breaking news
two phases
-
రెండు దశల్లో బిహార్ ఎన్నికలు
న్యూఢిల్లీ: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల రణరంగానికి తెరలేచింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కేంద్రం ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్న ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మొత్తం 243 స్థానాలకు గాను.. మొదటి దశలో నవంబర్ 6న 121 స్థానాలకు, రెండో దశలో నవంబర్ 11న 122 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వివరించారు. నవంబర్ 16 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనలో బిహార్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి(ఎంసీసీ) తక్షణమే అమల్లోకి వచి్చంది. నామినేషన్ల ప్రక్రియ మొదటి దశ పోలింగ్‌కు అక్టోబర్ 17న, రెండో దశ పోలింగ్‌కు అక్టోబర్ 20న ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో 7.43 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఎస్ఐఆర్ను ఓటర్ల జాబితా శుద్ధీకరణగా జ్ఞానేశ్ కుమార్ అభివరి్ణంచారు. ఈ ప్రక్రియ ద్వారా దాదాపు 69 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు చెప్పారు. అయితే, భారత పౌరసత్వం లేనికారణంగా ఎన్ని పేర్లు తొలగించారో ఆయన బయటపెట్టలేదు. మరణాలు, పౌరసత్వం లేకపోవడం, ఇతర రాష్ట్రాలకు శాశ్వతంగా వలస వెళ్లడం వంటి కారణాలతో పేర్లు తొలగించినట్లు స్పష్టంచేశారు. 8 అసెంబ్లీ స్థానాలకు వచ్చేనెల 11న ఉప ఎన్నికలు తెలంగాణ, రాజస్తాన్, పంజాబ్, జార్ఖండ్, ఒడిశా, మిజోరం తదితర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 11న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నట్లు తెలిపింది. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ బిహార్ ఎన్నికలు అన్ని ఎన్నికలకు తల్లిలాంటివని జ్ఞానేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. బిహార్ ఎన్నికల్లో 17 సంస్కరణలు చేపడుతున్నామని, దేశవ్యాప్తంగా వీటిని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. దేశ ఎన్నికల చరిత్రలో బిహార్ ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరిగిన ఎన్నికల్లో ఒకటిగా రికార్డుకెక్కబోతున్నాయని చెప్పారు. ఓటర్ల జాబితా శుద్ధీకరణ విషయంలో మొత్తం దేశానికి బిహార్ ఒక మార్గం చూపిందని అన్నారు. రాజకీయ పారీ్టల విజ్ఞప్తి మేరకు.. బిహార్‌లో ఈవీఎంల చివరి రెండు రౌండ్ల కౌంటింగ్ కంటే ముందే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తిచేస్తామని వివరించారు. మహిళలు ఓటు వేసే సమయంలో బుర్ఖా లేదా తలపై ముసుగు ధరించవచ్చా? అని ప్రశ్నించగా, ఓటర్ల గుర్తింపును నిర్ధారించే విషయంలో మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేస్తామని జ్ఞానేశ్ కుమార్ బదులిచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద అంగన్వాడీ కార్యకర్తలు విధుల్లో ఉంటారని, మహిళా ఓటర్ల గుర్తింపును వారు తనిఖీ చేస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో 250 పోలింగ్ బూత్‌ల పరిధిలో పోలీసులు గుర్రాలపై పెట్రోలింగ్ నిర్వహిస్తారని తెలియజేశారు. 197 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది పడవలపై అక్కడికి చేరుకుంటారని చెప్పారు. ఎన్నికలకు సిద్ధం కావడం దగ్గర్నుంచి, ఓట్ల లెక్కింపు దాకా.. మొత్తం 17 సంస్కరణలు చేపట్టబోతున్నామని మరోసారి స్పష్టంచేశారు. ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ వీటిని అమలు చేస్తామన్నారు. తొలిసారిగా ‘ఈసీఐ నెట్’ ఎన్నికల్లో పారదర్శకతను మరింత పెంచడానికి ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా బిహార్ ఎన్నికల్లో ‘ఈసీఐ నెట్’ను ప్రవేశపెడుతోంది. ఎన్నికల సంఘానికి సంబంధించిన 40కిపైగా యాప్‌లను ఒకే వేదికపైకి తీసుకొస్తూ ఈసీఐ నెట్‌ను రూపొందించారు. ఇదొక డిజిటల్ ప్లాట్‌ఫామ్. ఇది ‘మదర్ ఆఫ్ ఆల్ యాప్స్’ అని చెబుతున్నారు. బూత్ లెవెల్ అధికారులు, చీఫ్ ఎలక్టోరల్ అధికారులు సహా ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది దీన్ని వినియోగించుకుంటారు. ఓటర్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, రిపోర్టింగ్ తదితర పనులు దీనిద్వారా నిర్వహిస్తారు. ఫలితంగా వారిమధ్య సమన్వయం పెరుగుతుంది. ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. మొత్తానికి ఎన్నికల నిర్వహణ సులభంగా మారుతుంది. ఓటర్లు కూడా ఈ వేదికను వాడుకోవచ్చు. పోలింగ్ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే యాప్ ద్వారానే ఫిర్యాదు చేయొచ్చు. కౌంటింగ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. తొలుత బిహార్‌లో.. అనంతరం దేశమంతటా ఈసీఐ నెట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. -
సాగుకు రెండు విడతల విద్యుత్
♦ పగటివేళ 6 గంటలు, రాత్రివేళ 3 గంటలు సరఫరాకు ప్రభుత్వ నిర్ణయం ♦ పగటిపూటే నిరంతరాయంగా 9 గంటలు ఇస్తే సమస్యలు ♦ విద్యుత్ డిమాండ్‌లో విపరీత తారతమ్యాలతో గ్రిడ్‌పై ప్రభావం ♦ ఆర్థికంగానూ అనవసర భారం మోయాల్సిన పరిస్థితి ♦ 2 విడతల సరఫరానే ఉత్తమమని రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ సిఫారసు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయానికి పగటిపూటే నిరంతరాయంగా తొమ్మిది గంటల విద్యుత్ ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.. పలు సాంకేతిక కారణాలతో అందులో కొంత మార్పు చేస్తోంది. పగటిపూట నిరంతరాయంగా ఆరు గంటలు, రాత్రివేళలో మూడు గంటలు చొప్పున రెండు విడతలుగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించింది. వ్యవసాయానికి పగటిపూటే నిరంతరాయంగా సరఫరా చేయడం వల్ల రాత్రిపూట డిమాండ్ తగ్గి విద్యుత్ గ్రిడ్‌కు ప్రమాదకరంగా పరిణమించే అవకాశముండడం, భూగర్భ జలాలపై పెరిగే ఒత్తిడి, ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పగలు 6 గంటలు, రాత్రి 3 గంటలు చొప్పున సరఫరా చేయడమే మేలని రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ (టీఎస్పీసీసీ) చేసిన సిఫారసును ప్రభుత్వం ఆమోదించింది. ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో ప్రతినెలా సమావేశమయ్యే ఈ సమన్వయ కమిటీ రాష్ట్ర విద్యుత్ రంగానికి సంబంధించి నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోంది. గ్రిడ్ రక్షణ కోసమే.. రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం 6,000-7,000 మెగావాట్ల మధ్య ఉంటోంది. పగలూరాత్రి తేడా లేకుండా రెండు మూడు విడతల్లో 6 గంటలకు మించకుండా విద్యుత్ సరఫరా చేస్తేనే... వ్యవసాయానికి 2,500 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతోంది. అదే పగటిపూట 9 గంటలు నిరంతర సరఫరా చేస్తే వ్యవసాయ విద్యుత్ డిమాండ్ 7,000 మెగావాట్లకు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అంటే వ్యవసాయంతో పాటు గృహ, వాణిజ్య, పరిశ్రమలు తదితర కేటగిరీల్లో కలిపి పగటి వేళ మొత్తం విద్యుత్ డిమాండ్ మొత్తంగా 13,000 మెగావాట్ల గరిష్ట స్థాయి (పీక్ డిమాండ్)కి చేరుకుంటుంది. అదే వ్యవసాయానికి సరఫరా ఉండని రాత్రివేళల్లో మాత్రం విద్యుత్ డిమాండ్ 6,000 మెగావాట్లకు పడిపోతుంది. ఇదే జరిగితే విద్యుత్ గ్రిడ్‌ను పరిరక్షించడం కష్టమని విద్యుత్ శాఖ అభిప్రాయానికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పగలే 9 గంటల నిరంతర సరఫరా ఆలోచనను విరమించుకుంది. ఆర్థికంగా చూసినా ఈ హామీ అమలుతో డిస్కంలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. రాత్రివేళల్లో 6,000 మెగావాట్లే సరఫరా చేయాల్సి ఉన్నా... మొత్తం 13,000 మెగావాట్లకు సంబంధించిన స్థిరచార్జీలను విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు డిస్కంలు చెల్లించాల్సి