breaking news
two students kidnapped
-
ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్!?
కారంచేడు: గుండుతో ఉన్న వ్యక్తి తమకు ఏవో కొనిస్తామని ఆశ చూపి బాపట్లలో కిడ్నాప్ చేయడంతో భయపడి తప్పించుకొచ్చామని ఇద్దరు విద్యార్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం వేకువ జాము వరకు కారంచేడు పోలీసుస్టేషన్ వద్ద హైడ్రామా నడిచింది. వివరాల్లోకి వెళితే... పర్చూరు మండలం గర్నెపూడికి చెందిన పులి నరేష్ కుమారుడు ఆకాష్, గుంటూరు జిల్లా బాపట్ల మండలం కర్లపాలేనికి చెందిన జాలాది ఆనంద్ కుమారుడు జాన్‌వెస్లీలు గుంటూరు జిల్లా బాపట్ల మూర్తినగర్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. వీరు శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కారంచేడు పోలీస్‌స్టేషన్ సమీపంలో సంచరిస్తుంటే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ప్రసన్నకుమార్ గమనించాడు. మీరు ఎవరు? ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించడంతో తమను ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి చీరాల వైపు తీసుకెళ్తుంటే తప్పించుకొచ్చామని చెప్పారు. వెంటనే స్పందించిన ప్రసన్నకుమార్ స్థానిక ఎస్ఐతో పాటు ఉన్నతాధికారులకు సమాచారం అందించి అందరినీ అలర్ట్ చేశాడు. ఉన్నతాధికారుల సూచన మేరకు చిన్నారులిద్దరినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. వారు కొద్ది సేపు పొంతన లేని సమాధానాలు చెప్పారు. అప్పటికే వారు ఆకలితో ఉండటంతో ఆ సమయంలో స్టేషన్ సమీపంలోని చిల్లర దుకాణం తెరిపించి చిరుతిళ్లు తినిపించారు. ఆకలి తీరిన తర్వాత ప్రసన్నకుమార్ వారిని నిదానంగా విచారించాడు. అప్పుడు వారు తమ హాస్టల్లోని టీచర్ కొడుతుండటంతో హాస్టల్ నుంచి పారిపోయి వచ్చామని అంగీకరించారు. వెంటనే బాపట్ల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హాస్టల్ నిర్వాహకులు వేకువ జామున 4 గంటలకు వచ్చి విద్యార్థులను తీసుకెళ్లారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులను గమనించి గంటల సమయంలో వారిని గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చడంలో చకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ ప్రసన్నకుమార్‌ను, ఆయనకు సహకరించిన వెంకట్రావును ఉన్నతాధికారులు, సిబ్బంది, హాస్టల్ నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. -
ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్
వేలూరు: వేలూరు సత్‌వచ్చారిలోని ఇద్దరు పాఠశాల విద్యార్థులు కిడ్నాప్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వివరాల్లోకి వెళితే... రంగాపురానికి చెందిన ట్రావెల్స్ యజమాని మురుగేషన్ కుమారుడు జగదీశన్, గాంధీనగర్‌కు చెందిన జాన్‌బాషా కుమారుడు మహ్మద్ అజీష్ వీరిద్దరూ గాంధీనగర్‌లోని ప్రవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. దీంతో వీరిద్దరూ స్నేహితులుగా ఉన్నారు. పాఠశాల పూర్తి చేసుకొని మహ్మద్ అజీష్ మాత్రం ఇంటికి వెళ్లేవాడు, జగదీశన్ ట్యూషన్‌కు వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో మహ్మద్ అజీష్ శుక్రవారం సాయంత్రం రాత్రి 8 గంటల వరకు ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అజీష్ కోసం పాఠశాలకు వెళ్లారు. తరగతి ముగిసిన వెంటనే అజీష్ ఇంటికి వెళ్లినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ట్యూషన్‌కు వెళ్లిన జగదీశన్ కూడా ఇంటికి రాక పోవడంతో ఇద్దరు తల్లిదండ్రులు వారి పిల్లలు కనిపించలేదని రాత్రి పూర్తిగా కుమారులను వెతకసాగారు. శనివారం మద్యాహ్నం 2 గంటల సమయంలో ఇద్దరు విద్యార్థుల నుంచి ఒక సెల్ నెంబర్‌కు ఫోన్‌కాల్ వచ్చింది. పాఠశాల ను ంచి బయటకు వచ్చిన ఇద్దరు విద్యార్థులను గుర్తు తెలియని వ్యక్తులు ఆ టోలో తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. ఆర్కాడు మణిగుండు వద్ద త మను దించి వేసి గుర్తు తెలియని వ్యక్తులు ఆటోను తీసుకెళ్లినట్లు తె లిపారు. దీంతో తల్లి దండ్రులు ఆర్కాడుకు వెళ్లి విద్యార్థులను పట్టుకున్నారు. సత్‌వాచ్చారి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ఫిర్యాదు చేశారు. దీ ంతో పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థులను విచారిస్తున్నారు.