breaking news
Twitter Birthday
-
‘కేటీఆర్ సర్.. మీరు సూపర్ హీరో’
యువనేతగా కేటీఆర్‌కు ఉన్న భారీ ఫాలోయింగ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆపదలో ఉన్నవాళ్లెందరికో.. ముఖ్యంగా కరోనా టైంలో సాయం అందించి హీరోగా జేజేలు అందుకున్నాడాయన. ఇవాళ కల్వకుంట్ల తారక రామారావు 45వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెలువల్లా వస్తున్నాయి. ‘ఈ ఏడాది రాబోయే రోజుల్లోనూ అంతా మీకు మంచే జరగాలి. మీ సానుకూల ధోరణి, దూరదృష్టి.. లక్షల మందికి మార్గదర్శకం. ‘కేటీఆర్.. మీరొక సూపర్‌స్టార్’. నాకే కాదు.. మొత్తం తెలంగాణకే మీరొక బార్న్ సూపర్‌స్టార్. మీ ఆప్యాయ కౌగిలింత కోసం.. అంటూ స్నేహాన్ని ప్రదర్శించాడు రియల్ హీరో సోనూసూద్. దీనికి బదులిచ్చిగా కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశాడు. Very kind words…Many thanks Sonu bhai 🙏 https://t.co/XeqyCgNe0Q — KTR (@KTRTRS) July 24, 2021 ఇక మంత్రి హరీష్ రావు విషెస్‌కి.. ‘థ్యాంక్స్ బావా’ అని బదులిచ్చాడు కేటీఆర్. ప్రొడ్యూసర్లు బండ్ల గణేశ్, పీవీపీ ట్విటర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగా.. బదులిచ్చాడు కేటీఆర్. అంతేకాదు సాయం కోసం ట్వీట్లు చేస్తున్నవాళ్లకు సైతం త్వరగతిన స్పందన ఇస్తున్నారు. Happy birthday @KTRTRS Wishing you a long healthy and prosperous life. pic.twitter.com/7CKU4s8ARQ — Harish Rao Thanneeru (@trsharish) July 24, 2021 పెగాసస్ వల్ల పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి కాల్ చేయలేకపోయానంటూ ఓ యూజర్ చమత్కరించగా.. ‘థ్యాంక్స్’ అంటూ బదులిచ్చాడు కేటీఆర్. సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా సోషల్ మీడియాలో విషెస్ చెబుతుండగా.. ఓపికగా చాలామందికి బదులిస్తున్నాడాయన. Surely will take care @KTRoffice please assist https://t.co/hLIQJhMy6w — KTR (@KTRTRS) July 24, 2021 ప్రజా సేవలో అలుపెరుగని నాయకుడు,ఐటీ రంగంలో రాష్ట్రాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చిన యోధుడంటూ పార్టీ కార్యకర్తల నుంచి బడా నేతల దాకా అంతా పొగడ్తలతో.. కేటీఆర్‌కు బర్త్‌డే శుభాకాంక్షలతో ముంచెతుతున్నారు. Last year on the eve of my birthday, I had personally donated 6 ambulances & our TRS MLAs & MPs joined in taking the total No. to 90! This year too, decided that the best way to celebrate is to #GiftASmile in personal capacity to 100 differently abled with custom made vehicles pic.twitter.com/9YcgpHgY7S — KTR (@KTRTRS) July 22, 2021 Many thanks Joel https://t.co/JCHFqg2Mft — KTR (@KTRTRS) July 24, 2021 -
మన్మోహన్‌కు శుభాకాంక్షల వెల్లువ!
