breaking news
tv station
-
ఇరాన్ ప్రభుత్వ టీవీ కార్యాలయంపై దాడి
టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ప్రభుత్వ వార్తా చానల్ ‘ఇరిన్’ప్రధాన కార్యాలయ భవనంపై ఇజ్రాయెల్ సోమవారం క్షిపణులతో దాడి చేసింది. భవనం కొంతభాగం ధ్వంసమైంది. ఆ సమయంలో యాంకర్ సహర్ ఎమామి చదువుతున్న వార్తలతోపాటు దాడితో సంభవించిన పేలుడు శబ్ధం సైతం ప్రతిధ్వనించింది. భవన శిథిలాలు కింద పడుతున్న శబ్దాలు సైతం వినిపించాయి. స్టూడియో మొత్తం దుమ్ముతో నిండిపోయింది. యాంకర్ వెనుకనున్న స్క్రీన్ తెగిపోయింది. భయపడిన సహర్ ఎమామి వెంటనే కెమెరాను ఆపేసి, బయటకు పరుగుతీశారు. దీంతో కొద్దిసేపు వార్తల ప్రసారం నిలిచిపోయింది. అనంతరం సహర్ ఎమామి, మరో యాంకర్‌తో కలిసి ఇంకో స్టూడియోలో ప్రీ రికార్డెడ్ కార్యక్రమాలను కొనసాగించారు. పేలుడు కారణంగా భవనం అద్దాలు ధ్వంసమైన, ఇతర భాగాల్లో చెలరేగిన మంటలతో కూడిన వీడియోలు తర్వాత ఇరిన్లో టెలికాస్ట్ అయ్యాయి. కాగా, ఇరిన్ కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ దాడికి గంట ముందు ఇజ్రాయెల్ హెచ్చరికలు పంపింది. ఇరిన్పై దాడికి తామే కారణమని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. ఇరాన్ సాగించే దుష్ప్రచారానికి ప్రధాన వేదికపై ఆర్మీ దాడి చేసిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. ఇరాన్ నియంతృత్వం ఏరూపంలో ఉన్నా సహించేది లేదన్నారు. టెహ్రాన్ మూడో నంబర్ జిల్లాలో పలు టీవీ, రేడియో చానెళ్లతోపాటు ఇరిన్ కార్యాలయముంది. ఈ ప్రాంతంలో సుమారు 3.30 లక్షల మంది పనిచేస్తుంటారు. టెహ్రాన్‌ను ఖాళీ చేయండి: ఇజ్రాయెల్ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భీకర స్థాయిలో దాడులు చేయబోతున్నట్లు ఇజ్రాయెల్ తేల్చిచెప్పింది. టెహ్రాన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని సాధారణ ప్రజలకు సూచించింది. గతంలో గాజా, లెబనాన్‌లోనూ దాడులకు ముందు ఇజ్రాయెల్ సైన్యం ఇలాంటి హెచ్చరికలే జారీ చేసింది. టెహ్రాన్ గగనతలంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించామని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ స్పష్టంచేశారు. ఇరాన్‌లోని అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసి తీరుతామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ పునరుద్ఘాటించారు. తాము ఏం చేయాలని అనుకుంటున్నామో అది చేసి చూపిస్తామన్నారు.ఇరాన్లో వైద్యుడికి ఉరి 2023 నుంచి జైలులో ఉంటున్న మెడికల్ డాక్టర్ ఇస్మాయిల్ ఫెక్రీకి ఇరాన్ అధికారులు సోమవారం ఉరిశిక్ష అమలు చేశారు. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్‌కు అతడు సహరించినట్లు, ఇరాన్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని అందించినట్లు ఆరోపణలు రుజువయ్యాయని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.Israeli Air Force bombed Iran’s State TV headquarters live on air !Moments before the strike, they issued a evacuation warnings also TV headquarters is now completely destroyed..it’s a massive hit on Tehran’s media narrative stronghold. pic.twitter.com/Pu8xiAFcyG— Major Surendra Poonia (@MajorPoonia) June 16, 2025 -
టీవీ స్టూడియోలో దుండగుల దాడి..
-
టీవీ చానెల్‌పై సాయుధుల దాడి.. కాల్పుల బీభత్సం.. భీతావహం!
