్పుడు వాంగ్మూలాల ఆధారంగా నాకు శిక్ష విధించారు. కౌన్సిలర్ ఎన్నికల్లో నాకే ఓటేయాలని ఎవరినీ బలవంతం చేయను. నచ్చకపోతే నాకు ఓటు వేయొద్దు అని షాహిద్ భట్ క్లారిటీ ఇచ్చాడు. షాహిద్ భట్.. ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూటమి తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. దీనికి అఖ్మద్ యాకుబ్, షకీల్ అఫ్జర్ నాయకత్వం వహిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గాజా, పాలస్తీనా అంశాలపై లేబర్ పార్టీ వైఖరితో అసంతృప్తిగా ఉన్న ఓటర్లపై ఈ కూటమి ప్రభావం చూపగలదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే కౌన్సిల్ ఎన్నికల్లో లేబర్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకుని ఈ స్వతంత్ర అభ్యర్థులు దెబ్బతీయగలదని అంచనా వేస్తున్నారు.బ్రిటన్ చట్టాల ప్రకారం, విదేశాల్లో లేదా దశాబ్దాల క్రితం జరిగిన నేరాల్లో శిక్ష అనుభవించినవారికి కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయి. ఈ నిబంధనలు భట్‌కు అనుకూలంగా మారాయి. ఈ వ్యవహారంపై ప్రముఖ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లేబర్ ఎంపీ జెస్ ఫిలిప్స్ మాట్లాడుతూ.. ఉగ్రవాద దోషిగా తేలిన వ్యక్తి ప్రజాప్రతినిధిగా పోటీపడటం అత్యంత దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. -
హోరాహోరీ పోరు: భారీగా పడిపోతున్న పౌండ్
లండన్ : బ్రిటన్ ఎన్నికల ఫలితాల్లో ఇరు పార్టీలు హోరాహోరీగా పోటీపడుతుండటంతో ఫౌండ్ విలువ భారీగా పడిపోతుంది. ఏ పార్టీకి మెజార్టీ ఫలితాలు దక్కకపోతుండటంతో పౌండ్ కూడా కుదుపులకు లోనవుతోంది. గురువారం ముగిసిన పోలింగ్ లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి థెరిసా మే, లేబర్ పార్టీ అధ్యక్షుడు జెరిమే కార్బిన్ లు పోటీ పడుతున్నారు. కరెన్సీ మార్కెట్లు మాత్రం కన్జర్వేటివ్ పార్టీకి చెందిన థెరిసా మేకే క్లియర్ మెజార్టీ వస్తుందని అంచనావేశాయి. కానీ ఫలితాలు పోటాపోటీగా వస్తుండటంతో పౌండ్ స్టెర్లింగ్ 1.27 డాలర్లకు పడిపోయింది. గురువారం ముగింపుకు ఇది రెండున్నర శాతం తగ్గింపు. యూరోకు వ్యతిరేకంగా కూడా పౌండ్ విలువ ఒకశాతం మేర పడిపోతోంది. జనవరి తర్వాత ఇదే అతిపెద్ద పతనమని తెలిసింది. ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా ట్రేడర్లు స్పందిస్తున్నారు. 318 సీట్లతో కన్జర్వేటివ్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని బీబీసీ అంచనావేసింది. కానీ పోల్ ఫలితాలు మాత్రం ఆశ్చర్యకరంగా వస్తున్నాయి. పౌండ్ విలువ మరింత కిందకి పడిపోతుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. నేడు వెల్లడికాబోయే ఫలితాలతో బ్రెగ్జిట్ అంశం కూడా ముడిపడి ఉంది. పార్లమెంటులో తన బలం పెంచుకొని అనంతరం సమర్థవంతంగా బ్రెగ్జిట్ చర్చలను సాగించేందుకు థెరిసా మే మూడేళ్లు ముందుగానే ఎన్నికలకు పిలుపునిచ్చారు.