న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని, రాజ్యసభ సభ్యుడు మన్మోహన్ సింగ్ గురువారం (సెప్టెంబరు 26) తన 87వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీతో సహా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం, పంజాబ్ సీఎం కెప్టెన్. అమరిందర్ సింగ్, శరద్ యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. 'మన్మోహన్ సింగ్ జీ పుట్టినరోజు సందర్భంగా దేశ నిర్మాణానికి ఆయన అందించిన నిస్వార్థ సేవ, అంకితభావం, సహకారాలను గుర్తుచేసుకుందాం' అని రాహుల్ గాంధీ ట్వీటర్లో పేర్కొన్నారు. అంతేకాక మన్మోహన్ సాధించిన విజయాలను గుర్తుచేస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక వీడియో క్లిప్‌ను విడుదల చేసింది. ఈ వీడియోలో మన్మోహన్‌ను 'దూరదృష్టి గల ఆర్థికవేత్త' గా అభివర్ణించింది. తన బాల్యం పంజాబ్‌లో గడిచిన తీరు, అతను 'కిరోసిన్ దీపం కింద' చదువుకొని, జీవితంలో ఎదిగిన తీరును గుర్తు చేశారు. అంతేకాక 1991లో ఆర్థిక వ్యవస్థ సరళీకరించడంతో పాటు 2008లో చంద్రయాన్-1ను ప్రారంభించిన ఘనత మన్మోహన్ సింగ్‌కే దక్కుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ట్విటర్ మాధ్యమంగా మన్మోహన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయూరారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ప్రార్థిస్తున్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా మన్మోహన్ సింగ్‌కు తన అభినందనలు తెలిపారు. As we celebrate Former PM Dr. Manmohan Singh, we look back at some of his greatest achievements. He has served our country for several decades & continues to do so with his renowned intelligence, humility & dedication. #HappyBirthdayDrSingh pic.twitter.com/AmRe39fc8s — Congress (@INCIndia) September 26, 2019 భారతదేశ భవిష్యత్తుపై తనకంటూ ఓ ఆలోచన ఉన్న రాజకీయ నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గురించి కొన్ని విషయాలు: 1991- 96 మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిగా, 2004-14లో ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ రాజకీయ జీవితాన్నిరెండు కాలాలుగా విభజించవచ్చు. తన పదేళ్ల పదవీకాలంలో బైపాస్ సర్జరీ (2009) చేయించుకున్నప్పుడు తప్ప.. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. అంతేకాక ప్రధానిగా ఉన్న సమయంలో రోజుకు 18 గంటలు పని చేసి, రోజుకు సగటున 300 ఫైళ్లు క్లియర్ చేసేవారు. జనవరి 2014లో మన్మోహన్ సింగ్‌పై మీడియా, బీజేపీ పార్టీ, ప్రత్యర్థి రాజకీయ నాయకులు.. ఆయన నాయకత్వం బలహీనంగా ఉందని తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. తాను బలహీనమైన ప్రధాని ఏమాత్రం కానని.. సమకాలీన మీడియా కంటే చరిత్ర తనకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలోకి వచ్చినా.. తాను మాత్రం ప్రధానిగా మూడవసారి కొనసాగబోనని ఆయన అనూహ్యంగా ప్రకటించారు. కాగా 2014 మేలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. -
సెలబ్రిట్వీట్స్
ఈ నెలలో ట్విట్టర్ బర్త్ డే ట్రంప్.. ట్విట్టర్ ప్రియుడు. మాట్లాడితే ట్విట్టర్లోకి వెళ్లి ఏదో ఒకటి ట్వీట్ చేస్తుంటారు. మనసులో ఏం ఉంచుకోరు! ఈ లెక్కన ట్విట్టర్లో ‘మోస్ట్ పాపులర్ లీడర్’ ట్రంపే అవ్వాలి కదా. కానీ కాదు! పూరి జగన్నాథ్ సినిమాల భాషలో చెప్పాలంటే.. ‘ఎన్ని ట్వీట్లు పెట్టారని కాదన్నయ్యా.. ఆ ట్వీట్లకు ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారన్నదే’ పాయింట్. ఆ లెక్కన ట్రంప్ కన్నా పాపులర్ లీడర్లు ఉన్నారు. ఈ నెలలో ట్విట్టర్ బర్త్ డే ఉంది. అంటే ఫౌండేషన్ డే. (లాంచ్ డే