breaking news
tried
-
మట్టికుండ చేసిన స్మృతి మంధాన.. ప్రతి పనిలోనూ పర్ఫెక్ట్ (ఫొటోలు)
-
బంగ్లాదేశ్ పౌరుల చొరబాట్లను తిప్పికొడుతున్న బీఎస్ఎఫ్
బంగ్లాదేశ్లో నెలకొన్న అశాంతి కారణంగా అక్కడి ప్రజలు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిని అడ్డుకునేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) నిరంతరం ప్రయత్నిస్తోంది. తాజాగా పశ్చిమ బెంగాల్లోని అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 140 మంది బంగ్లాదేశ్ పౌరులను భారత బలగాలు అడ్డుకున్నాయని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.ఆ దేశంలో నెలకొన్న అశాంతికి భయపడి అక్కడి జనం సరిహద్దుల్లో గుమిగూడుతున్నారని, అయితే అక్కడి తాత్కాలిక ప్రభుత్వం వారి భద్రతకు హామీ ఇచ్చిందని బీఎస్ఎఫ్ పేర్కొంది. అయినప్పటికీ అక్కడి పౌరులు కొందరు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బీఎస్ఎఫ్తో పాటు బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ భారత్లో చొరబాటుకు యత్నించింన 35 మంది బంగ్లాదేశ్ పౌరులను వారి ఇళ్లకు తిరిగి పంపించింది. -
మందలించాడని తండ్రిపై హత్యాయత్నం
కొత్తపల్లి (పిఠాపురం) : కుటుంబం రోడ్డున పడుతుందని, జాగ్రత్త ఉండాలని హితబోధ చేసిన తండ్రిపైనే ఆ కొడుకు కక్ష పెంచుకుని కత్తితో దాడి చేసిన సంఘటన కొత్తపల్లి మండలం కొండెవరం శివారు కాశివారి పాకల్లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కాశివారం పాకలుకు చెందిన వాసంశెట్టి గురువుల దంపతుల 9మంది సంతానంలో మూడో కుమారుడు వాసంశెట్టి లోవరాజు కొబ్బరికాయలు అమ్ముతూ జీవిస్తుంటాడు. మద్యానికి బానిసై చేసిన అప్పులు తీర్చడంలేదు. కాగా బుధవారం రాత్రి తన సోదరునితో గేదెలకు రక్షణగా వేసే దోమతెర విషయంలో ఘర్షణ పడ్డాడు. దీంతో తండ్రి గురువులు లోవరాజును మందలించాడు. దీంతో కక్ష పెట్టుకుని గురువారం మద్యం మత్తులో గురువులపై కొబ్బరికాయలు నరికే కత్తితో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన గురువులను స్థానికులు చికిత్సకోసం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కొత్తపల్లి ఎస్సై చైతన్యకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరారైన లోవరాజుపై హత్యాయత్నం కేసును నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పసిబిడ్డను వదిలించుకోవాలని ఓ అమ్మ ప్రయత్నాలు
-
హ్యాట్రిక్కోసం ట్రైచేస్తున్న శర్వానంద్