breaking news
UIDAI chairman
-
ఆధార్‌కు భారీ అప్‌గ్రేడ్.. ఇక మూడింతలు!
భారత డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థ అయిన ఆధార్ వినియోగం అంచనాలకు మించి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజుకు సుమారు 10 కోట్ల (100 మిలియన్ల) ఆధార్ ప్రామాణీకరణలను నిర్వహిస్తున్న వ్యవస్థను భవిష్యత్తులో రోజుకు 25–30 కోట్ల ప్రామాణీకరణలు నిర్వహించే స్థాయికి విస్తరించేందుకు మౌలిక వసతులను సిద్ధం చేస్తున్నట్లు యూఐడీఏఐ చైర్మన్ నీలకంఠ మిశ్రా తెలిపారు. ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ 2026లో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.ఆధార్ యాప్‌కు పెరుగుతున్న ఆదరణదేశవ్యాప్తంగా డిజిటల్ సేవల విస్తరణతో ఆధార్ వినియోగం మరింత పెరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం 600కుపైగా సంస్థలు తమ సేవలు, ప్రక్రియల్లో ఆధార్‌ను ఉపయోగిస్తున్నాయని వెల్లడించారు. ఇక కొత్త ఆధార్ యాప్‌కు ఆదరణ విపరీతంగా పెరుగుతోందన్నారు. యాప్ డౌన్లోడ్లు కొన్ని వారాల్లోనే సుమారు 5 కోట్ల నుంచి దాదాపు 6 కోట్లకు పెరిగాయన్నారు. ఈ యాప్ ద్వారా ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే నమోదైన మొబైల్ నంబర్, చిరునామా వంటి వివరాలను అప్డేట్ చేసుకునే సదుపాయం ఉంది.క్వాంటమ్ ముప్పును ఎదుర్కొనేందుకు కొత్త భద్రతఆధార్ మౌలిక వసతుల విస్తరణతో పాటు సైబర్ భద్రతకు యూఐడీఏఐ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. వచ్చే దశాబ్దానికి సంబంధించిన టెక్నాలజీ రోడ్‌మ్యాప్‌లో భాగంగా పోస్ట్-క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ (PQC)పై పనిచేస్తున్నట్లు మిశ్రా తెలిపారు. భవిష్యత్తులో శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్లు ప్రస్తుత పబ్లిక్-కీ క్రిప్టోగ్రఫీ వ్యవస్థలకు ముప్పుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతున్నారు. ఇదే సమయంలో ఆధార్ మౌలిక వసతులపై ప్రతిరోజూ వందలాది సైబర్ దాడుల ప్రయత్నాలు జరుగుతున్నాయని మిశ్రా తెలిపారు. వాటిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే పలు రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ఇదీ చదవండి: ఉద్యోగం మారితే EPF ఏమౌతుంది? -
ఆధార్ వ్యవస్థ పటిష్టం!
న్యూఢిల్లీ: ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ఎంత మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యారో తమ వద్ద అధికారిక సమాచారం లేదని ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆధార్ వల్ల పౌరులకు పటిష్టమైన, జీవితాంతం ఆన్లైన్లో ధ్రువీకరించుకోగల గుర్తింపుకార్డు లభించిందని ఉద్ఘాటించింది. ఆధార్ నమోదుకు వ్యక్తి ఫొటో, వేలి ముద్రలు, కంటి పాపకు సంబంధించిన వివరాలు మినహా కులం, మతం, భాష లాంటి సమాచారం కోరడం లేదంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు యూఐడీఏఐ సీఈఓ అజయ్ పాండే ఆధార్ నిర్వహణ, అమలు తీరుతెన్నులను వివరిస్తూ గురువారం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమాచార భద్రత, ఆధార్ సాకుతో ప్రజలకు ప్రభుత్వ పథకాల నిరాకరణ వంటి అంశాలపై బెంచ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.ఆధార్‌తో జరిపే లావాదేవీలపై యూఐడీఏఐ నిఘా పెట్టదని పేర్కొన్నారు. ప్రామాణిక ఎన్క్రిప్షన్ రేటు 256 కాగా, ఆధార్ వ్యవస్థ నిర్వహణకు 2048 బిట్ల ఎన్క్రిప్షన్ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. అసంపూర్తిగా ముగిసిన ఈ ప్రజెంటేషన్ ఈనెల 27న కొనసాగుతుంది. -
‘ఆధార్ చైర్మన్‌కు కేబినెట్ హోదా లేదు’
న్యూఢిల్లీ: ఆధార్ కార్డులకు సంబంధించిన యూఐడీఏఐ (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) చైర్మన్‌కు తమ ప్రభుత్వం కేబినెట్ హోదా ఇవ్వదని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం చెప్పారు. దీనిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాలని, కానీ తమ ప్రభుత్వం యూఐడీఏఐ చైర్మన్‌కు కేబినెట్ హోదా ఇచ్చేందుకు సముఖంగా లేదని స్పష్టం చేశారు. ఏపీ కేడర్ 1977 బ్యాచ్ విశ్రాంత ఐఏఎస్ అధికారి జె.సత్యనారాయణను యూఐడీఏఐ చైర్మన్‌గా మరో ఇద్దరిని సభ్యులుగా ప్రమాణం చేయించారు.