వేరే). ఈ సందర్భంగా ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉన్న దేశాధినేతలు, ట్విట్టర్లో వాళ్లెప్పుడు చేరారు? వాళ్లకు ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు? వాళ్లు పెట్టిన ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్.. మీ కోసం. బరాక్ ఒబామా అమెరికా మాజీ అధ్యక్షుడు ఫాలోవర్స్: 8 కోట్ల 51 లక్షలు. చేరింది: 2007 మార్చి విక్టరీ ట్వీట్: This happend because of you. (నీ వల్లే.. నీ వల్లే..) ఆ ట్వీట్‌కి ఒబామా పెట్టిన ఫొటో ఇదే. నరేంద్ర మోదీ భారత ప్రధాని ఫాలోవర్స్ : 2 కోట్ల 74 లక్షలు. చేరింది : 2009 జనవరి విక్టరీ ట్వీట్ : India has won! (భారత్ గెలిచింది!) డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఫాలోవర్స్: 2 కోట్ల 57 లక్షలు చేరింది: 2009 మార్చి విక్టరీ ట్వీట్: such a beautiful and important evening! The forgotten men and women will never be forgotten again. We will all come together as never before. (ఎంత అందమైన, ప్రాముఖ్యమైన సాయంత్రం. నిరాదరణకు గురైనవారు మళ్లీ ఇక నిరాదరణకు గురికాకూడదు. మునుపెన్నడూ లేనంతగా మనం ఏకం అవుదాం.) హిల్లరీ క్లింటన్ అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రి ఫాలోవర్స్: కోటీ 34 లక్షలు చేరింది: 2013 ఏప్రిల్ ఫేమస్ ట్వీట్: A man who can be provoked by a tweet should not have his hands anywhere near the nuclear codes. (ఒక్క ట్వీట్‌తో రెచ్చిపోయే మనిషికి అణ్వాయుధాలు అందుబాటులో ఉండకూడదు.) పోప్ ఫ్రాన్సిస్ రోమన్ క్యాథలిక్ చర్చి పోప్ ఫాలోవర్స్ : కోటీ 4 లక్షలు చేరింది : 2012 ఫిబ్రవరి ఫేమస్ ట్వీట్ : I cannot imagine a Christian who does not know how to smile. May we joyfully witness to our faith. (నవ్వడం ఎలాగో తెలియని క్రైస్తవుడిని నేను ఊహించలేకపోతున్నాను. మన విశ్వాసానికి ఉల్లాసం సాక్ష్యమవ్వాలి.) రెజీప్ తయ్యీప్ ఎర్డోగాన్ టర్కీ అధ్యక్షుడు ఫాలోవర్స్ : 90 లక్షల 90 వేలు చేరింది : 2009 ఆగస్టు ఫేమస్ ట్వీట్ : I don't like to tweet. It is a knife in the hand of a murderer. (ట్వీట్ చెయ్యడం నాకు ఇష్టం లేదు. అది హంతకుడి చేతిలో కత్తి లాంటిది.) షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్చూమ్ యు.ఎ.ఇ. ప్రధాని, ఉపాధ్యక్షుడు ఫాలోవర్స్: 70 లక్షల 50 వేలు చేరింది: 2009 జూన్ జెండర్ ట్వీట్: I salute all woman on International Women's Day. Every role a woman takes is sacred and deserves our appreciation and respect. (అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ సెల్యూట్ చేస్తున్నాను. స్త్రీ నిర్వహించే ప్రతి బాధ్యతా పవిత్రమైనది; గుర్తింపును, గౌరవాన్ని పొందదగినదీ.) సుష్మా స్వరాజ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఫాలోవర్స్: 70 లక్షల 30 వేలు చేరింది: 2010 నవంబర్ విక్టరీ ట్వీట్: I was sworn as youngest ever Cabinet Minister in the country in 1977... 39 years back. (39 ఏళ్ల క్రితమే 1977లో అతి చిన్న వయసు కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను.) జోకో విడూడూ ఇండోనేషియా అధ్యక్షుడు ఫాలోవర్స్: 70 లక్షలు చేరింది : 2011 సెప్టెంబర్ ఫేమస్ ట్వీట్: I don't mind being called a puppet. But I'm the puppet of the people. (నన్ను కీలుబొమ్మ అన్నా నేనేం పట్టించుకోను. నేను కీలుబొమ్మనే.. ప్రజల చేతుల్లో.) ఎరిక్ పెనా నియతో మిక్సికో అధ్యక్షుడు ఫాలోవర్స్: 60 లక్షల 20 వేలు చేరింది: 2007 మార్చి ఫేమస్ ట్వీట్ : I repeat what I told him in person: Mr.Trump, Mexico will never pay