కాబూల్: ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. గుర్తుతెలియని సాయుధులు మంగళవారం కాబూల్‌లోని ఓ టీవీ చానెల్లోకి చొరబడి కాల్పులతో బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రముఖ టీవీ చానెల్ షంషాద్ ప్రధాన కార్యాలయంపై సాయుధులు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు మృతి చెందినట్టు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం భద్రతా బలగాలు టీవీ చానెల్‌ను చుట్టుముట్టి తమ అధీనంలోకి తీసుకున్నాయి. చానెల్లో కాల్పులతో విరుచుకుపడుతున్న సాయుధులను ఏరివేయడమే లక్ష్యంగా భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతోంది. ఒక సాయుధుడిని భద్రతా దళాలు మట్టుబెట్టాయని కాబూల్ పోలీసులు ప్రకటించారు. మిగతా సాయుధులను కూడా ఏరివేసి.. చానెల్ కార్యాలయాన్ని తమ అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని భద్రతా బలగాలు తెలిపాయి. త్రుటిలో తప్పించుకున్నాను: రిపోర్టర్ భారీ ఆయుధాలతో వచ్చిన సాయుధులు గ్రనేడ్లు విసురుతూ.. విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ.. చానెల్ కార్యాలయంలోకి చొరబడ్డారు. ఈ సమయంలో కార్యాలయంలోని చాలామంది సిబ్బంది, ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తోంది. కార్యాయలంలో చొరబడిన సాయుధులు కాల్పులు కొనసాగిస్తుండటంతో అందులోని ఉద్యోగులు భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేత పట్టుకొని గడుపుతున్నారు. సాయుధుల దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నట్టు చానెల్ రిపోర్టర్ ఒకరు మీడియాకు తెలిపాడు. చానెల్ కార్యాలయంలో భయానక వాతావరణం నెలకొందని, కాసేపటికోసారి కాల్పుల శబ్దం, ఉద్యోగాల హాహాకారాలు వినిపిస్తున్నాయని ఆయన వివరించారు. వందమందికిపైగా ఉద్యోగులు కార్యాలయ భవనంలో ఉన్నారని తెలుస్తోంది. ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారన్నది ఇంకా తెలియరాలేదు. ఇటీవల కాబూల్‌లో తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వరుస దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. -
30 రోజుల్లో అధ్యక్షుడిని అంతం చేస్తాం!
మాల్దీవులు: మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్‌ను 30 రోజుల్లో హత్య చేస్తామని ఓ వీడియో యూట్యూబ్‌లో హల్ చల్ చేసింది. దీంతో ఆ దేశ భద్రతా బలగాలు వెంటనే స్పందించి దానిని పోస్ట్ చేసిన 'సాంగు టీవీ' అనే ఓ ప్రైవేట్ టీవీ చానెల్‌పై రైడింగ్ నిర్వహించాయి. ఆ చానెల్లోని ఉద్యోగుల్లో ఎవరో ఒకరు దానిని పోస్ట్ చేసి ఉంటారని, ఉగ్రవాద కార్యకలాపాలకు వారు సహకరిస్తున్నారని అనుమానంతో సోదాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా మొత్తం 27 కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నాయి. అత్యవసర పరిస్థితి విధించిన కొద్ది రోజులకే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం అక్కడ సంచలనంగా మారింది. ఈ ఘటనపై టీవీ మేనేజింగ్ డైరెక్టర్ ఇబ్రహీం వహీద్ స్పందిస్తూ ఈ వీడియోను తాము అప్లోడ్ చేయలేదని, అనవసరంగా తమ చానెల్‌పై బలగాలు దాడులు నిర్వహించి సోదాలు చేసి ప్రసార కార్యక్రమాలు ఆపేశాయని చెప్పారు. 'ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనుకకు తీసుకోవాలి. ఈ మేరకు చేసిన చట్టాన్ని కూడా రద్దు చేయాలి. లేదంటే 30 రోజుల్లోగా అధ్యక్షుడు, టూరిజం మంత్రులపై దాడులు చేస్తాం. హత్యలు చేస్తాం. ఉగ్రవాద కార్యకలాపాలతో హోరెత్తిస్తాం' అంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పేరిట యూట్యూబ్‌లో మాల్దీవుల అధ్యక్షుడిని బెదిరిస్తూ ఓ వీడియో సంచలనం రేపింది. దీని గురించి పోలీసులు కోర్టు అనుమతితో ఆరా తీయగా అది 'స్లావరీ స్లేవ్' అనే పేరుతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సంకేతంతో పోస్ట్ చేశారు. ఇది సాంగు టీవీ పేరిట యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసినట్లుగా ఉంది.