వస్తుంది. రాత్రివేళల్లో జెన్కో ప్లాంట్లలో విద్యుదుత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న విద్యుత్ శాఖ... పగలే 9 గంటల విద్యుత్ సరఫరాపై వెనక్కి తగ్గింది. అయితే ముందు ముందు పగలే 9 గంటల విద్యుత్ సరఫరా చేసుకునే అవకాశం ఉంటుం దని మాత్రం ప్రభుత్వానికి వివరించడం గమనార్హం. మరోవైపు రైతులతో పాటు విద్యుత్ సంస్థల ప్రయోజనాల దృష్ట్యా రెండు విడతల సరఫరా చేయాలన్న నిర్ణయాన్ని విద్యుత్ రంగ నిపుణులు స్వాగతిస్తున్నారు. భూగర్భ జలాల ఇబ్బంది వర్షాలు బాగా కురిసి భూగర్భ జల మట్టాలు పైకి వచ్చిన సందర్భాల్లోనే బోరుబావుల నుంచి ఏకధాటిగా మూడు నాలుగు గంటలకు మించి నీళ్లు రావడం లేదని... బోరు రీచార్జ్ (తిరిగి నీటి స్థాయి పుంజుకోవాలంటే) కావాలంటే కొన్ని గంటలు వేచిచూడాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. అదే రెండు విడతల్లో విద్యుత్ సరఫరాతో మధ్యలో లభించే విరామంలో బోరు రీచార్జ్‌కు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఒకేవిడత 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తే పెద్ద రైతులు ఆపకుండా బోర్లను నడిపిస్తారని... దీంతో చుట్టుపక్కల ఉండే చిన్న, సన్నకారు రైతుల బోర్లు ఎండిపోతాయనే ఆందోళన కూడా వ్యక్తమైంది. -
ప్రాదేశిక పోరు 2 దశల్లో..
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: జిల్లాలో రెండు విడతలుగా మండల, ప్రాదేశిక ఎన్నికలు జరుగనున్నాయి. పురపాలక, సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా ఉన్న యంత్రాంగానికి ప్రాదేశిక ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాములా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను రెండు దశల్లో జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రాదేశిక పోరును రెండు దఫాలుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించడంతో ఆ మేరకు తేదీల ఖ రారుపై కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్లను రెండుగా విభజించి ఏప్రిల్ 6, 8వ తేదీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 6న వికారాబాద్, సరూర్‌నగర్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 16జెడ్పీటీసీలు, 261ఎంపీటీసీలు, ఏప్రిల్ 8న చేవెళ్ల, రాజేంద్రనగర్, మల్కాజిగిరి రెవెన్యూ డివి జన్లలోని 17జెడ్పీటీసీలు, 353 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించాలని జిల్లా యం త్రాంగం సూత్రప్రాయంగా నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నంకాకుండా పోలీసుశాఖతో చర్చించి రెండు దశల్లో ఎన్నికలు జరిపే మండలాలపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం రంగారెడ్డి ఎస్పీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ లేఖ రాశారు. బందోబస్తు సమస్యలు తలెత్తకుండా పోలీసుశాఖ సూచనల మేరకు ఏయే మండలాల్లో తొలి, మలి విడత ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలావుండగా, ఓట్ల లెక్కింపుపై మాత్రం ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఏప్రిల్ 11 లేదా 13వ తేదీల్లో ఓట్ల కౌంటింగ్‌ను నిర్వహించేందుకు ఈసీ మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాకు ఇద్దరు పరిశీలకులు జిల్లాలో మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పర్యవేక్షణకు ఇద్దరు పరిశీలకులను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు సంజయ్‌జాజు, వికాస్రాజులను ఎస్ఈసీ నియమించగా... ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకూ వీరు ప్రజలకు అందుబాటులో ఉంటారని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించడమేగాకుండా... ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై కూడా ఈ అధికారులు స్పందిస్తారని చెప్పారు. వికాస్‌రాజ్ : 81797 68735, సంజయ్‌జాజు : 81797 68736