for the wall. (ఆయనకు ముఖాముఖి నేనేం చెప్పానో మళ్లీ చెప్తాను. ‘మిస్టర్ ట్రంప్, గోడ కట్టడానికి అయ్యే ఖర్చును మేము చెల్లించం’. క్రిస్టీనా ఫెర్నాండెజ్ డి కిష్నర్ అర్జెంటీనా మాజీ అధ్యక్షురాలు ఫాలోవర్స్: 40 లక్షల 80 వేలు చేరింది: 2010 ఏప్రిల్ బ్యాడ్ ట్వీట్: More than 1,000 participants at the event.. Are they all from the Campola and in it only for the lice and petloeum? (వెయ్యిమందికి పైగా ఈవెంట్‌కి వచ్చారు. వారంతో కంపోలా నుంచి, అది కూడా, లైస్ కోసం, పెట్రోలియం కోసం వచ్చారా?) క్రిస్టీనా.. చైనాలో పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి వారికి ఇంగ్లిష్ లెటర్ ‘ఆర్’ పలకడం రాదని.. కంపోరాను, కాంపోలా అనీ, రైస్‌ని లైస్ అనీ, పెట్రోలియంని పెట్లోలియం అనీ పలుకుతారనీ చేసిన ఈ ట్వీట్ ఆమె ఇమేజ్‌కు తగిన విధంగా లేదని విమర్శలు వచ్చాయి. జువాన్ మాన్యుయేల్ శాంటోస్ కొలంబియా అధ్యక్షుడు ఫాలోవర్స్: 40 లక్షల 80 వేలు చేరింది: 2009 ఆగస్టు ఇన్స్పైరింగ్ ట్వీట్:I congratulate Gabriela for getting 5 on her home work! So Colombia with better education. Our Gabriela and the country does not stop. (హోమ్‌వర్క్‌లో 5 మార్కులు సాధించిన గాబ్రియేలాకు అభినందనలు. కొలంబియా కూడా చదువులో ఇలాగే మెరుగవ్వాలి. గాబ్రియేలా, కొలంబియా ముందుకు సాగాలి.) మెట్టెయో రెంజీ ఇటలీ మాజీ ప్రధాని ఫాలోవర్స్: 20 లక్షల 90 వేలు చేరింది: 2009 జనవరి అందమైన ట్వీట్: Birthday special for a woman who the Italy loves. Happy birthday to Sophia Loren, four times twenty years old. (ఇటలీ ఎంతగానో ప్రేమించే స్త్రీకి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు. నాలుగు ‘ఇరవై ఏళ్ల’ సోఫియా లోరెన్‌కు హ్యాపీ బర్త్‌డే.) జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని ఫాలోయర్స్: 20 లక్షల 90 వేలు చేరింది: 2008 మార్చి పొలిటికల్ ట్వీట్ : Last week I challenged leaders in politics and business to do more for the middle class and help build a better world together. (మధ్య తరగతి ప్రజల సంక్షేమానికి, మెరుగైన ప్రపంచ నిర్మాణానికి మనమంతా కలసికట్టుగా ఇంకా ఏదైనా చెయ్యాలని గతవారం నేను రాజకీయ, వ్యాపార రంగాలలోని నాయకులకు పిలుపునిచ్చాను.) డేవిడ్ కామెరాన్ యు.కె. మాజీ ప్రధాని ఫాలోవర్లు: 10 లక్షల 60 వేలు చేరింది: 2008 మార్చి ట్వీట్ : My best wishes to British Sikhs celebration the birth of Guru Nanak Dev. You help make Britain a brighter, better and more successful nation. (గురునానక్ జయంతిని జరుపుకుంటున్న బ్రిటన్‌లోని సిక్కులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బ్రిటన్ ఒక ఉజ్వలమైన, మెరుగైన, విజయవంతమైన దేశంగా ఎదగడంలో మీ తోడ్పాటు ఉంది.) నికోలాస్ సర్కోజీ ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫాలోవర్స్: 10 లక్షల 50 వేలు చేరింది: 2012 ఫిబ్రవరి బెస్ట్ ట్వీట్: New life, new challenges! You're going to love it! I wish you the best, Dear. (కొత్త జీవితం, కొత్త సవాళ్లు! వాటిని ప్రేమగా స్వీకరించబోతున్నావు. శుభాకాంక్షలు ప్రియతమా.) ఒబామాను ఉద్దేశించి. దిమిత్రీ మెద్వెదెవ్ రష్యా ప్రధాని ఫాలోవర్స్: 10 లక్షల 10 వేలు. చేరింది: 2010 జూన్ ట్వీట్: silicon Valley's greatest asset is communication. People discuss their work not trifles. Russia would benefit from this kind of environment. (సిలికాన్ వ్యాలీకి ఉన్న గొప్ప సంపద.. సమాచార వ్యవస్థ. అక్కడివారు పని గురించి మాట్లాడతారు తప్ప, నిష్ప్రయోజనకరమైన విషయాలను చర్చించరు.)